Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్ 27th, 2008

(సంకినేని వెంకటయ్య, చిట్యాల వినోద)

ప్రపంచంలోనే మహోజ్వలమైన చరిత్ర ఉన్న పవిత్ర గ్రామీణ భారత దేశంలో సంస్కృతి పరంగా స్త్రీని దేవతామూర్తిగా పిలుస్తారు. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం పితృస్వామిక కుటుంబాలుగా చలామణి అవుతున్న భారత గ్రామీణ వ్యవస్థలో గతంలో మాతృస్వామిక కుటుంబాలు ఉండేవి. అనగా కుటుంబ యజమానురాలిగా పూర్తి భాద్యతలు స్త్రీలే వహించేవారు. స్త్రీకి ఈ దేశంలో ఎంత ప్రాధాన్యత ఉందంటే భారతదేశాన్ని భరతమాత అని పిలిచేంత గొప్పతనం, గౌరవం స్త్రీలకు ఉంది. కాని ఈ దేశంలో దళిత కుటుంబాలకు సంబంధించిన స్త్రీలు పలురకాల అణచివేతలకు, అవమానాలకు గురౌతున్నారు. దళిత స్త్రీ ఒక సాంఘీక శక్తి. ఒక సంస్కృతికి ప్రతీక. ఒక చారిత్రక నేపథ్యం. కానీ భారతదేశంలో ఈనాడు ఒక అస్పృశ్యురాలిగా సంక్షుభితమైన జీవన యాత్రలో ప్రయాణం సాగిస్తూంది. వ్యవసాయ రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఆనకట్టలు, భవనాలు, రోడ్ల నిర్మాణాల్లో కూడా తమ శ్రమను దారపోస్తుంది. బట్టల మిల్లులు, బీడీ పరిశ్రమ, సిమెంట్‌ ఫ్యాక్టరీలు, ఆస్పత్రులు, క్వారీ పనులు ఇలా ఎన్నో రంగాల్లో పనిచేస్తుంది. ఒకవైపు ఇలా శ్రమిస్తూ మరోవైపు గృహజీవనానికి సంబంధించిన పనులన్నీ చేయడం వల్లే మొత్తం భారతీయ ‘’శ్రామిక శక్తి’’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారనేది చారిత్రక సత్యం. పోషకాహార లోపం వల్ల బలహీనులై కనీసం వృద్ధాప్యంలో తమను పోషించడానికి ఒక్క బిడ్డైనా మిగలాలనే ఆశతో అనేక మంది బిడ్డలకు జన్మనిచ్చి రక్తహీనతతో మరింత బలహీనులౌతున్నారు. పగలంతా చెమటోడ్చి పొలాల్లో పనిచేస్తే పరిమితమైన కూలి లభిస్తుంది. నిత్యావసర వస్తువులు కొనడం కోసం ఆ డబ్బు చాలదు. అంతేగాక మాతృహృదయం కలిగిన వీరు భర్తకు, పిల్లలకు వడ్డించిన తరువాతనే మిగిలితే తినవలసిన పరిస్థితి తరచూ ఎదురౌతూనే ఉంది.  మండుటెండకు నెర్రెలు విచ్చిన భూమి పగుళ్ళలా ఆమె కాళ్ళు పగిలి ఉంటాయి. అన్నం చాలక కరుణార్ద్రతతో ఆమె కళ్ళు గుంటలు పడిఉంటాయి. నూనె లేక అట్టలు కట్టిన ఆమె జుట్టు శ్రమించి కాయలు కాసిన ఆమె చేతులు మానవతా రహితమైన ఈ దేశ గ్రామీణ అగ్రకులాల కర్కశత్వాన్ని గుర్తుచేస్తాయి. దళిత స్త్రీ ఒక సృజనాత్మక శక్తి. గ్రామాల్లో నులను మంచానికి అల్లుటలోను, బట్టలు నేయడంలోనూ, తాటాకులతోనూ, ఈతాకులతోనూ చాపలు అల్లడంలోనూ, కళాస్రవంతిగా, సంస్కృతీ భాండాగారంగా ఆమె నిరూపించుకుంది. వేటకత్తెగా, జాలరిగా, యుద్ధ సైనికురాలిగా మానవ జీవన చరిత్రలో అనేక పాత్రలు పోషించింది కనుకనే ప్రాచీన భారతీయ పారిశ్రామికవేత్త ఈ మహిళ. తోళ్ళపని, కుట్టు, నేత, కుండల తయారీల వంటి పనులు చేపట్టింది. గృహ, సమాజ నిర్వహణ కర్తగా ఒక ముఖ్య పాత్ర వహించింది. ఆమె రోజువారీ శ్రమను పరిశీలిస్తే శ్రామిక సంస్కృతిపై ఒక పెద్ద విజ్ఞాన గ్రంథాన్ని తయారు చేయవచ్చు. రోజుకు 18 గంటలు రక్తాన్ని, చెమటను ధారపోసి పనిచేసే దళిత స్త్రీ శ్రమ, సోమరి భారతీయుల నిర్దయపూరిత శరీరాలను పెంచి పోషిస్తుంది. వారి శ్రమ భారతీయ ఆర్థిక సాంఘిక రంగాలకు పునాది. కాని మన మేధావులు ఈ స్త్రీల జీవితాన్ని పరిశీలించడం లేదు. జీవన విధానాన్ని పరిశోధించనంతకాలం వీరికి భారతదేశ వాస్తవికత అర్థం కాదు. తమ మానవీయ ఔన్నత్యాన్ని కించపరిచే సాంఘిక అణచివేతలోనూ, ఆర్థిక సంక్షోభంలోనూ ఈనాటి దళిత స్త్రీలు ఎంతో సంఘర్షణతో జీవిస్తున్నారు.  ప్రాచీనకాలంలో భారతదేశంలో వ్యవసాయ సంస్కృతికి సంబంధించిన అంశాలన్నీ ఈ స్త్రీల జీవన విధానంలోనే మనకు ద్యోతక మవుతున్నాయి. విత్తనాలు నాటేటప్పుడు, కోతలు కోసేటప్పుడు వీరు పాడే పాటల్లో మాట్లాడే భాషలో ఎంతో సంస్కృతి దాగి వుంది. భారతదేశానికి మూలమైన భౌతిక తత్వశాస్త్రానికి మూలం వీళ్ళే. సాంఖ్యతత్వ శాస్త్రాన్ని, తాత్విక వాదాన్ని ఆచరణలో పెట్టింది దళిత స్త్రీలే. కులం పునాధుల్ని పెకిలించి కులాతీతంగా మాతృత్వాన్ని అందించిన గాథలు పురాణాలనిండా ఎన్నో ఉన్నాయి. వీరిని అణచివేసిన తరువాతే భారతదేశంలో తత్వ శాస్రానికి దారిద్య్రం వచ్చింది.  భారతీయ గ్రామాలకు మూలమైన భాషా సంస్కృతి, కళలు అన్నీ దళిత స్త్రీలోనే నిక్షిప్తమై ఉన్నాయి. మానవత్వం, దాత్రుత్వం, సౌజన్యం, సౌహార్ధం ఈమెకు సహజ లక్షణాలు. అందుకే ఆమె ఈ దేశానికి పునాది. సంస్కృతిని తన ఔధార్యంతో రక్షిస్తూ వచ్చింది. ఉమ్మడి జీవనాన్ని శిథిలం కాకుండా చూసింది. మాతృత్వంలో దాగి ఉన్న అన్ని దశలను యుద్ధం చేసి రక్షించింది. పురిటి నొప్పుల్లో కూడా భూమికి తన చెమటను ధారపోసి తన ఔన్నత్యాన్ని చాటుకుంది. నదీ నాగరికతను నిర్మించింది. భారత భౌగోళిక వాస్తవికత నుంచి సంస్కృతిని రూపొందించింది. ప్రకృతిని అనునిత్యం జీవితానికి అన్వయించిన కళాతపస్వి. హృదయ సంబంధమైన కళా ప్రపంచానికి స్త్రీదే ఆదినాయకత్వం. అందునా దళిత స్త్రీ తను అభివ్యక్తం చేయదలచుకున్న విషయాన్ని వాచక సాత్వికాభినయంతో సహా వ్యక్తీకరిస్తుంది. భారతీయ శిల్పుల, చిత్రకారుల చేతుల్లో అభివృద్ధి చెందిన కళలన్నీ ప్రాథమికంగా దళిత స్త్రీ రూపొందించినవే. సముద్రపు ఒడ్డులో ఇసుక తిన్నెలో చిత్రాలు గీసింది. రాతిని శిల్పంగా మలచింది. ప్రకృతి రమణీయకత్వానికి అనుగుణంగా శృతిని, గతిని కలిపి పాడింది. సాహిత్యానికి మూలమైన లిపిని కూడా దళిత స్త్రీయే కనుగొన్నది. లిపికి మూలమైన అంశాల్లో ఒకటైన ‘’పచ్చబొట్టు’’ని ఈమె మొదట ప్రారంభించినట్లు చరిత్ర తెలుపుతుంది. ఇంతటి మహోదాత్తమైన ఆ దళిత తల్లి ఈనాడు గర్భవతి అయితే ఆమె కడుపులో ఉన్న బిడ్డకు జీవాన్నిచ్చే ఆహారం పెట్టుకోలేక తన బిడ్డ తన కడుపులోనే మరణించే పరిస్థితులకు అనేక సందర్భాల్లో నెట్టబడు తుందంటే తరతరాలుగా ఈ సమాజం ఏ పరిస్థితికి మన స్త్రీని నెట్టివేసిందో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని అనేక ప్రాంతాల్లో జోగిని వ్యవస్థ దళిత స్త్రీలను భాదిస్తూ ఉంది. ఆదిమ జాతులను దళితులను ఈ సమాజం అస్పృశ్యులుగా చేసిన తర్వాత వీరిపై అనేక దురాచారాలను, మూఢ విశ్వాసాలను రుద్దింది. అందులో ఈ అమానుషమైన జోగిని ఆచారం ఒకటి. చిన్న వయస్సులోనే దేవాలయాలకు అంకితమవ్వడ మనే పేరుతో వారిని ‘’ఊరు ఉమ్మడి’’ బ్రతుకులుగా చేసి హింసించి అత్యాచారాలు చేసే ఈ దుర్మార్గపు ఆచారం ఇప్పటికీ ఆచరించబడుతుంది.  ఈ దేశంలో జీవితానికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సాంఘీక కోణాలన్నింటి లోనూ దళిత స్త్రీలు దోపిడీకి, బానిసత్వానికి గురౌతున్నారు. వీరి కనీస వేతనం ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ వాళ్ళ రక్తాన్ని, స్వేదాన్ని జుర్రుకుంటున్న భూస్వాములు వారి శ్రమకు తగిన కూలి ఇవ్వడం లేదు. ఈ విధంగా దళిత స్త్రీల జీవన ప్రమాణాన్ని దిగజారు స్తున్నారు. కనుక ఈ వ్యక్తిగత ఆస్తి మూల్యాన్ని, వ్యక్తిగత ఆస్థిని బలపరుస్తున్న సాంఘిక విచక్షణను రూపుమాపే ఉద్యమంగా మారినపుడే దళిత స్త్రీల ఉద్యమం దళితులను విముక్తి చేయగలదు. భారతదేశంలోని సంస్కరణ ఉద్యమం మధ్యతరగతి స్త్రీలను దాటి శ్రామిక స్త్రీలను చేరలేక పోయింది. దళితులపై జరుగుతున్న అత్యాచారాలను, దోపిడీని ఎదిరించటానికి దళిత మహిళలు ముందు నిలిచి సింహ గర్జన చేసిన ఆ స్త్రీల నుండే ఈనాడు దళిత విముక్తికై మహోన్నతమైన ఉద్యమం జనించింది. కారంచేడు సంఘటన దీనికి నాంది అయ్యింది. తరతరాలుగా అక్కడి దళితుల శ్రమ శక్తిని దోచుకొని బలిసిన భూస్వాములు కత్తులు, గొడ్డళ్ళు, బరిసెలతో దాడి చేసి తల్లులను, బిడ్డలను, భార్యాభర్తలను కౄరంగా చంపారు. స్త్రీలపై అత్యాచారం జరిపారు. కులాధిపత్య దాడికి ఎదురు తిరిగిన ఆ స్త్రీల నుండే దళిత ఉద్యమం ప్రారంభమైంది. భర్తల శవాలను ఒడిలో పెట్టుకొని ప్రభుత్వం చేయబోయిన ఆర్థిక సహాయాన్ని తిరస్కరించిన ఆ దళిత తల్లుల త్యాగపూరిత ఆత్మగౌరవమే దళిత ఉద్యమానికి పునాది అయ్యింది. ఇటువంటి సంఘటనలు ఎన్నో దళిత స్త్రీల చైతన్యాన్ని, సంఘటిత శక్తిని రుజువు చేశాయి. దేశంలోని దళిత స్త్రీలందరు ఉద్యమిస్తే వారి బిడ్డలు, దళిత పురుషులు వారికి సంఘీభావంతో నిలిస్తే దళిత స్త్రీలందరు ఉద్యమిస్తే వారి బిడ్డలు, దళిత పురుషులు వారికి సంఘీభావంతో నిలిస్తే దళిత విముక్తి పోరాటం తన లక్ష్యాన్ని తప్పక సాధిస్తుంది. భారత సమాజంలో అత్యధిక పీడనకు, అణచివేతకు గురైన దళిత మహిళలే ఈ విముక్తి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళ గలరు విజయాన్ని సాధించగలరు.

