Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for నవంబర్ 4th, 2008

హైదరాబాద్‌: తీవ్రవాద ఘటనల్లో కుటుంబ పెద్దదిక్కులను కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని నక్సల్‌ బాధిత కుటుంబాలు ముఖ్యమంత్రిని కోరాయి. ఆదిలాబాద్‌ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో కొన్ని నక్సల్‌ బాధిత కుటుంబాలు ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశాయి. తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న 504 జీఓను సవరించాలని కోరారు.

Read Full Post »

శ్రీహరికోట: భారతదేశ మొదటి మానవరహిత వ్యోమనౌక చంద్రయాన్‌-1 భూకక్ష్యను వీడి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఈరోజు ఉదయం ఇస్రోలో శాస్త్రవేత్తలు అత్యంత ముఖ్యమైన 5వ, ఆఖరుదైన కక్ష్యను పెంచే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఈ వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఇది భూమికి 3 లక్షల 80 వేల కిలోమీటర్ల దూరంలోను చంద్రునికి 500 కిలోమీటర్ల దూరంలోను ఉంది. శనివారంనాటికి ఇది చంద్రుడిని చేరవచ్చని ఇస్రో అధికార ప్రతినిధి సతీష్‌ తెలిపారు.

Read Full Post »

తెలుగు చిత్రసీమలో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ. ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా తనదైన శైలిలో పంచ్ డైలాగ్‌లను చెప్పడంలో  బాలకృష్ణది  ప్రత్యేక శైలి. రౌద్రరసం పలికించి.. డైలాగ్‌లలో గాంభీర్యాన్ని చూపడంలో బాలయ్య పెట్టింది పేరు. సాంఘిక చిత్రాలే కాక పౌరాణిక సినిమాల్లో  నటించి తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు.. గుంటూరులో జరిగే యువగర్జన ద్వారా తన పొలిటికల్ ఎంట్రీని గ్రాండ్‌గా ఇవ్వబోతున్నారు. తండ్రివారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణను అభిమానులు బాలయ్య అని పిలుచుకుంటారు. రాజసం ఉట్టిపడేలా కనిపించే ఆకర్షణీయమైన రూపంతో ప్రత్యర్ధులపై డైలాగ్‌లను విసరడంలో తండ్రి నందమూరి తారకరామారావును మరిపిస్తాడని అభిమానులు ముచ్చటపడతారు. వెండితెరపై తొడగొట్టి ప్రత్యర్దులకు సింహస్వప్నంలా మారి.. తన ఉగ్రరూపాన్ని చూపే సీన్లలో బాలకృష్ణది విలక్షణ శైలి.  ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం సమరసింహారెడ్డి. ఈ సినిమా ఆయన ఇమేజ్‌ని రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో నీ ఊరొచ్చా..నీ ఇంటికొచ్చా..అంటూ చెప్పే డైలాగులు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఊపుఊపాయి. నందమూరి వంశంలో ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నబాలకృష్ణ. ఖద్దర్ పంచె కడితే.. పదహారాణాల అంధ్రా యువకుడిగా కనిపించే బాలయ్య ఫ్యాన్స్ కు కనువిందు చేసారు. ఇప్పటికే పలువురు సినీనటులు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ వారికి భిన్నంగా బాలయ్య రాజకీయ ప్రవేశం ఉంటుందని  పరిశీలకులు బావిస్తున్నారు. తండ్రి పెట్టిన పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు బాలయ్య ఎంట్రీ  ఏమేరకు సహకరిస్తుందో వేచిచూడాలి.

Read Full Post »

గుంటూరులో యువగర్జన సదస్సు జరగనున్న ఎన్టీఆర్‌ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. సదస్సుకోసం సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. ఎద్దుకొమ్ములను ఇరువైపులా అలంకరించి గర్జించే సింహాలను ఉంచటంతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వేదికకు చుట్టుపక్కల ఏర్పాటుచేసిన నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌, తారకరత్న కటౌట్లు,పూల ప్రభలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.సదస్సు ఏర్పాట్లను నందమూరి తారకరత్న పర్యవేక్షించారు. యువగర్జన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని ఆయన అన్నారు.

