Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్ 11th, 2008

శ్రీకాకుళం: ప్రజల కోసమే ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిందని ఆపార్టీ అధికార ప్రతినిధి డా.మిత్రా అన్నారు. ప్రత్యమ్నాయం చూపకుండా పరిశ్రమల కోసం భూములను స్వాధీనం చేసుకునే విధానాన్ని తమ పార్టీ అంగీకరిందన్నారు. పరిశ్రమలకు తమ పార్టీ స్వాగతం పలుకుతుందని అయితే పరిశ్రమలకు ఎంత అవసరమో అంతే భూమిని కేటాయిస్తామని ఆయన అన్నారు. ఒకరి జీవనధారమైన భూమిని లాక్కొని ఇతరులకు అప్పగించటాన్ని ప్రజారాజ్యం పూర్తి వ్యతిరేకమన్నారు.

Read Full Post »

కడప: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.  పులివెందుల సమీపంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శామ్యూగ్లాస్‌ ఇండస్ట్రీకి వంద కోట్లతో నిర్మించనున్న టెక్స్ టైల్‌ పరిశ్రమకు బయోలాజికల్‌ ఇ కంపెనీలకు ఆయన శంకుస్థాపన చేశారు.

Read Full Post »

హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. రాజకీయాలంటే సినిమా నటన కాదని బల్లగుద్ది చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. అనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్‌ చిరంజీవిని ఉద్దేశించి చేసినవేనని వేరే చెప్పనవసరం లేదు. అదే సభలో పాల్గొన్న ఎ.ఐ.సి.సి అధ్యక్షురాలు సోనియాగాంధీ చిరంజీవి గురించి గాని, కొత్తగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ గురించి గాని ఒక్క మాట మాట్లడలేదు. తెలుగుదేశంకాని, మరే పార్టీకాని కాంగ్రెస్‌ను ఓడించజాలవని మాత్రం అన్నారు. అనంతపురం సభకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కిందటి నెలలోనే ఇక్కడే మీకోసం ముగింపు సభను భారీగా నిర్వహించగా, రాయలసీమలోనే తిరుపతి పుణ్యక్షేత్రంలో చిరంజీవి బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహించిన నేపధ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగ్గట్లుగానే జన సమీకరణ కూడా భారీగానే చేశారు. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే కాంగ్రెస్‌ సభకు జన సమీకరణ ఏ విధంగా జరిగినా వచ్చిన జనం నుంచి రాజశేఖర్‌రెడ్డికి స్పందన బాగానే వచ్చందని చెప్పాలి. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రచారం ఆరంభమైనట్లు భావించాలి. ఎవరికివారు తమ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లడానికి తంటాలు పడుతున్నారు. అయితే కాంగ్రెస్‌ విషయంలో కొన్ని యత్నాలు చేసి ఆశలు వదులుకున్నట్లే కన్పిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వామపక్షాలను, టి.ఆర్‌.ఎస్‌.లను కలిపి ఒక కూటమిగా తయారు చేయడానికి అన్ని రకాల వ్యూహాలను అవలంభిస్తున్నారు. అందులో భాగంగానే స్పీకరుపై అవిశ్వాస తీర్మానంపై సభ ఆకస్మికంగా వాయిదా పడినందుకు జరిపిన నిరసన కార్యక్రమాలలో లెఫ్ట్‌, టి.ఆర్‌.ఎస్‌., బి.ఎస్‌.పిలతో కలిసి చంద్రబాబు, ఆయన పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆయన ప్రయత్నాలు కొంతవరకు ఫలించే సూచనలు ఉన్నా, ఎన్నికల నాటికి ఏ రూపమైనా తీసుకోవచ్చు. ప్రజారాజ్యం పార్టీ కూడా లెఫ్ట్‌తో జతకట్టడానికి కొంత యత్నించి ఇప్పటికి ఆ యత్నాన్ని విరమించుకుంది.