(రచయితలు : రీసెర్చ్‌ స్కాలర్స్‌)

Read Full Post »

(కత్తి పద్మారావు)

దళితులు అంటే అస్పృశ్యతకు గురైన జాతులు అని అర్థం. అస్పృశ్యతకు గురిచేసిన వారు భారతీయులు. అస్పృశ్యతకు గురైన వారు ఆదిభారతీయులు. అస్పృశ్యత అనే శబ్దం సంస్కృత శబ్దం. అస్పృశ్యులంటే స్పృశించబడనివారు అని అర్థం. ఈ భావం బ్రాహ్మణ కుటుంబ జన్యం అని అంబేద్కర్‌ చెప్పాడు. స్పృశ్యతా భావం పరిపూర్ణంగా ఉన్నవారే అస్పృశ్యులుగా ముద్ర వేయబడ్డారు. అనగా పుట్టుకలో, మరణంలో, జీవితంలో కుటుంబంలో, పరిసరాలలో, అనుబంధంలో ఏవిధమైన తేడా లేని వారు. సూర్యునికి – భూమికి, నీటికి-భూమికి ఒక ప్రాకృతిక అనుబంధమే స్పృశ్యభావం. దీనికి భిన్నమైన సమాజం వీరిని అస్పృశ్యులుగా పేర్కొంది.  దళితుల ప్రకృతి-తత్వం  ప్రకృతితో సంబంధం వున్న స్పృశ్య సమాజంగా దళితులను చెప్పుకోవచ్చు. అంటే ప్రకృతితో అనుబంధం ఉన్న ప్రాకృతిక జీవులు. ప్రకృతితో సంబంధం ఉన్న ఏ జాతులు అయినా ప్రపంచంలో సాంస్కృతికంగానే ఉంటాయి. సృజనాత్మ కంగా కూడా ఉంటాయి. Productive కూడా ఉంటాయి. ప్రకృతిలో ప్రధానమైనవి సూర్యుడు, భూమి, నీరు, నిప్పు శూన్యం లేక చీకటి. వీటిని జీవితానికి అన్వయం చేసుకుని అర్థం చేసుకోవడమే తత్వశాస్త్రం. ప్రతీ సాంస్కృతిక విప్లవానికి ఒక తత్వశాస్త్రం ఉంటుంది. తత్వశాస్త్రం ఒక జాతిని నడిపించే వాహిక. అస్పృశ్యులుగా చెప్పబడుతున్న దళితులు అతి ప్రాచీనకాలం నుండి భౌతికవాద తాత్వికులు. చార్వాకులు, సాంఖ్యులు ఈ భౌతికవాదాన్ని చెప్పారు. భౌతికవాదంలో నిర్భయత ఉంది. జీవన సమతుల్యత వుంది. జీవన పోరాటం, జీవితం ఉన్నాయి. దళితులు మొదటి నుండి అధీన భావానికి వ్యతిరేకులు. స్వేచ్ఛా జీవులు Emotional Creatures. జీవితమే కవితాత్మకం అయిన వీరిని వెలివేసిన సమాజం కృత్రిమం అయింది. వీరిని వెలివేసిన వైదిక సమాజం మెదడుకు మేకులు కొట్టిన సమాజం. ఇనుప కచ్చడాలు బిగించిన సమాజం. ఈ వైదిక సమాజం ఆదిభారతీయులను వెలివేయడానికి చెప్పిన కారణాలలో వర్ణసంకరం, బౌద్ధ స్వీకరణ, స్త్రీస్వామ్యం ముఖ్యమైనవి. దళితులు ప్రాయకంగా మాతృస్వామ్యక పునాది కల్గిన జాతులు. తల్లి ఇక్కడ Main force (చోదక శక్తి). సంతానానికి తనకు ఉన్న (Inter relation) బలమైంది. చాలా సందర్భాలలో భర్త ద్వితీయం. సంతానం ప్రథమం. తల్లితో అనురక్తి ఉన్న ప్రతి జాతి సాంస్రృతికమైన శక్తి. ఇది వైదిక సంస్కృతికి పూర్తిగా భిన్నమైంది. వైదికం పితృస్వామికమైంది. మాతృస్వామిక సమాజం వారికి అర్థం కాదు. తల్లి తన జోల పాటతోనే తన పిల్లవాడి మెదడును మేల్కొపుతుంది. హృదయ స్పందనను కల్గిస్తుంది. సగం గోరు ముద్దలు, సగం పాటలతో దళితులు పెరుగుతారు. వైదిక సమాజంలో నిందాపూరితమైన భాష ఎక్కువ. దళిత భాషలో ప్రకృతి, హృదయ స్పందన పెనవేసుకుని ఉంటాయి. అందునే దళిత భాష బ్రాహ్మణులకు అర్థం కాదు. భాష అర్థం కానప్పుడు దళిత సాంస్కృతిక విప్లవం అర్థం ఎలా అవుతుంది?  వైదిక జీవనానికి – దళిత జీవనానికి వైరుద్యం:  వైదిక సాహిత్యంలో కర్త బ్రాహ్మణుడు లేక పురోహితుడు. అతడు అభద్రతతో కూడిన వాడు. అతడు, అతని భాష కృత్రిమం. ఇతరులను నిందించడం వల్ల తన ఆధిపత్యాన్ని అతడు నిలుపుకుంటాడు. అతని భావాలే స్మృతులు. మనుస్మృతి, పరాసరస్మృతి, నారదస్మృతి అన్నీ వర్ణ వ్యవస్థ పూరిత ద్వేషభావాలే. దళిత సాంస్కృక విప్లవానికి దళిత తల్లి నాయకురాలు. ఆమె భాషలో నిందలు లేవు. ద్వేషాలు లేవు. సామాజిక అంతరాలు లేవు. ఆత్మీయత, ప్రేమ, ఆర్ద్రత, ప్రకృతి, దుఃఖం, శ్రవ్యత, అనురాగం వుంటాయి. ఒక శృతిబద్ధమైన శైలిలో దేశీయత నుంచి ఆమె పలుకుతుంది. ప్రపంచ సాహిత్యానికి సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని అందించింది ఈ దళిత తల్లే. ఎందుకంటే, ఆమె ఇంతవరకు దేశీయ భాషను మార్చుకోలేదు. ప్రపంచంలో ఆధిపత్యం వహిస్తున్న భాష గ్రీకు, లాటిన్‌, ఇంగ్లీషు, సంస్కృతం. ఇవన్నీ పితృస్వామిక భాషలు. వీటిలో సాంస్కృతిక భాష తక్కువ. చైనీస్‌, ఫ్రెంచ్‌, తెలుగు, కన్నడం, తుద, కుట, కోయి, గదబ, సవర వంటి భాషలలో Matriarchal diction ఎక్కువ. ఇందులో Cultural revolution సంబంధించిన మూలకాలు దోరుకుతాయి. ఎక్కడ తల్లి నిర్ణాయక పాత్రలో ఉంటుందో అక్కడ సమాజం సాంస్కృతికంగా ఉంటుంది. ఎక్కడ పురుషుడు ఆధిపత్యంలో వుంటాడో అక్కడ సమాజం నియంతృత్వంలో వుంటుంది. దళితుల ఒక సాంస్కృతిక శక్తిగా ఈనాటికి ఉండటానికి కారణం తల్లి సంస్కృతే.  దళిత తల్లి కళా జీవి:  సంస్కృతిలో ప్రధానమైంది సంఘ నిర్మాణం. దళితులకి కులభేదాలు లేవు. ఉపకులాలు కూడా ఆ తరువాత వచ్చినవే. దళితులది జాతి. వీరు భారతీయ ఆదిమ జాతి. వీరి మౌఖిక సాహిత్యమంతా తరం నుంచి తరంకి అందించబడింది. పరిణామం చెందింది. ఒక రకంగా తల్లి మితభాషి. తన భావావేశాలు అంగిక వాచక చలనాల నుండి చూపించినంత భాష నుండి చూపించదు. అందుకనే దళితస్త్రీ అభివ్యక్తతో పాటు దృశ్యప్రదానంగా వుంటుంది. తన బిడ్డలైన దళితులు కూడా ఎక్కువ భాష కంటే దృశ్యాన్ని ప్రేమిస్తారు. అందుకే పాట నృత్య సమ్మిళతమైంది. చిందుతో పాటు డప్పు ఆధునికంగా మనకు కనిపిస్తున్న సాంస్కృతిక రూపం. శ్రమతో కూడిన నృత్యం, లయతో కూడినపాట. వీర రసానిష్కతి కరుణ రసాప్రదమైన జానపదులు వీరు. వీరిది ప్రాకృతిక జన్యమైన భాష, భావం, నృత్యం, ధ్వని కలసిన కళాజ్వలనం. వీరి సాంస్కృతిక విప్లవానికి ప్రేరణ కళారూపాలే. బ్రాహ్మణవాదాన్ని వీరు ఈ తల్లి పాటలతోనే ఎదుర్కొంటున్నారు. వీరి సంఘం గుంపు. వీరి పాట గుంపుపాట. వీరి పాటలో సమూహం ఉంది. మాటలో సంఘ ఐక్యత ఉంది. అందుకే ఎన్నో కళారూపాలు శిథిలమవుతున్నా దళితుల సామాజిక, సాంస్కృతిక విప్లవ స్రవంతి ప్రవాహ శీలమౌతూనే వుంది.  నదీనాగరికతా వారసులు దళితులు:  దళిత స్త్రీ నదీప్రవాహం వంటి చలనం కలిగినది. నదీ నాగరికత భారత దేశంలో ప్రధానమైంది. సింధు, గంగా, యమున, గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి నదులన్నింటి నాగరికతను సంపన్నం చేసిన వాళ్ళు దళితులు. వైదికులు వీరిని ఊరినుండి వెలివేయగలిగారు కాని నదీ నాగరికత నుండి వెలివేయ లేకపోయారు. బ్రాహ్మణులు అగ్ని ప్రధానమైన జాతి. ఋగ్వేదంలో అగ్నిని కొనియాడే మంత్రాలు కొల్లలు. వారికి నది తెలియదు. నీళ్ళు అంటే వరుణ దేవుడు ఇచ్చేవే అనుకుంటారు. కాని నిజానికి వాళ్ళు సాంస్కృతిక పునాదిని అక్కడే కోల్పోయారు. వారు శ్రమలేని జాతులు అయ్యారు. శ్రమ లేని జాతిగా మారారు. శ్రామిక జాతులు అణచివేతకు గురవుతాయి. శ్రమ, విశ్రాంతి, వినోదం అంతఃసంబంధితంగా ఉంటాయి. దళితుల యొక్క జీవన సంస్కృతిలో సృజనాత్మకత, నదీ నాగరికతనుండే ఆవిర్భవించింది. నది వీరికి ఆహారాన్ని అందించింది. గొరసలు, వంజరాలు, చందువాలు, బొమ్మిడాయలు, రొయ్యలు, పీతలు అని వీటికి పేర్లు పెట్టింది కూడా వీళ్ళే. దళితుల ఆయాభాషల సృష్టికర్తలు కూడా. మనం చేపలను పరిశీలిస్తే వాటి స్వభావాన్ని బట్టి పేర్లు ఉంటాయి. ముళ్ళు ఎక్కువగా ఉండేదాన్ని జల్ల అని, పొడుగ్గా ఉండేదాన్ని వాలిగా అని, చందమామ ఆకారంలో ఉండేదాన్ని చందవా అని అన్నారు. చాలా భాషని బ్రాహ్మణులు సృష్టించలేదు. దళితులే సృష్టించారు. పుట్ట, గుట్ట, లోయ, చెట్టు ఇవన్నీ వీళ్ళు పెట్టిన పేర్లే. వీరిని భాషా సృష్టికర్తలు అనొచ్చు. సంస్కృతిలో ప్రధానమైనది భాషా సృజనమే. ముంత, చల్ల, గరిస, గంప, గాదె అనే పేర్లు బ్రాహ్మణులకు తెలియదు. నెయ్యి, వెన్న, ఇవన్నీ సంస్కృతం నుండే వాడతారు. అందుకనే బ్రాహ్మణులకు దళితుల మీద భాషాద్వేషం వుంది. అందుకనే వీళ్ళు వాళ్ళని ద్వేషంగా చూస్తారు. వీరి గొంతు నరాలు సున్నితంగా ఉంటాయి. పాటలు మధురంగా పాడతారు. ఎక్కువ ప్రకృతిలో దొరికే వస్తువులు తింటారు. వేప, గానుగ, నేరేడు, జామ వంటి వాటితో పళ్ళు తోముకోవడం వల్ల దుర్వాసన లేకుండా ఉంటారు. ప్రాకృతికమైన స్వచ్ఛత వల్ల కూడా వీళ్ళు ద్వేషించబడ్డారు. శిల్పపరమైన సౌందర్యం దళితుల సొంతం. ఎక్కువ మంది కళ్ళు పెద్దవి. కనుబొమ్మలు విల్లంబుల్లా ఉంటాయి. ముక్కులు పొడుగ్గా ఉండి పెన్సిల్‌తో గీసిన బొమ్మల్లా ఉంటారు. కన్నమనీడు వంటి వారి శరీర నిర్మాణం మనం చూసినట్లైతే వీరిది యుద్ధజాతి. కొన్ని ప్రాంతాల్లో వీరు ఆరు అడుగులు వుంటారు. కోర మీసాలు. ధైర్యమెక్కువ. వీరిది కరుణ వీర రసం. ఎన్నో సైన్యాల్లో వీళ్ళు మావటీళ్ళుగా వున్నారు. ఎన్నో సైన్యాల్లో అశ్వాధిపతులుగా కూడా వున్నారు. అందువల్ల వీళ్ళని కొన్ని సైన్యాల్లోకి రాకుండా నిషేధించారు. ఆర్య ఋషులు పెక్కురు దళిత వనితలని చేసుకున్నారు. అరుంధతి, అదృశ్యంతి, సత్యవతి ఇలా ఎందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. వీళ్ళు దేవతలుగా మారారు. పోచమ్మ, అంకాళమ్మ, నూకాలమ్మ, గంగానమ్మ, సారమ్మ, వీరంతా దళిత స్త్రీలే. పోరాటాలు చేసిన దళిత స్త్రీల చుట్టూ పౌరాణిక కథలల్లి ఇప్పటికీ వారిని దేవతలుగా కొలుస్తున్నారు. ఆర్య ఋషులకు వీరిపై ద్వేషానికి కారణం, లోతుగా చూసినప్పుడు కాని అర్థం కాదు. భారతదేశ చరిత్రకు వీర నాయిక దళిత స్త్రీయే. ఈమె The force of evolution. ఈమె పరిణామానికి ఒక మూల శక్తిగా పనిచేసింది.  వ్యవసాయిక విప్లవంలో దళితుల పాత్ర :  భారత దేశాన్ని మలుపు తిప్పిన ప్రతీ పరిణామంలోను దళిత స్త్రీది కీలకపాత్ర. నదీ నాగరికత నుండి వ్యవసాయిక విప్లవం వచ్చిన తరువాత చాతుర్వర్ణాలలోని ఏ స్త్రీ పోషించలేని పాత్రను దళిత స్త్రీ పోషించింది. నాగలి పట్టింది, విత్తనాలు వేసింది, నారు పీకింది, నాటు వేసింది. కోత కోసింది, కలుపు తీసింది, దంచింది ఈ పనులన్నీ చేసి వ్యవసాయిక సంస్కృతిక బతికించింది. తనను ఊరినుండి బయటకు నెట్టితే పొలంలో వెళ్ళి పంట పండించింది. అక్కడ కూడా సంస్కృతిని పెనవేసింది. పాట-పని, పని-పాట ఈరెంటి నుండే మొత్తం భారతీయ సాహిత్యం ఆవిర్భవించింది. పనిలేని పాట జీవనం లేని కట్టెలా మిగిలిపోయింది. పనితో కూడిన పాట సాంస్కృతిక విప్లవానికి జీవధార. మౌఖికంగా వున్న పాటలన్నీ లిఖిత రూపకంలోనికి వచ్చి ఉన్నట్లయితే ఇప్పుడు లిఖిత రూపంలో వున్న వాంజ్మయం అంతా దానిలో పదిశాతం కూడా ఉండదు.  అందుకనే తెలుగు నిఘంటువుని ఒకసారి పరిశీలిస్తే సంస్కృతేతరమైన పెక్కుపదాలు దళిత స్త్రీ సృష్టించినవే. కోత, నాటు, కలుపు, ఊడ్పు, నడక, పరుగు వంటి పదాలన్నీ ఆమె యాసలోనే పలుకుతాయి. మిగిలిన వారు ఆమెలా వాటిని పలకలేరు. సంస్కృతం, ఇంగ్లీషు వచ్చిన వారు ఆ శైలిలో ఈ పదాలు పలుకుతారు. స్వచ్ఛమైన తెలుగు, తమిళం లాంటి దేశీయ భాషలు మాట్లాడే దళిత వాడల్లో సంస్కృతి, చరిత్ర కొలువు తీరాయి.  దళిత కవిత్వంలో సంస్కృతీ వారసత్వం :  ఆధునికంగా దళిత కవిత్వం వచ్చిన తరువాత తల్లి భాషలో మాట్లాడటం ప్రారంబమయింది. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. దళితులు తమ ఆడ పిల్లలను కాన్పుకి ఇంటికి తీసుకు వస్తారు. అప్పుడు తల్లి పేదరికంలో ఉండి కూడా తనని బిడ్డని చూసే విధానాన్ని బిడ్డ ఒక సంస్కృతిగా నేర్చుకుంటుంది. ఆ ప్రేమ బంధాన్ని గురించి ‘’పురుటి వాన’’ అనే కవితలో దళిత స్త్రీ ఎలా అభివ్యక్తీకరిస్తుందో చూడండి.  ఇంటి మూలల్లో పగటి చీకట్లో నా పొత్తిళ్ళలో పసికందు మూలుగు నన్ను సుడిపెడుతుందే అమ్మా! – నీలికేక  ఇందులో ఒక దళిత స్వరం వుంది. దళిత కవిత్వం వుంది. దేశీయమైన నుడికారంతో అభివ్యక్తి వుంది. దానికి ఊపిరి దళిత తల్లి. పితృస్వామ్య వ్యవస్థకు భిన్నమైన ఈ స్వరం నూతన సామాజిక చరిత్ర నుంచి మాట్లాడుతుంది. అందుకే శివసాగర్‌, మద్దూరి నగేష్‌బాబు, సతీష్‌చంద్ర, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్‌ వంటి శక్తివంతమైన కవులు ఈనాటి దళిత కవితా యుగానికి ఆయువులు పోస్తున్నారు. దళిత కవయిత్రు లుగా, కథా రచయితలుగా, సంపాదకులుగా జూపాక సుభద్ర, కొలకలూరి స్వరూపరాణి, అనిశెట్టి రజిత, చల్లపల్లి స్వరూపరాణి,జాజుల గౌరి, జోత్స్నారాణి, గోగు శ్యామల, చంద్ర శ్రీ ఇంకా ఎందరో వందలాది మంది దళిత కవయిత్రులు ఆవిర్భవిస్తున్నారు. దీనితో తెలుగు భాష సుసంపన్నం అవుతుంది. తెలుగు సాహిత్యం కొత్త యుగాన్ని ఆవిష్క రించుకుంటుంది. ఈ పరిణామాన్ని పరికించ డం చారిత్రక అనివార్యత. ఇది దళిత సాహిత్య యుగం.