Read Full Post »

ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ వడ్డీరేట్ల తగ్గింపుకు  అంగీకరించాయని  ఆర్థిక మంత్రి పి చిదంబరం తెలిపారు. పిఎస్‌యు బ్యాంక్‌ల అధిపతులతో ఇవాళ ఆయన భేటీ అయ్యారు. బ్యాంకులన్నీ  రుణాల రేట్లను 75 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా చిదంబరం పేర్కొన్నారు. ఆర్‌బిఐ ఇటీవల తీసుకున్న చర్యలతో  లిక్విడిటీ పరిస్ధితి మెరుగైందని  ఆయన చెప్పారు. అవసరమైతే మరిన్ని చర్యలు చేపడతామని బ్యాంకులకు ఆయన హామీ ఇచ్చారు. ఇక హౌసింగ్‌, కన్‌స్ర్టక్షన్‌ రంగాలకు తగినంత క్రెడిట్‌  అందుబాటులోకి తేవాలని సూచించారు. ఇక అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌  ఎస్‌బిఐ వడ్డీరేట్లను  అర శాతం వరకూ తగ్గించనున్నట్లు సంకేతాలు పంపింది. దీనిపై ఒకటిరెండురోజుల్లో  నిర్ణయించనున్నట్లు ఎస్‌బిఐ తెలిపింది.

Read Full Post »

పల్లెపల్లెకు గులాబిదండు పేరుతో తెలంగాణాలోని అన్ని నియోజకవర్గాలలో జరిగే పాదయాత్రను ఆ పార్టీ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈరోజునుంచి నవంబర్‌ 19 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతల ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ 19న ఆర్డీఓ కార్యాలయాలను తెరాస నేతలు, కార్యకర్తలు ముట్టడిస్తారు.

Read Full Post »

మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అవతరణ ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. పండగ వాతావరణం మద్య నిర్వహించిన ఈ ఉత్సవాలు ప్రవాసాంధ్రులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగుదనాన్ని చాటాయి. గవర్నర్‌ ఎన్‌.డి తివారీ జ్యోతి ప్రజ్వలన చేసి ఢిల్లీ ఏపి భవన్‌లో మూడు రోజుల క్రితం అవతరణ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు ముఖ్య అథిదులుగా పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న సమగ్రాభివృధి ని వివరించారు. తెలుగుకు ప్రాచీన హోదాతో పాటు… వైఎస్‌ అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని మంత్రి గీతారెడ్డి వివరించారు. ప్రవాసాంధ్రులను ఒకే చోటకు వచ్చేందుకు ఈ ఉత్సవాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఢిల్లీలో ఉన్న తెలుగు వారు ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఏపి భవన్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రా రుచులు తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్నాయని కొత్తతరం ప్రవాసాంధ్రులు చెబుతున్నారు. ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

Read Full Post »

హైదరాబాద్‌: యువగర్జనలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కోరారు. ముఖ్యంగా క్రమశిక్షణ పాటించాలన్నారు. గుంటూరు యువగర్జనకోసం హైదరాబాద్‌నుంచి ప్రారంభమైన మోటార్‌సైకిల్‌ ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. స్వయంగా బుల్లెట్‌ నడిపి యువకులను ఉత్సాహపరిచారు.హైదరాబాద్‌నుంచి 8వేల మోటారుసైకిళ్లతో ర్యాలీ గుంటూరుకు బయలుదేరింది. నగర మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి ఈ ర్యాలీకి నాయకత్వం వహిస్తున్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలనుంచి మరో 10 వేల మోటారుసైకిళ్లు ఈ ర్యాలీలో వచ్చి చేరతాయి.

Read Full Post »

మంత్రులు గొల్లపల్లి, జేసీ దివాకర్‌ రెడ్డి మధ్య చెలరేగిన వివాదానికి తెర పడిందని ఆర్థిక మంత్రి రోశయ్య అంటున్నారు. ఇందుకోసం ఆయన సచివాలయంలో పాత్రికేయుల ముందుకు ఇద్దరు మంత్రుల్ని తీసుకొని వచ్చారు. మొదట్లో ముభావంగా ఉన్న జేసీ, గొల్లపల్లి ఆ తర్వాత కామెంట్లు విసురుకొన్నారు. చివరగా మాట్లాడిన రోశయ్య వ్యవహారం ఇంతటితో ముగిసిందని చెప్పారు.

Read Full Post »

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. పర్యాటక ప్రాంతమైన కుఫ్రీ నుంచి సిమ్లా వెళుతున్న ఓ ప్రైవేటుబస్సు ఈరోజు ఉదయం లోయలోకి పడిపోయింది. మృతి చెందినవారిలో ఎక్కువమంది మహిళలు. క్షతగాత్రులను సమీపంలోని ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజి ఆసుపత్రిలో చేర్చారు.

Read Full Post »

Older Posts »