ఈ విషయాలు ఇలా ఉంటే సినీ నటులు ప్రజా సేవ చేస్తున్నారు కాని రాజకీయనాయకులా నటించడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్‌ వ్యాఖ్యానించి ముఖ్యమంత్రి మాటలను తిప్పికొట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తాను చిరంజీవిని ఉద్దేశించి అన్నానని ఎందుకు అనుకుంటారని ప్రశ్నిస్తూ, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అని వ్యాఖ్యానించారు. అయితే  ఆ తర్వాత మూవీ ఆర్టీస్టుల సంఘం ఎన్నికల సందర్భంగా ప్రఖ్యాత సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు సినీనటులను కించపరిస్తే సహించజాలనని అన్నారు. అలాగే మురళీమోహన్‌ మాట్లాడుతూ తమలో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా, సినిమావారిని అవమానిస్తే మాత్రం అంతా ఒకటవుతామని, తమదంతా సినిమాకులం అని. నట కులమని వ్యాఖ్యానించారు. మొత్తంమీద ఒక విషయం ఏమిటంటే సినీ నటనకు, రాజకీయానికి విడదీయరాని సంబంధం ఏర్పడిందన్నది వాస్తవం. ఇది ఈ రోజే మొదలైందనుకుంటే పొరపాటు. గతంలో కొంగర జగ్గయ్య కాంగ్రెస్‌ ఎమ్‌.పిగా గెలుపొందారు. ఆ రోజుల్లో ఆయన కంచుకంఠంతో ఉపన్యసిస్తూ ప్రజల్ని ఉర్రూతలూగించేవారు. తదుపరికాలంలో ఎన్‌.టి.ఆర్‌.తో సినీయుగం ఊపందుకుందని చెప్పవచ్చు. అప్పటినుంచి సినిమా పరిశ్రమలో కూడా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎన్‌.టి.ఆర్‌కు పోటీగా కృష్ణ, విజయనిర్మల దంపతులు పెద్ద ఎత్తున 1984,85లలో ప్రచారం చేశారు. వేలాది జనం హాజరైనా, ఓట్లు మాత్రం ఎన్‌.టి.ఆర్‌.వైపే పడ్డాయి. ఇలా సినీ రంగం వివిధ పార్టీలలో ముఖ్య భూమిక పోషించారు. ఎన్‌.టి.ఆర్‌ తర్వాత చంద్రబాబు హయాంలో కూడా కొందరు సినీ నటులు ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. కాని 2004లో ఓటమి చవిచూడక తప్పలేదు. ఇప్పుడు కొత్తగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి రాజకీయ నేతలకు సరికొత్త సవాల్‌ విసురుతున్నారు. ఇప్పుడు సినీ ప్రపంచం మూడు వర్గాలుగా చీలుతోంది. అందులో భాగంగానే రాజశేఖర్‌, జీవిత దంపతులు చిరంజీవికి వ్యతిరేకంగా ఇప్పటికే తమ ప్రచార దాడిని ఉధృతం చేశారు. చిరంజీవి చేసిన సేవ ఏముందని ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌లో కాకలు తీరిన నేతలు కూడా చేయని విమర్శలు సాగిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్‌లో, ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అభిమానాన్ని బాగానే చూరగొంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కృష్ణ కుమారుడు మహేష్‌బాబును ప్రచారంలో పెట్టడం ద్వారా ఇటు చిరంజీవి పార్టీని, అటు తెలుగుదేశం పక్షాన ప్రచార యుద్దంలో దిగనున్న బాలకృష్ణ, జూనియర్‌ ఎన్‌.టి.ఆర్‌. తదితరులకు కొంత అడ్డుకట్ట వేయాలని వ్యూహం పన్నింది. కాని అది అంతగా ఫలించినట్లు లేదు. ఏది ఏమైనా సినీ రంగం మూడు కూటములుగా మారి రాజకీయరంగంలో తన వంతు పాత్ర పోషించడానికి సన్నద్దమవుతోంది. అందువల్ల రాజకీయంలో నటన, సినిమాలలో రాజకీయం మమేకం అవుతున్నాయని అనుకోవడంలో తప్పులేదేమో!