(CESSS పరిశోధక సంస్థ మూమెంట్స్‌, సోషల్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ అండ్‌ మేకింగు ఆఫ్‌ మోడ్రన్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే సదస్సుకు సమర్పించిన పత్రంలో మొదటి భాగం.)

Read Full Post »

(డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి)

ఈ ప్రశ్న కొత్తదేమీ కాదు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ లేవనెత్తటం జరుగుతోంది. చాలావరకు పురుషులే నిర్వహిస్తూ వచ్చిన వృత్తుల్లో స్త్రీలు ప్రవేశించటంతో, అందులోని వివక్ష, భేదభావాలు, ప్రతికూల వాతావరణం, అభిప్రాయాలు వీరి వృత్తి నిర్వహణ మరింత కష్టతరం చేస్తూ వచ్చాయి. కానీ ఈ సమస్యలు గుర్తించి, చర్చించి పరిష్కారమార్గాలు వెతికే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అనుకూలమైన మార్పులు వస్తున్నాయి. అయితే దగ్గరగా చూస్తే మౌలిక సమస్యల్లో ఏ మాత్రం మార్పు వచ్చినట్లనిపించదు.  పత్రికా స్వాతంత్య్రానికి గల ప్రాము ఖ్యాన్ని గుర్తుకు చేయటానికి, దానిని గురించి పదిమందికీ తెలియజెయ్యటానికి మే మూడవ తేదీని ప్రతి సంవత్సరం పత్రికా స్వాతంత్య్ర దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు.  సాధారణంగా ఈ రోజు ప్రసార మాధ్యమాలకు సంబంధించిన చర్చలు, సమీక్షలు జరుగుతుంటాయి. ఈ సంవత్సర ఢిల్లీలో స్త్రీల, బాలల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కోర్‌ కలిసి ‘’ప్రసార మాధ్యమాల్లో స్త్రీ, పురుషుల సమానత్వం’’ గురించి చర్చ ఏర్పాటుచేశారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మంత్రి శ్రీ ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన చర్చలకు కేంద్రమంత్రి శ్రీమతి రేణుకా చౌదరి అధ్యక్షత వహించారు.  ఈ చర్చల్లో ప్రసారమాధ్యమాల్లో పనిచేస్తున్న స్త్రీల సమస్యలు, ప్రసార మాధ్యమాల్లో స్త్రీలను చిత్రిస్తున్న తీరు ప్రధానాంశాలయ్యాయి. ఈ విషయాల గురించి నాలుగు దశాబ్దాలకు పైగానే చర్చలు జరిగాయి. సర్వేలు జరిగాయి. పరిశోధన పత్రాలూ వ్రాయటమయింది. ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కాని కాలం గడిచే కొద్దీ విపరీతంగా వస్తున్న మార్పుల వల్ల కొత్త సమస్యలు ఎదురవుతూ పరిస్థితులు యథాస్థితికి వస్తున్నాయి.  మొత్తానికి ప్రసారమాధ్యమాల్లో స్త్రీల ఉద్యోగాల విషయాలలోనేమి, వాళ్ళ కప్పగించే విధులలోనేమి, స్త్రీల గురించి వ్రాసే రిపోర్టులలోనేమి, వాళ్ళను చిత్రించే విషయంలోనేమి చాలా ప్రతికూల భావం స్పష్టమవుతూ ఉంటుంది. ఈ రంగంలో స్త్రీపురుష సమానత్వమనేది ఒక భ్రమగా మిగిలింది. వీరికి బాధ్యత గలిగిన ఉద్యోగాలివ్వరు. విధానాలు రూపొందించ టంలో భాగస్వామిత్వం ఉండదు. పత్రిక నడిపే స్థాయికి చేరుకోనివ్వరు. పేపరుమీద అటువంటి భేదభావం ఉన్నట్టు నియమాలు ఉండవు కాని అసలు విషయానికి వస్తే వీరికెన్నో పరిమితులు విధించటమవుతుంది. దీనినే గ్లాస్‌ సీలింగు అంటుంటారు.  స్త్రీల పట్ల భేదభావంతో వ్యవహరించ టానికి దేశాభివృద్ధికి సంబంధం లేదు. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా స్త్రీల పరిస్థితి అలాగే ఉంది. ఉద్యోగాలు చేసే స్త్రీలకు కావలసిన సదుపాయాల గురించి ఏ సంస్థా పట్టించుకోదు. పిల్లల్ని పెట్టుకొనే క్రెష్‌లు ఉండవు. ఉద్యోగమో లేక పిల్లల పెంపకమో ఏదో ఒకటి ఎన్నుకోక తప్పని స్థితికి స్త్రీలు లోను కావలసి వస్తోంది.  కొందరు స్త్రీలు ప్రసారమాధ్యమాలలో ఉన్నతస్థాయికి చేరినమాట వాస్తవమే. కాని వీరెందరో సహోద్యోగులైన పురుషుల కంటె ఎంతో వెనకబడి ఉంటారు. వీరికి మూసపోసినటువంటి పనులే అప్పజెపుతారు. ఆర్థిక, రాజకీయ, వైజ్ఞానిక, బౌద్ధిక విషయాల జోలికి వెళ్ళనివ్వరు. దానికి తగినట్లు వృత్తిపరంగా పదిమందితో కలిసి మాట్లాడటంగాని, పరిచయాలు చేసుకొనే అవకాశాలు గాని, సమాచారం పంచుకొనే విధానం గాని వీరికుండవు. వృత్తిపరంగా ఎదగాలంటే తగిన కౌశల్యం, నైపుణ్యం కావాలి. ఇవి పెంపొందించుకొనే అవకా శాలూ వీరికి దక్కవు.  ఇక స్త్రీలకు సంబంధించిన వార్తల ప్రచురణ విషయానికి వస్తే వారి పట్ల జరిగే అపరాధాలను కూడా సంచలనాత్మకంగా వ్రాస్తుంటారు. స్త్రీల అభివృద్ధికి సంబంధించిన విషయాలు, సమస్యలు ఎన్నో వుంటాయి. వాటి జోలికి పోనేపోరు. వీటి గురించి వివరంగా వ్రాయరు. మొక్కుబడిగా ఒక వార్త ప్రచురించి దాని పూర్వాపరాలు పట్టించుకోరు. ‘’ఒక భార్య, ఇద్దరు భర్తలు’’ అంటూ ఎన్నో వివరాలతో, ఇరుగుపొరుగుల వ్యాఖ్యలతో వార్తలు నింపేసి ఆ పరిస్థితులలో ఇరుక్కొన్న వ్యక్తులందరికీ జీవితం బాధామయం చేస్తారు. ఈ బాధలు పడలేక ఆ స్త్రీ జీవితం ముగించుకొన్నప్పుడు ఆ వార్త ప్రచురించేవారే ఉండరు. వార్తాపత్రికల కంటే టెలివిజన్‌ ఛానెల్స్‌ ఈ విషయంలో విజృంభిస్తుంటాయి.  టెలివిజన్‌ ఛానెల్స్‌ వచ్చిన తర్వాత ఈ మాధ్యమాల్లో స్త్రీలకు ఎక్కువ అవకాశాలు వచ్చిన మాట నిజమే. కాని వారి భద్రత విషయం, వారి వేతనాల విషయంలో ఎన్నో లొసుగులున్నాయి. ఇక వార్తల విషయానికి వస్తే ఏ వార్తయినా ప్రచురించేముందు దానిలో ఉన్న సున్నిత విషయాలు గ్రహించాలి. ఎన్నో నేరాలు మానవుల హక్కులకు సంబంధించి నవి. వాటిని ఆ విధంగా చిత్రించవలసిన అవసరం ఉందికాని సంచలనాత్మకం చేసి ఒక పరిశోధక నవలగానో, శృంగారపరమైన కథగానో చిత్రించకూడదు. ప్రకటనలలో స్త్రీలను భోగ్యవస్తువులుగా చిత్రిస్తుంటారు. స్త్రీలెందుకు అటువంటి ప్రకటనల్లోకి వస్తారు అని అడుగుతారే గాని వారిని ఆ విధంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నది ఎవరు అన్నది పట్టించుకోరు. ఈ సమస్యల గురించి వినటానికి, న్యాయం చేకూర్చటానికి ఒక ప్రత్యేకమైన కౌన్సిలు అవసరమని చర్చలలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.  సమాచారమంత్రి శ్రీ దాస్‌మున్షీ తమ మంత్రిత్వ శాఖలో స్త్రీలపట్ల వివక్ష లేదని, మాధ్యమాల్లో ఉన్నత పదవుల్లో స్త్రీలున్నారని చెప్పారు. ఈ సంవత్సరం 15 ఆగస్టు నుండి తమ మంత్రిత్వ శాఖలోని ప్రసార మాధ్యమాల్లో స్త్రీపురుషుల సంఖ్య సమానంగా ఉండేటట్లు విధానం వస్తోందని ప్రకటించారు.  ఇంతగా పత్రికా స్వాతంత్య్రాన్ని సమర్థించే వార్తాపత్రికలలో ఏమాత్రం స్వాతంత్య్రం ఉందని అడిగారు. టి.వి. ఛానెల్స్‌లో పనిచేస్తున్న స్త్రీలకు రక్షణ ఉందా? వారి వేతనాల విషయమేమిటి? స్త్రీపురుషులు సమానమనే భావాన్ని సమర్ధించే మాధ్యమాలు తమ స్త్రీ ఉద్యోగుల విషయమై ఎందుకు పట్టించుకోరు? తమని తాము చక్కదిద్దు కోకుండా ప్రపంచానికి ఏమి నీతులు చెపుతారు అనే ప్రశ్నలు లేవనెత్తారు.  నిజమే. ఈ ప్రశ్నలన్నీ సమంజస మైనవే. ప్రసారమాధ్యమాలు స్త్రీల పట్ల వివక్షను, ప్రతికూల భావాన్ని తొలగించటానికి ముందుకు రాకపోతే ఇంకెవరు చొరవ తీసుకొంటారు, అని మనం ప్రశ్నించుకోక తప్పదు. ప్రసారమాధ్యమాలకు శక్తి ఉంది, విద్య ఉంది, వివేకముంది, దూరదృష్టితో అభిప్రాయాలు వెలిబుచ్చే అనుభవముంది. స్త్రీపురుష సమానత్వాన్ని తీసుకురాగలిగిన శక్తి వీరికే ఉంది. వీరిలోనే అసమానత్వం ఉండటం విరోధాభాసమే అవుతుంది. తమకు తామే నిర్దేశించుకొన్న నైతికసూత్రాలకు కట్టుబడి ఉండటం ప్రసారమాధ్యమాల గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. వీరిపట్ల నమ్మకాన్ని పెంపొందిస్తుంది.

