Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for నవంబర్ 2nd, 2008

హైదరాబాద్‌ : తిరుమల తిరుపతి దేవస్థానం సారథ్యంలో నిర్వహిస్తున్న కళ్యాణమస్తు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రాజధాని నగరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఎన్డీ తివారీ, ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Read Full Post »

న్యూఢిల్లీ:ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాట సొంతపార్టీలోనే చెల్లుబాటు కావటం లేదని సమాజ్‌వాదీ కార్యదర్శి అమర్‌సింగ్‌ విమర్శించారు. ‘మన్మోహన్‌ అంటే నాకు చాలా అభిమానం. ఆయన పదవిలో ఉన్నా లేకున్నా గౌరవిస్తాను. కానీ ఆయనకు తెలియకుండా కాంగ్రెస్‌లో చాలా జరుగుతున్నాయి. సొంతపార్టీ వారే ఆయన మాటలను ఖాతరు చేయటం లేదు’ అని అమర్‌సింగ్‌ స్టార్‌న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సత్యవ్రత్‌ చతుర్వేది తనను తెలివితక్కువవాడిగా అభివర్ణించటంపై సింగ్‌ మండిపడ్డారు. దీన్ని ప్రధాని దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా ప్రధాని ఆదేశించినా ఇంతవరకూ సత్యవ్రత్‌ దీనిపై స్పందించలేదని దుయ్యబట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తన శక్తికి మించి ఎంపీ సీట్లను కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. మైనార్టీలకు కాంగ్రెస్‌ సరైన రక్షణ కల్పించలేకపోయిందని పేర్కొన్నారు. ‘మైనార్టీలు కాంగ్రెస్‌ కంటే భాజపా పాలనలోనే సురక్షితంగా ఉన్నారు. కాంగ్రెస్‌ పాలిస్తున్న అన్ని రాష్ట్రాల్లో మైనార్టీలపై దాడులు జరిగాయి. ఢిల్లీ ఎన్‌కౌంటర్‌ కాంగ్రెస్‌ హయాంలోనే చోటు చేసుకుంది. ఒరిస్సా, కర్నాటక, మధ్యప్రదేశ్‌లో క్రైస్తవులపై వరుసగా దాడులు జరిగాయి’ అని అమర్‌సింగ్‌ పేర్కొన్నారు. ఓటుకు నోటు కుంభకోణానికి సంబంధించి పార్లమెంట్‌లో భాజపా నేత అద్వానీపై వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ‘నా వ్యాఖ్యలకు అద్వానీ బాధపడినట్లు ఓ మిత్రుడి ద్వారా తెలిసింది. దీంతో క్షమాపణలు చెప్పాను. ఆయన్ను మర్యాదస్తుడిగా భావిస్తున్నా’ అని సింగ్‌ చెప్పారు. బచ్చన్‌ కుటుంబీకులైన అభిషేక్‌, ఐశ్వర్యారాయ్‌ రాజకీయ ప్రచారంలో పాల్గొనాలని తాను కోరుకోవటం లేదని తెలిపారు.

Read Full Post »