Read Full Post »

హైదరాబాద్: చిరంజీవి రాజకీయంరంగ ప్రవేశం ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి సంగతేమో కాని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మా చెడ్డ చికాకు తెచ్చిపెడుతోంది. ప్రతిపక్షంలో ఉండడంతో ఎక్కువమంది తన పార్టీ నాయకులే ప్రజారాజ్యంలోకి వలస వెళుతుండడం, దానిని కట్టడి చేసుకోవడానికి రకరకాల వ్యూహాలు అనుసరించాల్సి రావడం ఒక సమస్యగా ఉంటే ఇప్పుడు పొత్తుల వ్యవహారంలో కూడా చంద్రబాబుకు, చిరంజీవికి మధ్య పోటీ ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో వెళ్ళే పార్టీలు టిడిపితో దోస్తి కట్టకూడదనేది ప్రజారాజ్యం వాదనగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు కూడా ఇదే రీతిలో ఎటువైపు వెళ్లాలా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. కెసిఆర్‌ కొంతకాలం క్రితం చెప్పినట్లు ఆయన పార్టీ ఇప్పుడు క్రాస్‌రోడ్స్‌లో ఉన్నట్లు లెక్క. చంద్రబాబు, కెసిఆర్‌ల మధ్య గత ఏడేళ్లుగా వ్యవహారం ఉప్పు,నిప్పు మాదిరి నడిచింది. సమైక్య రాష్ట్ర వాదానికి ప్రతినిధిగా చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పేవారు! ఆ సంగతి గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. 2004 ఎన్నికలలో ఓటమి తర్వాత కూడా మహానాడులో సమైక్య రాష్ట్రవాదానికి కట్టుబడి ఉన్నట్లు తీర్మానం చేశారు. అలాంటి పార్టీ ఇప్పుడు క్రమేపి సరైన సమయంలో సరైన నిర్ణయంతో మొదలై, తెలంగాణాకు వ్యతిరేకం కాదు అనడం నుంచి రకరకాలుగా గొంతు సవరించుకుంటూ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ కోర్‌ కమిటీ ఏర్పాటైనప్పుడు కూడా దీని ఆనుపానులపై విశ్లేషించుకుని నిజానికి నాలుగైదు జిల్లాల్లో మాత్రమే టి.ఆర్‌.ఎస్‌.ప్రభావం ఉందన్న అభిప్రాయంతో ఉండేది. దేవేందర్‌గౌడ్‌, కడియం శ్రీహరి, గత ఏబై ఏళ్లుగా సమైక్యవాదిగా ఉండి ఆకస్మికంగా ప్రత్యేకవాదిగా మారిన చెన్నమనేని రాజేశ్వరరావు వంటివారు తెలంగాణా నినాదం చేపట్టడంతో పార్టీలో ఇది కొత్త సమస్యలకు దారి తీసింది. కారణం ఏదైనా దేవేందర్‌గౌడ్‌, పెద్దిరెడ్డి వంటివారు తమదారి, తాము చూసుకుని సొంత కుంపటి పెట్టుకున్నారు. వారితో పాటు వెళతారనుకున్న కడియం శ్రీహరి కంట్రోల్‌ అయ్యారు. అలాగే రాజేశ్వరరావు కూడా. అయితే పార్టీలో బలంగా తెలంగాణ వాణిని విన్పిస్తూ వచ్చారు. కోర్‌ కమిటి అభిప్రాయ సేకరణ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లొండ జిల్లాల్లోని కొందరు నాయకులు ప్రత్యేక రాష్ర్టాన్ని వ్యతిరేకిస్తే, కోస్తాలోని కొందరు నాయకులు తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అన్నట్లు నిర్వేదంగా మాట్లాడారు. చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదుకాని, తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి అనుకూలమైన నినాదానికి దగ్గరగా ఉన్నట్లు పరిణామాలు గోచరిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే టిఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఆయా ఆందోళనలలో పాల్గొనడం, కెసిఆర్‌తో సంప్రదింపులు జరపడం వంటివి జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టిడిపి బృందం ఒకటి కెసిఆర్‌ను కలిసి వచ్చినట్లు ఒక పత్రిక కధనాన్ని అందించింది. అదే పత్రిక ఆ తర్వాత రోజు కెసిఆర్‌, చంద్రబాబులు ఫోన్‌లో సంభాషించుకున్నట్లు వార్తను ప్రచురించింది. ఈ వార్తలను ఇరువైపుల వారు ఖండించడం లేదు. దీనిని బట్టి చంద్రబాబు టి.ఆర్‌.ఎస్‌.తో పొత్తుకు ఎంత ఆసక్తి కనబరుస్తున్నది అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు టి.ఆర్‌.ఎస్‌.తో పొత్తు అంటే తీవ్రవాదులతో స్నేహం అన్నట్లుగా మాట్లాడిన టిడిపిలో వచ్చిన ముఖ్యమైన మార్పు ఇది. అదేరీతిలో టిడిపిని శత్రుపక్షంగా పరిగణించిన కెసిఆర్‌ కూడా ఇప్పుడు టిడిపిని ఆ ధోరణితో చూడడం లేదు. తెలంగాణాకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే అదే పదివేలు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఒకరకంగా ఆయనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే పరిణామమే. గత ఉప ఎన్నికల తర్వాత కొంచెం డీలాపడ్డ కెసిఆర్‌కు ఇది సంతోషకరమైన విజయమే. అయితే కింది స్థాయిలో, మేధావుల పరంగా టిడిపితో కలవడానికి ఇష్టపడడంలేదన్న సంకేతాలు టిఆర్‌ఎస్‌కు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అయితే దీనిని ఎలాగొలా సర్దుబాటు చేసుకోగల నేర్పు కెసిఆర్‌కు ఉంది. టిడిపి, టిఆర్‌ఎస్‌లకు సిఎం తోడైతే ఇది ఒక ముఖ్యమైన కూటమి అవుతుంది. సిపిఎం ఇప్పటికీ సమైక్యవాదానికే కట్టుబడి ఉంది. అయినా ఈ కూటమి ఏర్పడుతుందా అన్నది చూడాలి. కూటమి కాకపోతే సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఈ ప్రయత్నాలు ఇలా ఉంటే మరోవైపు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం, సిపిఐలతోపాటు టి.