Read Full Post »

(డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కె. సుభాషిణి)

నిర్మాణ కార్యక్రమంలో గాంధీజీకి అపారమైన విశ్వాసం ఉండేది. భారతదేశంలో నూటికి ఎనభై మంది గ్రామాలలో నివసి స్తున్నారు. అందువల్ల గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, నగరవాసులు గ్రామీణ ప్రజలను దోచుకోరాదని ఆయన అభిప్రాయం. మానవాళి, మనుగడకు దోహదంచేసే రంగాలలో వ్యవసాయరంగం ఒకటి. 91 శాతం ఆహారం మనకు భూభాగంనుంచి, 3 శాతం సముద్రం నుంచి, 6 శాతం ఇతరత్రా, నీటివనరుల నుంచి లభిస్తుంది. దేశపురోభివృద్ధికి, ఆర్థిక స్థోమతకు వ్యవసాయమొక్కటే ఆయువుపట్టు లాంటిది. అందువల్ల వ్యవసాయ రంగాన్ని, కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వం ఏర్పరచుకొన్న అభివృద్ధి ప్రణాళికలోని ప్రధానాంశం.  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 54 ఏళ్ళు గడిచిపోయినా, జాతి జీవనానికి పట్టుగొమ్మలైన గ్రామసీమల అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లవుతున్నది. దేశంలో 5వ పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను పరిగణనలోకి తీసుకుంటే 2001 జనాభా లెక్కల ప్రకారం 7 కోట్ల 63 లక్షల జనాభాలో 73 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. పేదరికం, నిరక్ష్యరాస్యత, చాలిచాలని రక్షిత మంచినీటి సరఫరాతో పాటు, పారిశుద్ధ్యం, కుటుంబ సంక్షేమం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పరిపాలన, దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులు, రాజ్యాంగం మొదలైన సరియైన అవగాహన లేకపోవడం వల్ల నేటి మన గ్రామీణులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లలు దైవానికి వారసులని, తల్లిదండ్రులకు ఆశాజ్యోతులని, రేపటి సమాజానికి వారధులని అంటుంటారు. అయితే కొంతమంది బాలల నిజజీవిత చరిత్రల్ని నిశితంగా పరిశీలిస్తే హృదయాలు కరిగి కన్నీళ్ళు వస్తాయి. మనదేశంలో 5 కోట్ల 45 లక్షల బాల కార్మికులున్నారు. వీరిలో 6.3 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. వెట్టిచాకిరికి నియమితులై కాలం గడుపుతున్నారనేది నిర్వివాదాంశం, మహిళలు సామాజిక, రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్ర దిశలో ముందడుగు వేయలేకపోతున్నారు. వరకట్నం, నిరక్షరాస్యత, కులవ్యవస్థ, సామాజిక కట్టుబాట్లు, అంటరానితనం, దారిద్య్రం మొదలైనవి గ్రామాలను విడవకుండా ఉన్నాయి.  గ్రామాలలోని వ్యవసాయ కార్మికులకు సంవత్సరం పొడువునా పనిలేక ఇతర ప్రాంతాలకు వలసపోయి కొందరు ఉభయభ్రష్టత్వం అన్నట్లుగా అక్కడకూడా నిర్జీవంగా బతుకుతున్నారు. మరి ఇతర కార్మికులకు కూడా అన్ని రోజులు చేతినిండా పనిలేక ఆకలిచావులకు గురికావలసి వస్తుంది.  చట్టం : భారతదేశ చరిత్రలో 2006 సంవత్సరం ఫిబ్రవరి 2 ఎంతో ముఖ్యమైన రోజు. ఆ రోజున పనిచేసే వారికి పని కల్పించే గ్యారంటీ చట్టాన్ని అమలు చేయడం ప్రారంభించారు. గతంలో ఈ పనులు కొన్ని రోజులకే పరిమితమయ్యాయి. కానీ ఈ పథకంలో 100 రోజులు పని కల్పించడంవల్ల పని చేసేవారు కొంత నిధిని తమ కోసం దాచుకునే అవకాశం ఏర్పడింది. ఈ పథకం వల్ల పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మొదటి దశలో ఈ పథకాన్ని 200 జిల్లాల్లో అమలు చేస్తారు. ఆ తరువాత దేశమంతటికీ విస్తరిస్తారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల్లో నిరుద్యోగ యువతకు పని కల్పించడానికి నిర్దేశించారు. మొదటి దశలో మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, అనంతపురం, చిత్తూరు, కడప, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, విజయనగరం, వరంగల్ జిల్లాల్లో అమలు చేస్తారు. జిల్లాకు వందకోట్ల చొప్పున 13 జిల్లాలకు 13 వందల కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. దేశంలోని 200 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకం అమలు చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తోపాటు, అరుణాచల్ప్రదేశ్, అస్సాం, బీహార్, చత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, హర్యానా, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలున్నాయి. మనరాష్ట్రంలో 34 లక్షలు కుటుంబాలకు ఉపాధి హామీ చట్టం ద్వారా పని కల్పించుటకు దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు 5 లక్షల మందికి పని కల్పించినారు.  ఈ పథకంలో భాగస్వామలు కాగోరే వారు తమ కుటుంబంలో పనిచేయడానికి ఇష్టపడుతున్న వయోజనుల వివరాలను గ్రామ పంచాయితీలో నమోదు చేయించుకోవాలి. నమోదులో భాగంగా కుటుంబంలో ఎవరెవరికి ఎన్ని రోజులు పని కావాలో ఒక తెల్ల కాగితంపై వివరంగా రాయాలి. పనికోసం బృందాలవారీగా కూడా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. తమ వద్ద పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్ధులకు గ్రామ పంచాయతీలు ‘జాబ్ కార్డు’లను జారీ చేస్తాయి. పేర్ల నమోదు (పని అడిగిన) తర్వాత 15 రోజుల్లో పని కలిపిస్తారు. పనికి గానూ రాష్ట్రంలో అమలవుతున్న కనీస వేతనాల ప్రకారం దినసరి వేతనాలు చెల్లిస్తారు. వేతనాల చెల్లింపు వారానికోసారి జరుగుతాయి. ఎట్టి పరిస్థితులలోనూ వేతనాల చెల్లింపు అవధి పదిహేను రోజులకు మించకూడదు. ఆడ, మగ కూలీలకు సమాన కూలీ రేట్లు చెల్లిస్తారు. ఎట్టి పరిస్థితులలోనూ లింగ వివక్షకు చోటుండకూడదు. పని అడిగిన ప్రతివారికి పని కేటాయింపుకు సంబంధించిన వివరాలను నేరుగా ఉత్తరం ద్వారా తెలియజేస్తారు. ఫలానా తేదీ నుంచి పనికావాలని కోరుతూ అభ్యర్థులు ముందుగానే వివరాలను గ్రామపంచాయతీ/మండల పరిషత్ కార్యాలయంలో పొందుపరుస్తారు.  ప్రధానాంశాలు ప్రతిగ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసం వంద రోజులు తప్పనిసరిగా పనిని కల్పించడం ద్వారా గ్రామీణుల జీవనోపాధి భద్రతను పెంపొందించడం. ఒక కుటుంబం కింద పేరు నమోదు చేసుకున్న వయోజనులందరికీ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద రోజులు పని కల్పిస్తారు. అంటే కుటుంబంలోని ఒకరు/కొందరు లేదా అందరూ కలసి వంద రోజులు పనిచేయవచ్చు. ఎలాంటి నైపుణ్యం అవసరం లేని పనులను చేయగలిగే గ్రామీణ వయోజనులందరూ ఈ పథకానికి అర్హులు. ఒకవేళ వందరోజులు పని కల్పించకపోతే పని కల్పించని రోజులకుగానూ నిరుద్యోగభృతిని చెల్లిస్తారు. అందువల్ల అది ఖచ్చితమైన ఉపాధి హామీ పథకం. పని కల్పించని పక్షంలో చెల్లించే నిరుద్యోగభృతి మొదటి 30 రోజులకుగాను కనీస కూలీ రేటులో 25% మిగిలిన రోజులు 50% చొప్పున చెల్లిస్తారు.  ఉపాధి హామీ పథకంలో భాగంగా సాధ్యమైనంత వరకు గ్రామానికి అయిదు కిలోమీటర్ల పరిధిలోనే పని కల్పిస్తారు. ఒకవేళ పని కల్పించే చోటు గ్రామానికి అయిదు కిలో మీటర్లకు మించితే ప్రయాణ ఖర్చులకు గానూ కూలీలో 10% అదనంగా చెల్లిస్తారు. వారంలో ఆరు రోజులు మించకుండా వరుసగా కనీసం 14 రోజులు పని కల్పిస్తారు. పని జరిగే చోట్లలో కనీస వసతులు సమకూరుస్తారు. మహిళలు వారి పిల్లల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కూలీ మొత్తం నగదు రూపంలో లేదా నగదు, బియ్యం రూపంలో కలిపి చెల్లిస్తారు. అయితే నగదు 25% తగ్గకూడదన్న నియమం ఉంది. పని జరిగేటప్పుడు ఎవరికైనా ప్రమాదం జరిగితే ఉచితంగా చికిత్స జరిపిస్తారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే నిర్దేశిత ఎక్స్గ్రేషియా చెల్లిస్తారు. ఈ పథకంలో అమలు చేసే పనిలో 50% గ్రామ పంచాయతీయే నిర్వహిస్తుంది. పనుల ఎంపికలో గ్రామ సభలదే నిర్ణయాత్మకపాత్ర కాబట్టి గ్రామ సభలో సోషల్ ఆడిట్ జరుగుతుంది. పనుల ఎంపిక, అమలు, కూలీ చెల్లింపులతోపాటు నాణ్యతా పరీక్షలోనూ పారదర్శకత పాటిస్తారు. అంటే పనులకు సంబంధించిన అన్ని రికార్డులు, జమా ఖర్చుల వివరాలను సోషల్ ఆడిట్ కోసం గ్రామ పంచాయితీ ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది.  గ్రామాల్లో ఎక్కువకాలం మనుగడలో ఉండే ఆస్తులను ఏర్పాటు చేయడానికి, గ్రామీణపేదల ఉపాధి వనరులను పెంచడానికి ఈ పథకం కింద పనులు చేపడ్తారు. ఉదాహరణకు ఎస్.సి., ఎస్.టి.ల భూములు, బిసిలకు చెందిన అసైన్డ్ భూములను సాగు భూములుగా మార్చే పనులు, కరువును ఎదుర్కోవడానికి మొక్కల పెంపకం, నీటి సంరక్షణ పనులు, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మిగతా ప్రపంచంతో గ్రామీణ ప్రాంతాలకు అనుసంథానం తెగకుండా వాటికి రోడ్లు వేయడం వంటి పనులు చేపడ్తారు.  వికలాంగులకు చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం నర్సరీల పెంపకం, మంచినీళ్ళను అందించడం వంటి పనులను కేటాయిస్తారు. ఇక మహిళా స్వయం సహాయ గ్రూపులకైతే ఈ పథకం కింద చాలా పనులున్నాయి. మహిళల గ్రూపులతో కూడిన గ్రామ సంఘం గ్రామ పంచాయితీలతో కలిపి పని చేయాలి. వారు పనులకోసం గ్రామీణులను సమీకరించాలి. గ్రామంలో పనుల కేటాయింపుకు, పథకం అమలుకు సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారాన్ని బహిరంగంగా అందరికీ తెలిసేలా ఉంచేందుకు ఏర్పాటు చేసే సమాచారం అందించే బాధ్యత మహిళా గ్రూపులదే. అలాగే వీరికి వేజ్స్లిప్లను పనిచేసే వారికి అందించే బాధ్యత కూడా ఉంటుంది. ఈ పనులను చేసిన గ్రామ సంఘాలకు ఫీజు కూడా చెల్లిస్తారు. ఈ పథకంలో నిబంధనల్లోనే పారదర్శకతను కాపాడే ఏర్పాటు ఉంది. ఉదాహరణకు పని కేటాయింపు జరిగిందనే సమాచారం దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి లేఖ రూపంలో వెడుతుంది. కాబట్టి దళారీలు, కాంట్రాక్టర్లు అసలు లబ్దిదారుల ప్రయోజనాలను దెబ్బతీసే ముప్పులేదు. ఈ చట్టం కింద మానవవనరులతోనే పనులు పూర్తి చేయించాలి తప్ప యంత్రాలు ఉపయోగించ రాదు, కాంట్రాక్టర్లను నియమించరాదనే నియమం ఉంది.

Read Full Post »

(పుష్ప)