ఆర్‌.ఎస్‌లను కలపడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిపిఐ కార్యదర్శి కె.నారాయణ ఇప్పటికే ఇందుకు అవసరమైన ప్రాతిపదికను తయారు చేశారని చెప్పాలి. నారాయణ ముందుగానే కెసిఆర్‌తో, చిరంజీవితో నేరుగా చర్చలు జరుపడమే కాక, దేవేందర్‌గౌడ్‌తో ఫోన్‌లో మంతనాలు జరిపారు. వీలైతే సిపిఎంను కూడా తమవెంటే తీసుకువెళ్లాలని అనుకుంటున్న సిపిఐ ఎప్పటికప్పుడు సిపిఎంతో చర్చలు జరుపుతున్నా, కొన్ని విషయాలలో అభిప్రాయబేధాలు ఉన్నట్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెబుతోంది. టిడిపితో జట్టుకట్టకుండా చిరంజీవితో కలిసి నడవాలని సిపిఐ నాయకులు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో చిరంజీవి పార్టీకి కూడా తెలంగాణాలో పొత్తులు అవసరం అన్న అభిప్రాయం ఉంది. బలమైన నెటవర్క్‌ ఉన్న టి.ఆర్‌.ఎస్‌. అయితే అది ఉపయోగంగా ఉంటుందని వీరు భావిస్తున్నారు. ఇదే సమయంలో దేవేందర్‌ పార్టీతో కలిసి వెళితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ఉంది. తెలంగాణాలోనే కాక ఇతర ప్రాంతాలలో కూడా బిసివర్గాన్ని ఆకట్టుకోవడానికి ఇది కొంతమేర ఉపయోగపడవచ్చన్నది వారి ఉద్దేశ్యం. ఇవి ఏ రూపం దాల్చుతాయో అప్పుడే చెప్ప జాలం. ఒక పత్రికలో చిరంజీవి, కెసిఆర్‌లు భేటీ అయ్యారని వార్త వస్తే, మరో పత్రిక కెసిఆర్‌, చంద్రబాబులు ఫోన్‌లో చర్చలు జరపారని కధనాన్ని అందించింది. వీటిలో చిరంజీవి, కెసిఆర్‌ల భేటీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. సహజంగానే టిడిపి, టి.ఆర్‌.ఎస్‌. కలుస్తాయని అనుకుంటున్న తరుణంలో చిరంజీవి, కెసిఆర్‌ల సమావేశం (అది కరెక్ట్‌ అయితే) వార్త టిడిపికి సంకటమే అవుతుంది. అంటే టిఆర్‌ఎస్‌ రెండు పడవల మీద కాళ్లు వేసి ఏది ప్రయోజనకరమనుకుంటే అటువైపు దూకడానికి సిద్దంగా ఉందన్న సంగతి అర్దం అవుతుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న టిడిపి లక్ష్యం నెరవేరాలంటే పొత్తులు కూడా చాలా అవసరమని ఆ పార్టీ భావిస్తోంది. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు చిరంజీవి ఇద్దరూ కూడా ఎవరి వ్యూహం ప్రకారం వారు పొత్తుల రాజకీయం చేయడానికి ఎత్తులు వేస్తున్నారనుకోవాలి. రాష్ట్రంలో ఎవరిది బలమైన కూటమి అన్నదానిపై ప్రజలలో ఒక అభిప్రాయం ఏర్పడితే ఆ కూటమి ఎన్నికలలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అందుకే వీరిద్దరూ ఇందుకోసం యత్నిస్తున్నారన్నమాట. రాజకీయం అంటేనే అధికారం కోసం సాగే క్రీడ. ఖరీదైన ఆట అది. అనేక మంది రాజకీయ జీవితాలకు ఇది ఒక సవాలు వంటిది. అందువల్ల వీటికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుకు, అలాగే రాజకీయరంగంలోకి వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవికి వచ్చేవి అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు. వీరి ముగ్గురి రాజకీయ భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. 2004 ఎన్నికలలో కలిసి వచ్చిన పార్టీలేవీ ఈసారి రాజశేఖర్‌రెడ్డితో జతకట్టడానికి సిద్దంగా లేవు. అందువల్ల కాంగ్రెస్‌ ఒంటరి పోరుకు సన్నద్ధం అవుతోంది. ఇక టిడిపి, ప్రజారాజ్యం పార్టీలు ఎలాగైనా వీలైనన్ని పార్టీలతో పొత్తు పెట్టకోవడం ద్వారా ముందుగా తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, ఆ తర్వాత జనంలో విజయంపై ఒక నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. అందువల్లే ఈ పొత్తుల ఎత్తులు పై ఎత్తులు, వ్యూహ, ప్రతివ్యూహాలు సాగుతున్నాయి. ఇవన్ని ఒక కొలక్కి రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఈలోగా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Read Full Post »

అహ్మదాబాద్‌: టా టా నానో కారు ప్రాజెక్టు సింగూ రు నుంచి తరలి గుజరాత్‌ వచ్చి నా భూసేకరణ చిక్కులు వెంటాడుతునే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కో సం కేటాయించిన స్థలం తమదేనని సనంద్‌ సమీపంలోని గ్రామా ల రైతులు పేర్కొంటున్నారు. కా ర్ల ప్రాజెక్టు నెలకొల్పనున్న స్థలాని కి సంబంధించి తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ ఛోర్డీ సమీపంలోని ఖోడా, బోడ్‌ గ్రామాల రైతులు కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

టాటాలకు ఇచ్చిన ఆనం ద్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (ఏఏ యూ) స్థలం తమ పూర్వీకులద ని (తాతాలకాలంనాటిది) రైతులు పేర్కొంటున్నారు. 1911లో ఈ స్థ లాన్ని 99 సంవత్సరాలకు లీజ్‌కు ఇచ్చారని, ఈ స్థలం ఏఏయూ మేనేజ్‌మెంట్‌ అధీనంలో ఉన్నదని వారు అన్నారు. ‘మేము మా పూ ర్వీకుల దైనా ఈ స్థలానికి చట్టబద్ధమైన వారసులమని, దీనికి మాకు న ష్టపరిహారాన్ని డిమాండ్‌ చేస్తున్నాము. ఈ విషయమై జిల్లా అధికారులకు వినతిప్రతాలు సమర్పిం చాం. అయితే ఆ స్థలంపై మాకు ఎ లాంటి హక్కు లేదు’ అని ముఖేష్‌ సిన్హ్‌ వాఘేలా అన్నారు.

రైతుల హక్కులకు ఆధారం లేదని జిల్లా అధికారులు తెలిపారు. ఈ స్థలా న్ని 1911లో బ్రిటీషర్లు సేకరించారని, అప్పటినుంచి అ స్థలం ప్రభు త్వం అధీనంలోనే ఉన్నదని ఆయ న చెప్పారు. ‘శతాబ్ద కాలంగా ఈ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నద ని ఈ దశలో రైతులు ఆ స్థలంపై హక్కులు మావంటూ పేర్కొనజాలరు. దీన్ని రుజువు చేయడానికి కావలసిన పత్రాలన్నీ ఉన్నాయి. ‘ అని జిల్లా కలెక్టర్‌ హరిత్‌ శుక్లా తెలిపారు.