వేరేవాళ్ళ ప్రోత్సాహం కొంత, నేను ఏదైనా సాధించగలను అనే ధీమా, 100% కష్టపడి చదివితే మన భూమిక లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవా అనే ఆశ కొంత, అన్నీ కల్సి నన్ను చదువుకొని పై దిశగా ఆలోచించడానికి కారణం అవుతున్నాయి.  ఒకరోజు అమ్మ నాన్నని చూడాలని ఎంతో కుతూహలంతో ట్రెయిన్లో సికింద్రాబాద్ నుండి బయలుదేరాను. ఇంటికి వెళ్ళగానే అమ్మనాన్న ఎవరు కూడా లేరు. దాంతో ఒక్కసారిగా కళ్లనిండ నీళ్ళు తిరిగాయి. మసకమసక చీకటి ఆవరిస్తోంది. పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. అయినా అమ్మనాన్నని చూడాలని ఒంటరిగా వెళ్ళాను. వాళ్ళ ముద్దులతో ముగ్దురాలనై పోయాను. అదే సమయంలో నా వయసులో ఉన్న ఓ అమ్మాయి కూలీపనికి వచ్చింది. తను నన్ను చూస్తూ దీనంగా ఉండిపోయింది. ఒకవైపు ఏమీ తెలియని అమాయకత్వం కన్పించింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని నీవు ఎందుకు చదువుకోలేదు అంటే మా నాన్న ‘’అమ్మాయికి చదువెందుకు,  కానీ అబ్బాయికి చెప్పిస్తే పోలా’’ అని అతడిని బడికి నన్ను పనికి పంపించాడు అంది. ‘నీకు ఇప్పుడు ఏమి అన్పిస్తుంది, పని ఈజీగా ఉందా’ అని ప్రశ్నించేసరికి తప్పదు కదా! పుష్ప ‘రేపటిరోజు పెళ్ళి చేసుకుంటే అత్తవారింటి దగ్గర కూడా ఈ పనిచేయకపోతే నన్ను పలువురు పలురకాలుగా నిందిస్తుంటారు. అయినా అమ్మాయిగా ఉన్నందుకు ఈ చాకిరి తప్పదు. నేను నీలాగ చదువుకొని వుంటే అందరితో కల్సి మాట్లాడేదాన్ని, వారిని నిలదీసేదాన్ని. నాకు నేను సమాధానం చెప్పుకునేదాన్ని కాబట్టి ఇప్పుడంటూ చేసేది ఏమీ లేదు. ఇంత పెద్దగా అయ్యాను’ అంటూ తనగోడు చెప్తూ చేతులు చాచి వాపోతుంటే ఆ చేతులను పరిశీలించాను. తెల్లగా నీటుగా ఆడుతూ, పాడుతూ ఉండాల్సిన చేతులు మాసిపోయి కొడవలి గాతలతో కరుకుబండిలాగ కన్పించింది. దాంతో ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.  మళ్ళీ ఒకరోజు సంక్రాంతి సెలవులకోసం అని ఎంతో ఉత్సాహంతో ఇంటికి వెళ్ళాను. అమ్మ వచ్చి పుష్ప ఏమి బాగున్నావా అంది. దాంతో ఏంటీ ఈమె సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది అనుకున్నాను. తర్వాత నిర్మల (తన కూతురు) పెళ్ళి అంటూ శుభలేఖ తెచ్చి ఇచ్చింది. ఏంటత్తమ్మా ఈ చిన్నవయసులో పెళ్ళా అని అన్నాను. నిర్మల రెండు సం||ల క్రితం ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా ఉండేది. ప్రకృతికి సంబంధించిన ఒక పాటకు నేను డ్యాన్స్ నేర్పించాను. నాకే కొన్ని కొత్త స్టెప్పులు చూపించింది. అలాంటి అమ్మాయి చూస్తుండగానే పెద్దగా అంటే శరీరపరంగా పెద్దగా అయ్యింది. దాంతో పెళ్ళిచేయకపోతే కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఎక్కువ చదివించినా ఎక్కువ కట్నం వస్తుందని 5వ తరగతిలోనే చదువుకి ఫుల్స్టాప్ పెట్టించింది. ఆ తరువాత పెళ్ళిసంబంధాలు చూడటం ప్రారంభించింది. అబ్బాయిలు చాలామంది తాగుబోతులు, పొగరుబోతులు కూడా. అమ్మాయిలు అంటే వాళ్ళ దృష్టిలో పనిమనిషి. అలాంటి వాళ్ళ చేతుల్లోకి పోయి కీలుబొమ్మలాగ వాళ్ళు చెప్పిన పనికి తలవంచి పనిచేయాల్సిందే. లేనిచో విడాకులు ఇస్తారు. ఇంకో భార్యను చేసుకుంటాను అంటే ఇటు అమ్మాయి గుండెల్లో అటు అమ్మాయి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాల్సిందే.  ఇదంతా చూస్తుంటే నా మనసు మనసులో లేదు. ఏమిచేయాలో తోచక అర్థంకాని పరిస్థితి. చూస్తూ కనీసం డిగ్రీ కూడా అయిపోలేదు. ఒకవేళ సివిల్స్ రాసి కలెక్టర్గా జాబు చేస్తే కనీసం ఒక జిల్లాలోనైన మార్పులు చేయవచ్చు. అమ్మాయిలపై కూడా ప్రత్యేకశ్రద్ధ తీసుకోవచ్చు. ఆ అమ్మాయిలను కనీసం చదివించి కొంతమంది స్త్రీలకు, పురుషులకు వున్న వ్యత్యాసాన్ని వివరించి ఎందుకు? ఏమిటి? ఎక్కడ? ఎలా అనే కారణాలు నూరిపోసినట్లయితే వాళ్ళకంటూ ఒక ఉద్యోగం చూపిస్తే తిరుగులేని శక్తిగా వారు తయారు అవుతారు. వాళ్ళ ఇంట్లో ఏమన్నా పెళ్ళిపెటాకులు అన్నా పెద్దవాళ్ళకు సమాధానం చెప్పగలిగే స్థాయిలో వుంటారు. తనకంటూ ఆ ఊర్లో కొంత విలువ సంపాదించు కుంటారు. ఎవరైనా మగవారిని ఎక్కువచేస్తూ మాట్లాడితే నాకేంటి తక్కువ అని నిలదీసి అడుగగలుగుతుంది. మరి ఈ సమాజం మారేదెప్పుడు?  అప్పుడు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాను. రెండు సంవత్సరాల క్రితం ఒక ఆంటీ పరిచయం అయ్యింది. మళ్ళీ ఒకసారి పిల్చి ఆంటీ బాగున్నారా అని పలుకరించగా, ‘ఆ బాగున్నానమ్మా’ అంటూ ఆప్యాయతతో పలుకరించింది. ఆ తర్వాత మీ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ‘చదువుతుంది’ అనే సమాధానం వచ్చేది. కాని ఇప్పుడు ఆ స్థానంలో వచ్చే ఉగాదికి పెళ్ళి అంటూ సమాధానం చెప్పింది. అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశారా. పక్కా తిరుగుబోతు, తాగుబోతు, గుట్కా మింగే అలవాటు, పెళ్ళైన అమ్మాయిలతో తిరిగే బేవర్సు ఇలా తనకి లేని అలవాటంటూ లేదు. అయినా కూడా కట్నం తక్కువని ఒప్పుకుంది అంటీ. కష్టపడి చదివే అమ్మాయిల కోసం సిటీలో అనాథ ఆశ్రమాలు బిసి, ఎస్.టి., ఎస్.సి. గర్ల్స్ హాస్టల్స్ కూడా చాలా ఉన్నాయి, కనీసం ఆ అమ్మాయిని హాస్టల్లో అయినా జాయిన్చేయాలి అనుకున్నాను. ఆంటీ ఇప్పుడు ఆ అమ్మాయిని పంపించు అంటే ఎంగేజ్మెంట్ కూడా ఐపోయింది. పెళ్ళి చేయకపోతే ఊర్లో పరువుపోతుంది. చదివిస్తే జాబ్ వస్తుంది అని చెప్తున్నావు కానీ అలా ఎవరు చేస్తున్నారు.  అదే ముందునుండి మనం సమాజంలో చైతన్యం కల్గించి తల్లిదండ్రులకు తగిన మాటలతో ఒప్పించి అమ్మాయిలకు ప్రత్యేక క్లాస్లు తీసుకోవటం వల్ల తప్పకుండా వాళ్ళలో మార్పు కన్పిస్తుంది. ప్రతి ఊర్లో కూడా ఆ అమ్మాయి అంటే ఊర్లో హడలయ్యే పరిస్థితిని మన కళ్ళముందు చూసి ఆనందించవచ్చు.  పై మూడు సందర్భాల్లో మనం మన అమ్మాయిల ధోరణి ఏంటో గమనించవచ్చు.  అమ్మాయిలు అనగానే ముఖ్యంగా పల్లెటూర్లలో అబ్బాయిలకంటే తక్కువచేసి చూస్తారు, అమ్మాయిలు కూడా అలాగే ఆలోచిస్తారు, కొందరమ్మాయిలు ఐతే మనకీ పరిస్థితి తప్పనిసరంటూ బాధతో అలాగే కుమిలిపోతారు.  తల్లిదండ్రుల ధోరణి కూడా అలాగే ఉంటుంది. అమ్మాయిలు అనగానే కొన్ని పనులు వీరికి, మగవారు అనగానే కొన్ని పనులు వారికి కేటాయిస్తారు. అంటే అక్కడ వారిలోపం కాకపోవచ్చు. వారికి ఏమీ తెలియదు. కాబట్టి తెల్సినవాళ్ళం మనమే పోయి వారిలో అవగాహన తేవచ్చు. కానీ మనం పల్లెటూర్లకి ఎక్కడ వెళ్తున్నాం, వాళ్ళ పరిస్థితుల్ని ఎక్కడ గమనిస్తున్నాం?  ఇలా చేస్తే సమాజంలో, అమ్మాయిల్లో మార్పు తప్పనిసరి: హలో! యూత్ ఫ్రెండ్స్ మనమే జాబ్స్ చేస్తూ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్గా ఏర్పడి పల్లెటూళ్ళలోకి అడుగుపెట్టి అక్కడ ఉండే పరిస్థితులను గమనించి 7వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అయిపోయాక చాలామంది బడి మానేస్తుంటారు. కానీ అలా జరుగకుండా వారికి పై చదువులు చదివితే, ఏం చేయవచ్చు అని వివరించి చెప్పాలి. ఆ తరువాత వారి తల్లిదండ్రుల్లో నిరాశనిస్పృహలను దూరం చేస్తూ వారిలో మనోధైర్యాన్ని తీసుకురావాలి. చాలామందిలో అమ్మాయిలకు అబ్బాయిలకంటే ముందు పెళ్ళి చేయాలనే ధోరణి ఉంటుంది. మగవారు ప్రవర్తించే రాక్షసతత్వాన్ని కళ్ళకు కట్టినట్లుగా ముందే వివరిస్తే వారు అప్పుడు పెళ్ళికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. మన వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా సిటీలో ఉపాధి అవకాశాలు బోలెడు. వాళ్ళు వాటిని సద్వినియోగం చేసుకుంటారు. పదిమందిలో వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకుంటారు.  కొందరు అమ్మాయిలు ఫెయిల్ అవ్వగానే ఇంట్లో కూర్చోబెడుతారు. అదే అబ్బాయిలు అయితే రెక్కలుకట్టి ఆకాశాన విహరించినా పట్టించుకోరు. అదే అమ్మాయి విషయంలో అడుగడుగునా ఆంక్షలు విధిస్తుంటారు. మరి మనమే స్వయంగా అటువంటి అమ్మాయిల దగ్గరికిపోయి వారిలో చైతన్యాన్ని నింపినట్లయితే వాళ్ళు కూడా తప్పకుండా పక్షుల్లాగే స్వేచ్ఛగా ఆ పంజరం నుండి బయటపడతారు. ఈ అంశాలన్నింటిని దృష్టిిలో పెట్టుకుని పల్లెటూర్లోనే కాదు సమాజంలోని ప్రతి ఒక్కరి దగ్గర ఈ అంశాలను గురించి చర్చించి ఆలోచింప చేయగలిగితే సమాజంలో మార్పు తీసుకురావచ్చు.

(రచయిత : డిగ్రీ 3వ సం. కోఠి ఉమెన్స్స్ కాలేజీ విద్యార్ధిని)

Read Full Post »

(డా. మానేపల్లి)