Read Full Post »

న్యూఢిల్లీ: మన దేశ రాజధాని ఢిల్లీ రాత్రిపూట ఉ ద్యోగాలు చేసే ఆడవాళ్లకు సురక్షి తం కాని నగరమట. ఈ విషయం ఈ మధ్య జరిగిన ఓ సర్వేలో తే లింది. అసోచమ్‌ ఇండస్ట్రీ చాంబ ర్‌… సురక్షితంగాని నగరాలు ఏవి అనే విషయంపై ఐటీ, వైమానిక, మీడియా, హాస్పిటల్‌ వంటి సం స్థల్లో ఈ సర్వే చేసింది. ఈ సర్వే లో పాల్గొన్నవారిలో 65 శాతం మంది ఆడవాళ్లు ఢిల్లీని సురక్షితం కాని ప్రాంతంగా పేర్కొన్నారు.

ఎ ప్పుడూ మాఫియా ముఠాల గొడవలతో ఉండే ముంబై మాత్రం ఈ సర్వేలో చివరి స్థానంలో ఉంది. ముంబై సురక్షితరాహిత్యప్రాంతమని 26 శాతం మంది మాత్రమే చెప్పారు. 56 శాతం ఓట్లతో దక్షిణాది నగరమైన బెంగళూరు రెం డవ స్థానంలో ఉంది. 35 శాతం మంది హైదరాబాద్‌ను, 28 శా తం మంది చెన్నైను సురక్షితం కాని ప్రాంతాలుగా చెప్పారు. అంతే కాకుండా చిన్న సంస్థల్లోని మహి ళా ఉద్యోగులకు పెద్ద సంస్థల్లో వారికంటే భద్రత తక్కువగా ఉం టోందని తేలింది.

చిన్న సంస్థల్లోని ఉద్యోగులకు భద్రత తక్కువని 48 శాతం మంది చెప్పగా, పెద్ద సంస్థ ల్లో భద్రత లేదని 23 శాతం మం ది చెప్పారు. ఉద్యోగులకు కంపెనీ కల్పిస్తున్న రవాణా సౌకర్యాల విషయంలో 86 శాతం మంది మహిళ లు సమస్యలు ఎదుర్కొంటున్నా రు. ఈ విషయంలో ముంబై, పు ణె, కోల్‌కతాలతో పోలిస్తేఢిల్లీ, హైదరాబాద్‌, లుధియానాలు ప ర్వాలేదని సర్వేలో తేలింది. ప్రతి సంస్థా తమ మహిళా ఉద్యోగుల భద్రతపట్ల గట్టి చర్యలు తీసుకోవాలని చాంబర్‌ సూచించింది.

Read Full Post »

రూర్కేలా (ఒరిస్సా): ఒరిస్సాలోని రాయ్‌బాగలో శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టులు విసిరిన బాంబు దాడిలో ఎనిమిది మంది స్థానికులు గాయపడ్డారు. మోటార్‌ బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను గ్రామస్థులు ప్రశ్నించడంతో.. బాంబులు విసిరి పారిపోయారు. వారిని మావోయిస్టులుగా అనుమానిస్తున్నారు.

ఈ దాడిలో కౌర్మండ బ్లాక్‌ వైస్‌ చైర్మన్‌ శ్యామ్‌సుందర్‌ సాహు సహా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరో సంఘటనలో.. బాలికలను అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేయాలంటూ రాయ్‌బాగ గ్రామస్థులు శుక్రవారం అక్కడి పోలీస్‌ స్టేషన్‌ను సుమారు మూడు గంటలపాటు ఘెరావ్‌ చేశారు.

Read Full Post »

చండీగఢ్‌: కేవలం 20 రోజుల చిన్నారికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు పీజీఐఎంఈఆర్‌లోని డాక్టర్లు. పల్మనరీ ఆర్టీసియాతో బాధపడుతున్న 2.5 కేజీల పాపాయికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశామని డాక్టర్‌ రాణా సందీప్‌సింగ్‌ చెప్పారు. ఈ వ్యాధి కారణంగా ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే ధమని పలచబడిపోతుందని ఆయన వివరించారు.