గృహహింస అంటే ఒక కుటుంబంలో భర్త భార్యను గానీ, లేదా అవిభక్త/ఉమ్మడి కుటుంబంలో అత్తమామలూ, ఆడపడుచూ – పై ఇంటినుంచి కోడలుగా వచ్చిన ఇల్లాలిని పెట్టే హింసగాని, కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, లేక బావలు, మరుదులు పెట్టే హింసగాని – అని అర్థం చెప్పుకోవచ్చు. అది అన్ని ఇళ్ళల్లో అన్ని కులాల్లో అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. ఆ యింటి స్థాయి, కుటుంబసభ్యుల ఆర్థికస్థాయి, ఆస్తిపాస్తులు, కులంమతం సంప్రదాయం వంశాచారాలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. గృహహింస-ఈ సమాజం అంత వైవిధ్యమైనది. కుటుంబం అంత పురాతనమైనది.  మహిళా కార్యకర్తలంతా రెండు ముఖ్యగ్రంథాల్ని అధ్యయనం చెయ్యాలని సూచిస్తున్నాను. ఒకటి ఫ్రెడరిక్ ఏంగిల్స్ రచన – ‘’కుటుంబ, రాజ్యాంగం పుట్టుక, వ్యక్తిగత ఆస్తి’’ – ఇది 1950ల నాటికే తెలుగులో అనువాదమైంది, అనేక పునర్ముద్రణలు కూడా పొందింది. మరొక పుస్తకం ప్రముఖ ఫ్రెంచి రచయిత్రి సైమన్ ది బువో రాసిన ‘’సెకండ్ సెక్స్’’. ఇది నేను సంక్షిప్తంగా తెలుగులో అనువదించాను. హైదరాబాద్ బుక్ ట్రస్టువారు ప్రచురించారు (2000 – ప్రస్తుతం కాపీలు లభించడం లేదు.) వీటితోపాటు చలం రచనలు స్త్రీ, బిడ్డల శిక్షణ రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’ – కూడా చదవడం అవసరమే. సమస్యను మరింత లోతుగా అధ్యయనం చెయ్యడానికి ఈ పుస్తకాలు చాలా సహకరిస్తాయి.  స్త్రీకి మొదటినుంచీ బానిసత్వం లేదు, హింసకు గురికానూలేదు. మానవులు ఆహారసేకరణ దశ, వేట దశలో – వ్యవసాయ నాగరికత ముందు – స్త్రీపురుషులలో భేదం లేదు. స్త్రీని దేవతగా పూజించడం కూడా లేదనే చెప్పాలి. వైదికనాగరికత కాలంలో – క్రీస్తుపూర్వం 10-5 శతాబ్దాల కాలంలో స్త్రీ పూజనీయురాలయింది. అప్పటికి దేవతా విగ్రహాలుగాని, గుళ్లూగోపురాలు పూజలూ వ్రతాలు గానీ లేవు. మలివైదిక నాగరికత కాలంనాటికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వేట వెనుకబడి – వ్యవసాయం పెరిగింది. ఆవు-గోమాత అయింది.  జంతువుల్ని మచ్చిక చేసుకుని, వ్యవసాయం, పాడీ ప్రారంభించారు. ఈనాటి స్త్రీపురుషసంబంధాలూ భార్యాభర్త సంబంధాలు ఆనాడు లేవు. ఒక గుంపులోని స్త్రీలు, ఇంకొక గుంపులోని పురుషులందరికీ భార్యలే. సంతానంపై తల్లికి ఆధిపత్యం ‘’మాతృదేవోభవ’’ ‘’యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర నందంతి దేవతాః’’ ఇదీ పరిస్థితి. వ్యవసాయం అభివృద్ధి చెందుతున్నకొద్దీ – మాంసాహారం తగ్గింది. గోవధ నిషేధం వచ్చింది. మాంసాహారం కంటే శాకాహారం పవిత్రమైనదనీ, ఉత్తమమైనదనే నమ్మకం వ్యాప్తిలోకి వచ్చింది. అప్పటికి బౌద్ధం ఆవిర్భవించింది. అహింస పరమోధర్మః అయింది. ‘’మాంసం మాంసేన వృధ్యతే’’ ఇక ఎంతమాత్రం అమలు కాలేదు. సరిగ్గా ఆ దశలో స్త్రీ ఆధిపత్యం తగ్గి పురుషాధిపత్యం పెరిగింది. కొంత పోరాటం జరిగింది. దుర్గ-మహిషాసురమర్దన, అర్థనారీశ్వరుడు – ఆ కాలం నాటికే తండ్రి ఆజ్ఞమేరకు తల్లిని నరికేవాళ్ళ కథ పుట్టింది. ఇప్పుడు కొత్తగా – ‘’పితృదేవోభవ’’ పుట్టింది.  పురుషస్వామ్యభావజాలం ఏ స్థితికి దిగజారాలో అంతా దిగజారింది. స్త్రీ బుద్ధి: ప్రళయాంతకః, న స్త్రీ స్వాతంత్య్రమర్హతిలాంటి కొత్త ఆర్యోక్తులు బయలుదేరాయి.  అబద్ధం ఆడితే ఆడదయి పుడతాడు, నాలుగు కొప్పులు ఒక దగ్గర ఇమడవు, ఆడపెత్తనం – బాజా, ఇలా స్త్రీబతుకు దుర్భరమైంది.  హాలుని గాథాసప్తసతి – క్రీ.శ. ఒకటవ శతాబ్ది నాటిది. ఆ గాధల్లో కనీసం పదిహేను గాథల్ని రచించాడని ఆరుద్ర, తిరుమల రామచంద్ర వంటి పండితులు నిరూపించారు. ‘’ముదిత నేనేర్వగరాని విద్యగలదే ముద్దారనేర్పించినన్’’ అనే వాక్యం 16 శతాబ్ది మధ్యకాలానికి చెందినది. తరిగొండ వెంగమాంబ, తాళ్లపాక తిమ్మక్క, కుమ్మరి మొల్ల (ఈమె ఇంటిపేరు ఆతుకూరు – కాని ఈమెను కందుకూరి వీరేశలింగం వంటి మహాపురుషులు కుమ్మరి మొల్లను చేశారు) ముద్దుపళని, కృష్ణాధ్వరి, పసుపునేటి సుభద్ర – ఈ మొదలైన వారెందరో కవయిత్రులున్నారు. 1650-1700 వరకూ పరిస్థితులు బాగానే వున్నాయి. రాణీరుద్రమ్మ, ఝాన్సీలక్ష్మీబాయి, చాంద్బీబీ – వీరంతా మహిళలే. కాని వలసపాలనతో పరిస్థితులు బాగా దిగజారాయి. ముస్లిం స్త్రీలలోనే కాక, కులీన హిందూస్త్రీలలో కూడా ఘోషా/పర్దా పద్ధతి వచ్చింది. మగువ మాంచాల, బొబ్బిలిలో మల్లనుదేవి కూతురు – సతీసహగమనం చేశారని కథలు చెబుతున్నాయి. స్త్రీలు చదువులకు దూరమయ్యారు. కులం విపరీతంగా బలపడింది. ఒకనాటి కులాంతర వివాహాలు లేవు. స్త్రీకి అటు వారసత్వ హక్కుగాని, ఇటు సంతానంపై హక్కుగాని లేవు. ఆడపిల్లలు పుడితే బాధపడటం చంపడం ప్రారంభమైంది. కన్యాశుల్కం వచ్చింది. ప్రాచీన వివాహంలో కట్నం సమస్య లేనే లేదు. ఇది మధ్యయుగాల్లో వచ్చిందని గుర్తించాలి. ధర్మసమ్మతంగా తాళికట్టిన భార్యకు తప్ప, ఇతర స్త్రీలకు వారసత్వ అర్హత లేదు, వారి సంతానానికి ఆస్తిహక్కు లేకపోతే – సమాజంలో గౌరవనీయమైన గుర్తింపులేదు. శ్రీకృష్ణుడి అష్టభార్యలు, పదహారువేల గోపికల కథ – పురుషుడిలో భోగలాలసతకు పరాకాష్ఠ. కృష్ణదేవరాయలు, రఘునాథనాయకుడు బహుభార్యత్వం అవలంబించారు. నాయకరాజుల కాలంలో దేవదాసి, గణికలు, సర్కిరికలు, తెలంగాణాలో ఆడబాప, బసివి వ్యవస్థ ఏర్పడి అనుల్లంఘనీయమై పోయియి. గృహహింసపై జరగవలసిన చర్చకు – తరతరాల ఈ చరిత్ర మొత్తాన్ని నేపథ్యంగా తీసుకోవలసి వుంది. 1750 తరవాత పరాయి/వలస పాలనలో స్త్రీల స్థితిగతులు ఎంత దుర్భరంగా మారాయో అర్థం చేసుకోవాలి. రాజారామమోహనరాయ్ సతీసహగమన దురాచారాన్ని బిల్లు ద్వారా నిరోధించగలిగాడు గాని – సమాజంలోంచి తొలగించలేకపోయాడు. గురజాడ కన్యాశుల్కంపై పోరాటం ఫలించింది గాని – అది రూపం మార్చుకుని – వరకట్నం అవతారంలో కాటువెయ్యడం ఇప్పటికీ మానలేదు. సమాజంలో మార్పు తీసుకురావడానికి తీవ్రంగా, దేశవ్యాప్తంగానూ, సంఘటితంగానూ కృషి చెయ్యాలి.  కులం, మతం, సంప్రదాయాలు – ఒకరకంగా హింసకు పట్టుగొమ్మలు. కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న సందర్భాల్లో వధూవరులను (లేక ప్రేమికులను) దారుణంగా హింసించడం, కుటుంబపరంగా సమాజపరంగా వెలివేసి వేధించడం, కొన్ని పరిస్థితుల్లో ద్వేషం, కక్ష పెంచుకుని చంపడం – మనం తరచు పత్రికల్లో చూస్తున్నాం. జీవితవిధానంగా మతభావనను ఒకస్థాయివరకూ అంగీకరించవచ్చు. కాని మానవుల మధ్య అడ్డుగోడలు నిర్మించడం, వివాహసంబంధాలు మొదలైన వాటికి అవాంతరంగా, హానికరంగా తయారైతే సహించకూడదు. ముస్లిం మతంలోని తలాక్ వ్యవస్థ రద్దు చేసి కులంతో మతంతో సంబంధం లేకుండా – అన్ని వివాహాలు రిజిస్ట్రేషన్ చేయించాలి. విడాకుల కేసుల్లో – భార్యాబిడ్డలకు తప్పనిసరిగా ఆర్థికరక్షణ, పోషణ, వసతులు కల్పించాలి. భర్త ఏ కారణంచేత అతితక్కువ ఆదాయం కలవాడయితే – కొంత భారాన్ని (సబ్సిడీ/ప్రత్యామ్నాయ ఆర్థిక సహకారం) మహిళాశిశుసంక్షేమశాఖ, రెవిన్యూశాఖ భరించే విధంగా చట్టం తేవాలి. వివాహేతర సంబంధాల విషయంలో గట్టి శిక్ష విధించి, నిషేధించాలి. కొందరు ముస్లిం మతంలో బహుభార్యాత్వం అనుమతిస్తారు గనుక, ఆ మతం స్వీకరించి ఇద్దరేసి ముగ్గురేసి భార్యల్ని పెళ్లిచేసుకుంటున్నారు.  కొన్నిరకాల మతభావనలు కలవారు – కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు వ్యతిరేకం – అంటే సంతానం దైవదత్తం గనుక దాన్ని నిరోధించడం హత్య, పాపం అని – అధికసంతానం కనడానికి సిద్ధపడుతున్నారు. 50, 60 ఏళ్లు దాటిన కొందరు షేకులు ముక్కుపచ్చలారని 13, 14 సం|| పసిపిల్లల్ని పెళ్లిచేసుకుంటున్నారు. పేద ముస్లిం అమ్మాయిలని కొని – వ్యభిచారం సాగిస్తున్నారు. దీన్ని నిరోధించడానికి తగిన చట్టం గాని, బలమైన ప్రభుత్వ యంత్రాంగం గాని లేదు. బాల్యవివాహం చట్టం పటిష్టం చేసి ప్రతి పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించి తీరాలని చట్టం చేస్తే బాల్య వివాహాలు చాలవరకు నిరోధించవచ్చు.  స్త్రీలు ఉద్యోగాలు చేసే సందర్భాల్లో కూడా – భర్తలు వారిపై అజమాయిషీ చెయ్యడం చూస్తున్నాం. స్త్రీకి స్వతంత్ర ప్రతిపత్తి వుండాలి. రికార్డుల్లో తప్పనిసరిగా తల్లిపేరు ఉండాలి. పేదరికస్థాయి దిగువనగల ప్రతి ఆడపిల్లకు ప్రభుత్వం శాశ్వత ఆర్థిక సహకారం అందించాలి. చట్ట సభల్లో 33% మహిళా ప్రాతినిధ్యం బిల్లు దశాబ్దాల తరబడి దీర్ఘనిద్ర తీస్తోంది.  ప్రతి జిల్లాలో బలమైన మహిళాసంఘాలుండాలి. మహిళల్లో అక్షరాస్యత పెంచాలి. మహిళా శిశు సంక్షేమశాఖ పరిధి విస్తరించాలి. గర్భంలోనే ఆడపిల్ల పిండాన్ని చంపేసే పద్ధతిని నిషేధిస్తూ చట్టం తేవాలి. గృహహింస నిరోధచట్టం పేరుకు వచ్చింది గాని, అది అమలుకావడం లేదు. కాగితాలకే పరిమితం అయ్యింది.  స్త్రీ బాలవృద్ధుల సంక్షేమం, రక్షణ – కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు సమాజం మొత్తం ఇందుకు బాధ్యత వహించాలి.

(రచయిత ఒక ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్. విశాఖ జిల్లా ‘ఎలమంచిలి’లో ‘అవగాహన’ సాహిత్యసంస్థ నిర్వహిస్తున్నారు).

Read Full Post »

(రాజ్యంసిన్హా)

(గ్రామాలు అన్ని రకాలుగాను విధ్వంసం వేపు అడుగులేస్తున్న ఈనాటి ప్రపంచీకరణ నేపధ్యంలో 1985 రాజ్యంసిన్హా రాసిన ఈ వ్యాసం ప్రచురించడం ఒక అవసరంగా భావించాం. ఈ వ్యాసాన్ని అందించిన వి. హనుమంతరావుగారికి ధన్యవాదాలు.)

1985 డిసెంబరులో ‘’గ్రామీణా భివృద్ధి’’ని ఒక వృత్తిగా చేపట్టగల అవకాశాలు ఎలావున్నాయి? ప్రస్తుతం కొన్ని విశ్వవిద్యాలయాలలో గ్రామీణాభివృద్ధి అనే పాఠ్యాంశాన్ని తీసుకున్న విద్యార్ధులకు ఉద్యోగాలు ఎంతవరకు లభించాయి? వగైరా అంశాలను చర్చించడానికి హైదరాబాదులోని ‘రాజేంద్రనగర్’ లోని వ్యవసాయశాఖ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గల (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్) గ్రామీణాభివృద్ధి జాతీయ సంస్థలో ‘జాతీయ సదస్సు’ జరిగింది. ఈ సదస్సులో ‘గ్రామీణాభివృద్ధి’ అంశాన్ని భోదిస్తున్న విశ్వ విద్యాలయాల నుంచి ప్రొఫెసర్లు, బ్యాంకుల ప్రతినిధులు, గ్రామీణాభివృద్ధి కొరకు పోటీపడుతున్న సంస్థలవారు, స్వచ్చంధ సేవాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఢిల్లీ, గుజరాత్, బీహారు, పశ్చిమబెంగాల్, కర్నాటక, తమిళనాడు, ఆంధ్ర మొదలగు రాష్ట్రాలనుంచి వివిధ రంగాలలో పనిచేస్తున్న వీరు మూడు రోజులపాటు యీ విషయాలను చర్చించారు. ‘భారతజాతీయ మహిళా సమాఖ్య’ తరపున ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి శ్రీరాజ్యంసిన్హా యీ గోష్టిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి సిన్హా గోష్టిలో చదివి చర్చించబడిన పత్రాన్ని యీ వ్యాసంలో ప్రచురిస్తున్నాం. సం||)  ‘గ్రామీణాభివృద్ధి’ అంటే ఎలా వుండాలి? అనే విషయం గురించి 1947వ సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి ఏదో ఒక రూపంలో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల ఫలితంగా, భావాలకు, ఊహలకు ఒక రూపకల్పన జరిగింది. అదే సహకార సంస్థలు, పంచాయతీ రాజ్యవ్యవస్థ, కమ్యూనిటి డెవలప్మెంటు, బ్లాకుల స్థాపన లాంటివి అని స్థూలంగా చెప్పవచ్చును. వీటి పనితీరు, నిర్మాణం, కాలానుగుణంగా వివిధ రూపాలలో, చాలా రాష్ట్రాలలో మార్పులు వచ్చాయి.  ‘’లెక్కల ప్రకారం చెప్పాలంటే, దారిద్య్ర తీవ్రతను తగ్గించడానికి ఆరవ ప్రణాళిక లక్ష్యాలుగా నిర్ణయించబడిన స్వయం ఉపాధి, ఉద్యోగభృతి కార్యక్రమాలు సాధించబడ్డాయి. కాని వాస్తవరూపంలో, ఎవరికోసమైతే యీ ప్రయోజనాలు ఉద్దేశించబడ్డాయో వారిలో బహు సంఖ్యాకులకు యివి అందలేదు. అందుకు కారణం యీ ప్రయోజనం ఎవరికి అందాలి? కార్యక్రమాలు ఎలా ఉండాలి? అన్న విషయాలు సక్రమంగా అమలు జరుగ నందువల్లనే’’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి క్రిందటి నెలలో అన్ని రాష్ట్రాల నుండి హాజరయిన గ్రామీణాభివృద్ధి మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ‘’ప్రస్తుతం వున్న గ్రామీణ బీదల సంఖ్యను 22 కోట్ల నుండి 1989-90 సంవత్సరం నాటికి 16 కోట్లకు తీసుకురాగలం’’ అని కూడా సమావేశంలో కేంద్ర మంత్రిగారు అన్నారు.  ఈ వ్యాఖ్యలు, ప్రకటనలు, గ్రామీణా భివృద్ధి సమస్యను ఒక విశాల దృక్పథంతో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.  మన దేశం స్వాతంత్య్రం సంపాదించిన తర్వాత అవసరమైన దశలో అభివృద్ధి త్వరగా అమలు పరచబడలేదు అన్న నిజం తెలుస్తోంది. ఈ క్రింద ఉపహరించబడిన కొన్ని ప్రధాన కారణాలు ఇందుకు కారణంగా చెప్పవచ్చును.  (ఎ) ఆర్థిక కేటాయింపులు – ఈ పెద్ద జాతీయ సమస్యకు అంటే, 80 శాతం ప్రజలు పల్లెలలోనే నివసించే జనాభా గల మన దేశంలో తగినంతగా ఆర్థిక కేటాయింపులు జరుగలేదు. (బి) అమలుపరచే యంత్రాంగం – రెండు దశాబ్దాలుగా వివిధ ఉద్యోగాలలోను, స్త్రీ శిశు సంక్షేమశాఖ, సమాచార పౌర సంబంధాల డైరక్టర్గాను, నాకు గల అనుభవంతో యంత్రాంగంకు తగిన సౌకర్యాలు కలిగించకపోవడం ఒక కారణమని చెప్పగలను. గ్రామాలలో పనులు జరగాలంటే అక్కడ పనిచేయడానికి వెళ్ళి ఉండే వ్యక్తులకు, స్త్రీలు గాని, పురుషులకు గాని కనీస సౌకర్యాలు కలుగచేయాలి. ఉండటానికి వసతి, ఆరోగ్య సౌకర్యాలు, పిల్లలకు చదువుకునే అవకాశం లాంటివి లేకపోతే ఆ గ్రామాలలో పనిచేయడానికి పంపించబడే వ్యక్తులు చిత్తశుద్ధిగా, మనస్ఫూర్తిగా పనిచేయలేరు. జీతాలు తీసు కుంటూ దేశానికి సేవచేయగల అవకాశం వున్న ఉద్యోగాలు అని తెలిసి గ్రామాలలో పని చేయడానికి కొంత ముందుకు వచ్చినవారు యీ సౌకర్యాల కొరతవల్ల ఉత్సాహం చూపలేదు.  గ్రామాలలో ఉద్యోగాలకు నియామకాలు చేసేటప్పుడు కేవలం డిగ్రీలే కాక, తక్కిన అర్హతలు కలవారికి ప్రాముఖ్యత యివ్వవచ్చును. పల్లెటూరులోపుట్టి, అక్కడ కొంతకాలం స్కూళ్ళలో చదువుకుని, లేక చిన్న చిన్న పట్టణాలలో వున్న కాలేజిలలో డిగ్రీ వరకు చదువుకున్నవారు సహకార సంస్థలు లాంటి ఉద్యోగాలలో అనుభవం వున్న ప్రభుత్వోద్యోగులను ప్రోత్సహించాలి. ఒక్కొక్కప్పుడు పల్లెటూళ్ళలో పుట్టినవారు తిరిగి గ్రామాలలో పనిచేయడానికి యిష్టపడని వ్యక్తులు కూడ వుంటారు. పల్లెల పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకుని అక్కడ పనిచేయడానికి సుముఖులుగా వున్న వారిని సాధ్యమైనంత వరకు పంపించాలి.  ‘గ్రామీణాభివృద్ధి’ కి వృత్తిగా తర్ఫీదు అనేది ఆచరణీయంగా వుండాలి. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రం, విజ్ఞానం సహాయంతో పరిష్కరించగల దృక్పథంతో ప్రణాళికలు తయారు చేయాలి. ఉదాహరణకు, ఇండ్లు, వీధులలో దీపాల కొరకు ‘సోలార్ ఎనర్జీ’ని ఉపయోగించాలి. అందరకు అందుబాటులో ఉండేటట్లు బావులు, స్నానం చేయడానికి వసతులు, మరుగుదొడ్లు, స్త్రీలకు ప్రత్యేక ఏర్పాట్లు, చిన్న చిన్న చేతి పరిశ్రమలు, పాడిగేదెలు, కోళ్ళఫారంలు, ఆధునిక వ్యవసాయానికి పనికి వచ్చే చిన్న చిన్న పరికరాలు తయారుచేయ గలిగే కార్ఖానాలు, యీ సామానులను బాగు చేసే వర్కుషాపులు, సహకార సంస్థలు, కట్టెలు, ఇనుప సామానులతో చిన్న చిన్న పరిశ్రమ లకు పనికి వచ్చే సాధనాలు తయారుచేయడం లాంటివి స్థాపించాలి.  ఇది గ్రామీణాభివృద్ధికి పునాదులుగా ఏర్పడి సక్రమంగా అమలు జరిగితే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని చెప్పవచ్చును. పైన వుదహరించబడ్డ యీ అంశా లన్నింటిపైన విశ్వవిద్యాలయాలు, నిపుణులు, స్వచ్చంద సంస్థలు జరిపిన పరిశోధనలను, స్వయంగా ఆ రంగాలలో చూచి సేకరించిన విలువైన సమాచారాన్ని గ్రామాలలో నివసించే వారికి, పనిచేసే వర్కర్లకు సులభమైన శైలిలో రాసిన పుస్తకాలు అందజేయాలి.  1. గ్రామాలలో నివసిస్తున్న ప్రజల జీవన పరిస్థితులు ఎలా వున్నాయి? అనే విషయంపై మనకు సరియైన అవగాహన లేకపోతే, అసలు గ్రామీణాభివృద్ధి పని అంటే ఏమిటో కూడ మనం అంచనా వేయలేము. మొదటి విషయం వివిధ వర్గాల ప్రజల స్థితి గతులు ఏమిటి? ఏ వర్గాలకు ఎలాంటి సహాయం కావాలి? అసలు యీ వర్గాలు ఏవి? అని నిర్వచించాలంటే స్థూలంగా నాలుగు తరగతులుగా విభజించవచ్చును.  (1) ధనవంతులు, (2) మధ్య తరగతికి చెందిన వారు (3) బీద రైతులు, (4) ఆఖరిది నాలుగవ వర్గం, ఏ ఆస్తి లేకుండా కేవలం కాయ కష్టంతో జీవించేవారు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన వర్గం మరొకటి వుంది. అదే అందరి కంటే హెచ్చుగా నిరక్షరాస్యులుగా వుండి, అణగద్రొక్కబడిన స్త్రీలు, బ్యాంకుల ద్వారా అప్పులు, సబ్సిడీలు, ఉచిత సరఫరాలు, చదువుకోవడానికి సౌకర్యాలు, సాంకేతిక విద్య నేర్పే సంస్థలు, మొదలగు వాటిని ఏర్పాటు చేసే ప్రతిపాదనలలో, వివిధ వర్గాలకు చెందిన ప్రజల నిజమైన అవసరా లను, సక్రమంగా,సరిగ్గా అంచనాలు వేయాలి. (2) పైన ఉదహరించిన లక్ష్యాలకు అనుగుణంగా, ఆ లక్ష్యాలను సాధించాలనే దీక్షతో పనిచేయాలనే ఉత్సాహాన్ని కలిగించ డానికి, స్ఫూర్తినివ్వడానికి ఒక జాతీయ వినోద, విజ్ఞాన కార్యక్రమాన్ని కూడా తయారు చేయాలి. పత్రికలు, సినిమాలు, రేడియో, టెలివిజను, వూరూరా తిరిగే ప్రచార వాహ నాలు, సాంస్కృతిక ఉద్దరణకు అభ్యున్నతికి, కృషి చేయాలి.  నిరక్షరాస్యత కారణంగా అవివేకమైన సంప్రదాయాలకు అంటిపెట్టుకుని, మూఢ నమ్మకాలలో, దురాచారాలలో మునిగి ఉన్న స్త్రీల సమస్యలకు ప్రాముఖ్యత నివ్వాలి. ప్రత్యేక ప్రాధాన్యాతతో యీ సమస్యలను పరిష్కారం చేయాలి.  ఈ కార్యక్రమాలతో పాటు దేశ జనాభా అందరకూ వయోజన విద్యా ప్రణాళిక నొకదానిని అమలు పరచాలి.  గ్రామీణాభివృద్ధిని స్థాపించాలను కుంటున్న సంస్థల్లోని ప్రభుత్వాధికారులు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు, కొంతమంది ప్రముఖులయిన వ్యక్తుల మధ్య తరచుగా సంప్రదింపులు జరగాలనే నియమం వుండాలి.  కార్యక్రమాలు ఎలా అమలు జరుగుతున్నాయో స్వయంగా పర్యవేక్షించి, నిర్దేశించిన లక్ష్యాలు ఎంతవరకు అమలు జరిగాయి? ఇంకా ఏ లోపాలున్నాయి? అందుకు కారణాలు ఏమిటి? వాటిని అధిగమించడానికి క్రొత్తగా తీసుకోవలసిన చర్యలు ఏమి? అనే అంశాలు తరచుగా సమీక్ష చేయడానికి యీ సొసైటీలో ప్రత్యేకంగా ఒక విభాగం వుండాలి.

(విశాలాంధ్ర దినపత్రిక సౌజన్యంతో)

Read Full Post »

(గుగులోతు దేవోజి, కోట వెంకటేశ్వర్లు)

మీకు పుట్టే హక్కు ఉందా? పురుషులైతే ఉంటుంది స్త్రీలయితే… ఏమో చెప్పలేం! ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చినిజం. ఆకాశంలో సగం, అవనిలో సగం అనుకుంటున్న ఆడవారి జనాభా ప్రశ్నార్ధకం కాబోయే రోజువచ్చింది. ఆడపిల్ల వద్దు, మగపిల్లాడు ముద్దు అంట నేటి నాగరిక కుటుంబ గణితంలో పిల్లలకు ఎప్పుడో సంకేతాలను స్థిరపరిచారు. భారతదేశ సామాజిక వ్యవస్థలోని అవలక్షణాలు ఎందరో స్త్రీలను బలితీసుకుంటున్నాయి. స్త్రీజన్మే శాపమై పసికందులుగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారెందరో. ‘’అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది’’ అన్నమాటని పక్కనపెట్టి అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు అని పుట్టుకకు ముందే హత్యకు గురౌతున్న ఆడశిశువుల సంఖ్య ఇటీవలకాలంలో బాగా పెరిగింది. ఆధునిక ఆలంబన చేసుకోవటం దురదృష్టకరం. గర్భస్తశిశువు ఆరోగ్యపరీక్షకు కొన్ని పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా పుట్టబోయేది ఆడ, మగ అన్నది తెలుసుకొనే వీలుండటం ఆడపిల్ల వద్దనుకొనేవారికి సాధారణంగా పుట్టబోయే ఆడబిడ్డపాలిట మరణాయుధంగా పరిణమిస్తున్నది. స్త్రీ అంతస్తుని పెంచేందుకు చట్టాలు చేస్తున్నా స్త్రీ శిశు హత్యలను అరికట్టడంలో విఫలం కావడం బాధాకరం. ఈ ఘోరాన్ని అరికట్టేందుకు భారతప్రభుత్వం గర్భస్త పిండపరీక్ష ప్రక్రియ నియంత్రణ దురుపయెగ నివారణచట్టం 1994 తెచ్చింది. ఇది 1996 జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది. కానీ ఈ చట్టం అమలులో విఫలమైంది. చట్టం ప్రకారం గర్భిణీస్త్రీ వయస్సు 35 సం||లు మించి ఉన్నపుడు, రెండు లేదా అంతకుమించి గర్భస్రావం జరిగినపుడు ఆమె కుటుంబంలో ఎవరైనా మానసిక వికలాంగులు, జన్యుసంబంధమైన వ్యాధులు కలవారు ఉన్నపుడు గర్భస్తపిండ పరీక్షలు చట్టసమ్మతం. ఒకవేళ పరీక్షలు నిర్వహించినప్పటికి నిర్ధేశిత ఆమోదపత్రం మీద గర్భిణీస్త్రీనుంచి లిఖితపూర్వకంగా ఆమోదం పొందాలి. ఆ పత్రం నకలు ఆమెకు ఇవ్వాలి. పరీక్షల ద్వారా పుట్టబోయేది బాలికా, బాలుడా అనేది ఆ స్త్రీకి గాని ఆమె కుటుంబంలో సభ్యులకు గాని ఏ విధంగాను తెలియజేయకూడదు. ఆరోగ్యవిషయమై జననపూర్వ పరీక్షలు జరపాలి. లింగనిర్ధారణ పరీక్షల గురించి ఏ విధంగానైనసరే ప్రచారం చేయటం నిషిద్ధం. ఈ నియమాలను ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం శిక్ష తప్పదు. మొదటి తప్పుకు మూడు సంవత్సరాల జైలుశిక్ష 10 వేల రూపాయల జరిమానా విధిస్తారు. తిరిగి తప్పుచేస్తే 5 సం||ల జైలుశిక్ష 50 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారికి, చేయించుకొనేవారికే కాక పరీక్షలు చేయించుకోమని ప్రోత్సహించిన కుటుంబసభ్యులకు కూడా జైలు మరియు జరిమానా తప్పదు. చట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించు వైద్యులపేర్లను రాష్ట్రవైద్యమండలి జాబితానుండి రెండు సంవత్సరములపాటు తొలగిస్తారు. తిరిగి తప్పుచేస్తే శాశ్వతంగా తొలగిస్తారు. ఈ నేరాలు బెయిల్‌ లేని నేరాలు. అయినా ప్రస్తుతం ఇప్పటివరకూ ఎంతోమంది స్త్రీల జన్మే శాపమై పసికందులుగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. స్త్రీ శిశుహత్యలు విచ్చలవిడిగా జరుగుతున్నా ఎవర పట్టిచ్చుకోవడంలేదు. నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉంటున్నారు. అయినా ఇప్పటివరకూ ఎన్ని కేసులు అయినవో ఎంతమందికి శిక్ష విధించారో ‘’ప్రశ్నార్ధకం’’. చట్టంచేస్తే చాలా? చాలదు ఈ విషయంలో ప్రజలలో చైతన్యం తేవడం అతిముఖ్యం. అది ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. మానవ హక్కులను గౌరవించే ప్రసారసాధనాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ప్రతి ఒక్కరి బాధ్యత. వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా తనవంతు కర్తవ్యంగా ప్రభుత్వ పాత్ర పెరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలి. పిండం స్త్రీగా లేదా పురుషునిగా వృద్ధిచెందడానికి పూర్తిగా తండ్రిలోని జన్యువులే కారణమని ఇందులో తల్లి ప్రమేయం ఏమీ ఉండదని ప్రజలకు తెలియజేయలి. ఇప్పటికీ కొన్ని గ్రామలలో, పట్టణాలలో స్త్రీని ఆడపిల్లకు జన్మనిచ్చావని ఇంట్లో అత్తమామలు మరియు భర్త ఆమెను హింసించటం మరియు అప్పుడే పుట్టిన అభంశుభం తెలియని ఆ పసికందును కూడా చంపేస్తున్నారు. కొంతమంది అయితే పిల్లలు పుట్టటంలేదని పూర్తితప్పంతా స్త్రీపైనే వేసి భార్య ఉండగా మరోపెళ్ళి చేసుకున్నవారు మరెందరో ఉన్నారు. ఆడపిల్ల పుడితే ఆనందించేవారు లేకపోవడానికి ఈ సమాజం అనేక కారణాలను చపుతుంది. ఆడబిడ్డని పెంచటం ఒక ఎత్తయితే విద్యాబుద్ధులు చెప్పించటం మరో ఎత్తు. కట్నకానుకలు ఇచ్చి పెళ్ళిచేయడం ఇంక మరో సమస్య. కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి అయినా ఆడబిడ్డ అత్తవారింటికి పోతుందని అదే మగబిడ్డ అయితే వంశంపేరు నిలబెడతాడని, ఆస్తికి వారసుడు అవుతాడని వృద్ధాప్యంలో పోషిస్తాడని చనిపోతే దహనసంస్కారాలు జరుపుతాడని నమ్మకం ప్రజలలో నెలకొని ఉంది. ఈ నీచమైన ఆలోచనలతో కొంతమంది కడుపులో ఆడబిడ్డ ఉండగానే కొరివిపెడుతున్నారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీ దౌర్భాగ్యస్థితికి వీళ్ళ ధోరణి అద్దంపడుతుంది. మహిళాదినోత్సవాలు ఏటేటా జరుపుకుంటున్నా, రాజకీయరంగంలో సైతం స్త్రీలు రాణిస్తున్నా ఇంకా వనితలపట్ల నిర్లక్ష్యం వరలేదు. భారతదేశంలో 1961 నుండి బాలబాలికల నిష్పత్తి పట్టిక క్ర.సం. సం|| బాలురు బాలికలు బాలబాలికల నిష్పత్తి 1. 1961 1000 976 1000 : 976 2. 1971 1000 964 1000 : 964 3. 1981 1000 962 1000 : 962 4. 1991 1000 945 1000 : 945 5. 2001 1000 927 1000 : 927 పై పట్టిక ఆధారంగా చస్తే 1961వ సం||లో 1000 మంది పురుషులకుగాను 976 మంది స్త్రీలు ఉండేవారు. అదికాస్తా 2001 సం|| వచ్చేసరికి వ్యత్యాసం మరీ పెరుగుత 1000 మంది పురుషులకుగాను 927 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అన్ని రంగాలలో స్త్రీలు ఎదుగుతున్నా కానీ స్త్రీలపట్ల ఆడ శిశు హత్యలు పెరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు. 2003 సం||లో రాష్ట్రాలవారీగా స్త్రీపురుషుల నిష్పత్తి పట్టిక క్ర.సం. రాష్ట్రం పేరు బాలురు బాలికలు బాలబాలికల నిష్పత్తి 1. పంజాబ్‌ 1000 776 1000 : 776 2. హిమాచల్‌ప్రదేశ్‌ 1000 803 1000 : 803 3. హర్యానా 1000 807 1000 : 807 4. ఉత్తరప్రదేశ్‌ 1000 853 1000 : 853 5. రాజస్తాన్‌ 1000 855 1000 : 855 6. బీహార్‌ 1000 861 1000 : 861 7. గుజరాత్‌ 1000 862 1000 : 862 8. తమిళనాడు 1000 953 1000 : 953 9. కర్నాటక 1000 943 1000 : 943 పై పట్టికలో 2003 సంవత్సరంలో చస్తే తమిళనాడులో ప్రతి 1000 మంది పురుషులకు 953 మంది స్త్రీలు ఉండగా అదే పంజాబ్‌ రాష్ట్రంలో గమనించినట్లయితే 1000 మంది పురుషులకు 776 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. అంటే తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల మధ్య స్త్రీ పురుషుల వ్యత్యాస నిష్పత్తి ఎంతో కనబడుతుంది. ఈ విధంగా కొన్ని రాష్ట్రాలమధ్య వ్యత్యాసం ఎక్కువగాను, కొన్ని రాష్ట్రాలలో తక్కువగాను కనబడుతుంది. కేరళ రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాలలోన స్త్రీ పురుషుల నిష్పత్తిలో ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. దక్షిణ భారతదేశంలో శిశుమరణాల రేటును పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉంది. ఇది 0-6 ఏళ్ళ మధ్యవయస్సున్న పిల్లలలో….. బాలబాలికల నిష్పత్తి 1000 : 961గా నమోదయింది. అంటే బాలురు 1000 మంది ఉంటే బాలికలు తక్కువగా 961 మాత్రమే ఉన్నారు. మన రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌ గర్భస్త ఆడశిశువుల హత్యలకు కేంద్రంగా మారింది. రాష్ట్రంలో జిల్లాలతో పోల్చితే హైద్రాబాద్‌లో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది. అది 1000 : 943 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు. దీన్నిబట్టి సామాజిక దౌష్ట్యానికి స్త్రీలు ఎలా బలవుతున్నారో అర్ధమవుతుంది. గర్భస్త పిండంగా ఆమెకు చట్టం రక్షణ కల్పిస్తుంది. అది సరిగా అమలు కావడం ప్రజల సహకారం మీదనే ఆధారపడి ఉంటుంది. నేరస్థుల్ని చట్టానికి పట్టివ్వడం పౌరధర్మం. బాధ్యతగల పౌరులుగా వ్యవహరించి ప్రభుత్వ అధికారులకు సహకరిస్తే వాటిని అరికట్టవచ్చు. అలాగే బాల్యవివాహాలు, వరకట్నాలు, అత్యాచారాలు మరియు ఇతర పరిస్థితులకు బలౌతున్న వారెందరో మహిళలు ఉన్నారు. కొన్ని చట్టాలు పేపర్‌కే పరిమితం కావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల మహిళల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు 18 సంవత్సరములు నిండకుండానే తల్లులు అవుతున్నారు. మన సమాజంలో గర్భస్త శిశువు ఆడ అని తెలియగానే గర్భస్రావానికి పాల్పడి ప్రాణాలు పోగొట్టుకొనే మహిళలు ఎందరో ఉన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నాటువైద్యులవద్ద గర్భస్రావాలు చేయించుకోవడం ఎంత ప్రమాదమో ప్రజలకు తెలియచెప్పాలి. గ్రామ సభల ద్వారా పంచాయితీలు గర్భస్థపిండ లింగ పరీక్షలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేయలి. డ్వాక్రా తదితర మహిళా స్వయం సహాయక బృందాలు మహిళా మండలాలు ఈ విషయంలో సాటి మహిళలను జాగృతం చేయలి. బాల్యవివాహాల నిషేధిత చట్టం ప్రజల మద్దతును కూడగట్టుకోవలేకపోవడం వలనే బాల్యవివాహాలు ఇప్పటికీ ఎన్నో జరుగుతున్నాయి. ఆడపిల్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రుల మాటలకు లొంగి చదువుకు దూరమై బాల్యవివాహాల గుండంలో బలయిన ఆడబిడ్డలు ఎందరో ఉన్నారు. దీనిని ప్రజల సహకారంతోనే రూపుమాపగలం. ఈ ఆధునికయుగంలో ఈ హేయమైన పద్ధతికి స్వస్తిపలకాలి. సమాజంలో స్త్రీల సంఖ్య తగ్గిపోవటం వల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇది ఎంతైనా ఆందోళనకరమైన అంశం. దీనికితోడు ఆడ పసిపిల్లలను అమ్ముకొనే మరియు ఇతర ప్రాంతాలకు అమ్మాయిలను తరలించే దురాచారం దేశానికి తీరని కళంకాన్ని తెచ్చిపెడుతుంది అనుటలో సందేహం లేదు. స్త్రీ పురుష సమానత్వాన్ని పాటించి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి. అప్పుడే ఆడశిశువు భ్రూణహత్యలను పూర్తిగా నిర్మలించవచ్చు. లింగ నిర్ధారణ పరీక్ష విషయంలో చరిత్రను పునరావృతం కానివ్వరాదు. ‘’భువిని దివిగా మార్చగల శక్తియే మహిళ. ఈ మహిళను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిది.’’