పుట్టిన వారానికే పాపాయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోందని ఆమె తల్లి మన్‌ప్రీత్‌ గుర్తించారు. రోజురోజుకూ పాపాయి నీలిరంగులోకి మారడాన్నీ ఆమె గమనించారు. దీంతో ఆమెను పీజీఐఎంఈఆర్‌కు తీసుకొచ్చారు. పాపాయిని పరీక్షించిన చిన్నపిల్లల డాక్టర్‌ రోహిత్‌ మన్జోకుమార్‌ ఆమె పల్మనరీ ఆర్టీసియాతో బాధ పడుతున్నట్లు గుర్తించారు.

దీంతో బీటీ షంట్‌ పెట్టే క్లోజ్‌డ్‌ గుండె శస్త్రచికిత్స చేయాలా లేక ఓపెన్‌ హార్డ్‌ సర్జరీ చేయమంటారా అని పాపాయి తల్లిదండ్రులను అడిగారు. షంట్‌ పెడితే రిస్క్‌ తక్కువగా ఉంటుందని, కొన్నేళ్ల తర్వాత మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, ఓపెన్‌ హార్డ్‌సర్జరీకి రిస్క్‌ ఎక్కువని చెప్పారు. దీంతో రిస్క్‌ ఎక్కువయినా ఇబ్బందిలేని గుండెమార్పిడి చికిత్సకే పాపాయి తల్లిదండ్రులు మొగ్గు చూపారని డాక్టర్లు తెలిపారు.

Read Full Post »

హెల్సింకి : మధ్యప్రాచ్యం, ఆసియాల్లో యువతకు ఉపాధి కల్పన కత్తి మీద సాము కానుందని నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మర్తి అథిసారి శనివారం చెప్పారు. రానున్న దశాబ్దంలో శాంతిని నెలకొల్పే క్రమంలో ఇదే అతి పెద్ద సవాల్‌గా పరిణమించనుందని హెచ్చరించారు. వందకోట్ల మందికి పైగా ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందన్నారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. “రానున్న పదేళ్లలో 15-30 ఏళ్ల వయసున్న వారి సంఖ్య 120 కోట్లకు చేరుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 30 కోట్ల మందికి మించి ఉపాధి కల్పించలేం” అన్నారు.

“ఈ యువతకు ఏం ఇవ్వగలం? నేరస్థుల ముఠాలు, ఉగ్రవాదుల పంచన చేరేలా వారిని వదిలివేయడమేనా?” అని ప్రశ్నించారు. శాంతి అభివృద్ధి సాధనకు ఇదే పెద్ద సవాల్‌ అని ఆయన పేర్కొన్నారు. అతి త్వరితంగా ఉపాధి పొందే విషయంలో యువతను చైతన్య పరుస్తున్నామని, ఇందుకు ఖతార్‌కు చెందిన ఓ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.

Read Full Post »

ముంబై: ముంబైలోని యూత్‌కాంగ్రెస్‌ బీజేపీ పాత్రను పోషిస్తోంది. రియాల్టీ షోలపై విరుచుకుపడడమే కాకుండా… ఇటీవల ప్రారంభించిన ‘కలర్స్‌’ టీవీ చానల్‌తోపాటు ఆ షోను నిర్వహిస్తున్న ఎన్డెమాల్‌ అనే సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న రాహుల్‌ మహాజన్‌, నటి పాయల్‌ రోహట్గి, సంభావన్‌ సేథ్‌లపై కూడా యూత్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే… కలర్స్‌ చానల్‌లో ‘ఏక్‌ ఖిలాడి, ఏక్‌ హసీనా’ అనే రియాల్టీ షో ప్రసారమవుతోంది.

ఇందులో ఒక కార్యక్రమంలో రావణుడి వేషధారి అయిన క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ సీత వేషధారి అయిన నటి మోనాసింగ్‌తో డ్యాన్స్‌ చేస్తాడు. ఈ నాట్యం ప్రేక్షకుల సెంటిమెంట్లను తీవ్రంగా బాధించిందని యూత్‌ కాంగ్రెస్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ముంబై డిప్యూటీ కమిషనర్‌ కేఎంఎం ప్రసన్న చెప్పారు. అలాగే ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమంలో చీప్‌ పబ్లిసిటీ కోసం రాహుల్‌ మహాజన్‌, పాయల్‌, సంభావన్‌లు అశ్లీలంగా ప్రవర్తించారని ఫిర్యాదు

Read Full Post »

Older Posts »