ఉపయుక్త గ్రంథాలు : వార్త దినపత్రికలు, యోజన మరియు తదితర బుక్స్‌

Read Full Post »

(వెన్నంపల్లి విజయ్‌ కుమార్‌, తాళ్ళపల్లి సంజీవ్‌)

‘’యంత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: అని మనుస్మృతిలో ‘’ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు సంతోషిస్తారు’’ అని, స్త్రీలేని ‘’పురుషుడు అసంపూర్ణుడు’’ అని మరోచోట స్త్రీని గురించి గౌరవంగా ప్రస్తావించడం జరిగింది. ఇది అక్షరాల సత్యమైనదిగా మనకు నిరూపితమవుతుంది. క్రీ.పూ. 6000 సంవత్సరాలకు పూర్వం నుండి అనగా సింధూనాగరికత కాలం నుండి భారతీయులు స్త్రీలను గౌరవిస్తూ, స్త్రీని దేవతగా (అమ్మతల్లి) పూజించేవారు. అలాగే నేడు 1947, ఆగష్టు 15 అనంతర మేర్పడిన స్వతంత్ర భారతదేశాన్ని కూడా ‘’భారతమాత’’ గా కొనియాడుత, గౌరవిస్తూ, పూజిస్తూ ఉండటం మన దేశంలో స్త్రీకి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. ‘’విద్యా సమస్తాస్తవన దేవి భేదాః స్త్రీయః నమస్తాః సకల జగత్సు’’ అనే దేవీ భాగవతంలోని శ్లోకంలో స్త్రీని మాతృమూర్తిగానే గాక, జగన్మాతృమూర్తిగా వర్ణించారు. అంతర్లీనంగా ఉన్న ఈ జన్మాతృదర్శనాన్ని భారతీయులంతా పూజించేలా చేశారు. అంతేగాక ఇప్పటికి కూడా భారతదేశంలో స్త్రీని గృహలక్ష్ష్మిగా, మాతృమూర్తిగా, హితైషిగా, దైవస్వరూపిణిగా వర్ణించి, ‘శ్రీ’ అంటూ స్త్రీని మంగళదేవతగా ప్రతి నామవాచకానికి ముందు, ప్రతి శుభకార్యానికి చేర్చి అవగాహన చేసే అత్యున్నత సాంప్రదాయం మనది అని అనేక మంది మహర్షులు మరియు ప్రాచీనులు, ఆధునికులు కూడా దీనిని నొక్కి చెప్పడం జరుగుతుంది. పురాణాల ఇతిహాసాలలోని స్త్రీని గురించి వేరుగా చెప్పనక్కరలేదు. స్త్రీ మన సంస్కృతికి, ధర్మానికి మూలవిరాట్టు. అందువల్లే ఇక్కడ సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి, ఊర్మిళ, పార్వతి, లక్ష్మీ, సత్యభామ మొదలగు ఆదర్శమూర్తుల గురించి ఎన్నో రకాలయిన గాధలు మనకు, ప్రేమ, త్యాగం, కరుణ, ఆత్మార్పణ, సంయమనం, మమత అనురాగాలను అందజేస్తున్నాయి. హైందవ సంస్కృతి చిహ్నాలపై ఉద్భవించిన బౌద్ధమతం. దీని స్థాపకుడు అయిన ‘’బుద్ధుడు’’ సయితం తన సవతితల్లి అయిన ‘’ప్రజాపతి గౌతమి’’ పేరున ‘’గౌతమ బుద్ధుడు’’ అనే పేరుతో ఖ్యాతి గాంచాడు. తద్వారా అనాదికాలం నుండి ఎంతో గౌరవించబడిన స్త్రీ భారతదేశంలో మధ్యయుగ కాలం నాటికల్లా ఆవిద్య, అజ్ఞాన పరిస్థితుల ప్రాబల్యం వలన, మతచాందస విధానాల వలన, పురుషాధిక్య సమాజం వలన స్త్రీని పరదాపద్ధతిలో, వంటింటికి పరిమితమయి పిల్లల్ని కనిపెట్టే ఒక యంత్రంగా మాత్రమే భావించడం జరుగుతుంది. ఆకాశంలో సగం, అవనిలో సగం అనుకుంటున్న స్త్రీలు ప్రస్తుతం భారతదేశంలో 49 కోట్లకుపైగా ఉన్నారు. కాని, స్త్రీల ప్రాతినిధ్యం, హక్కులు నేడు ప్రశ్నార్ధకంగా ఉన్నాయి. ఎందుకంటే 102 కోట్ల జనాభాలో స్త్రీలు సగభాగమయినా వారికి ఉద్యోగాల్లో కాని, విద్యావకాశాల్లో గాని, చట్ట సభల్లో గాని, ఇంతవరకు 50% రిజర్వేషన్‌ కల్పించాల్సింది. కాని కనీసం 33% రిజర్వేషన్‌ బిల్లు కూడా ఇంతవరకు ఆమోదింపబడటం లేదు. కారణం వారిలోని సహనం మరియు నిస్సాయత, పురుషాధిక్యత ప్రభావం వలన ముందుకు వెళ్ళలేక పోతున్నారు. దీనిని అధిగమించిన రోజు మాత్రమే గాంధీజి కలలుగన్న స్వాతంత్య్రం మనకు లభిస్తుంది. 19 – 20 శతాబ్ధాల మధ్య సంఘసంస్కరణోద్యమాలు నూతన జాతి నిర్మాణంలో స్త్రీలకు తగిన పాత్రను కల్పించే సదాశయంతో మొట్టమొదటిసారిగా ‘’మహాత్మాజ్యోతిరావు ఫూలే’’ స్త్రీ విద్యను ఒక ఉద్యమ స్పూర్తితో ప్రారంభించి విజయవంతం కావడం జరిగింది. తద్వారా అనేకమంది సంఘసంస్కర్తలు రాజారామ్మోహన రాయ్‌, కందుకూరి వీరేశలింగం, టంగుటరి ప్రకాశం, దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌, దాదాబాయి నౌరోజి వంటి త్యాగధనులు, సంఘసంస్కర్తలు భారతదేశంలో స్త్రీల అభ్యున్నతికి అనేక రకాలయిన ఉద్యమస్పర్తి సంస్కరణలను చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేయడం జరిగింది. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో స్త్రీల విద్యాభ్యాసం కోసం ఆధునిక కాలంలో మొట్టమొదటిసారిగా పాశ్చాత్య విద్యా విధానానికి అనుగుణంగా, క్రైస్తవ మత వ్యాప్తి ఉద్దేశ్యంతో క్రిష్టియన్‌ మిషనరీలు స్త్రీ విద్యకు ఎంతోకృషి చేయడం వలన భారత స్వాతంత్య్రోద్యమంలో స్త్రీలు కూడా పాల్గొనడానికి దోహదపడిందిగా చెప్పుకోవచ్చు. బ్రహ్మసమాజం భారతదేశ చరిత్రలో 18వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా స్త్రీల సమస్యలను పరిష్కరించే దృష్టితో ప్రారంభించబడిన ప్రధానమైన సంస్థగా ‘బ్రహ్మసమాజం’ను చెప్పుకోవచ్చు. దీని స్థాపకుడు రాజారామ్మోహన్‌ రాయ్‌. ఈయనను ‘ఆధునిక భారతదేశ సంఘసంస్కరణ పితా మహుడుగా’ కొనియడబడుతున్నారు. కారణం ఈయన సమాజంలో స్త్రీల యొక్క సమస్యలయిన బాల్యవివాహాలను రద్దుచేయడం, వితంతు పునర్వివాహాలను చేపట్టడం, సతీసహగమనాన్ని నిషేధించడం మొదలగు సాహసోపేతమయిన సమస్యలను పరిష్కరించడమే కాక భారతదేశంలో ఇంగ్లీష్‌ విద్యకావాలని వాదించి దాని అభివృద్ధికి కూడా రాయ్‌ ఎంతో కృషి చేశారు. కందుకూరి వీరేశలింగం ‘దక్షిణ భారత విద్యాసాగరుడుగా కీర్తింపబడిన ‘కందుకూరి వీరేశలింగం’ తన యవత్‌ జీవితాన్ని సంఘసంస్కరణకోసం, మహిళాభ్యుదయం కోసం కృషిచేసారు. స్త్రీ విద్యావిధానం అమలుకు, కన్యాశుల్కం నిర్ములనకు, బాల్యవివాహాల నిర్ములనకు, వితంతు పునర్‌ వివాహానికి వీరేశలింగం గారు అవిరళంగా కృషి చేయడం జరిగింది. వీరేశలింగం గారు రాజమండ్రిలో వితంతు శరణాలయన్ని, 1880లో ‘భీమవరం’ లో బాలికల పాఠశాలలను స్థాపించారు. ఇలాంటి గొప్ప గొప్ప త్యాగదనుల కృషి ఫలితంగా ఆధునిక భారతదేశంలో స్త్రీల పాత్ర ఎంతో గణనీయంగా అభివృద్ధి చెందిందని మనకు ఋజువవుతుంది. తద్వారా భారతదేశంలో స్త్రీల అభ్యున్నతి ఎంతో మెరుగుపడి వారు కూడా సవజంలో నేడు గుర్తింపును సాధించే స్థితికి చేరువయ్యరు. కావున మనం స్వతంత్ర భారతదేశంలో కొందరు సాహస నారీమణుల పాత్రల గురించి మననం చేసుకుందాం. సరోజినీనాయుడు 1879వ సంవత్సరంలో హైదరాబాద్‌ నందు బెంగాలి దంపతులకు జన్మించిన సరోజినీనాయుడు గారు స్వాతంత్య్రోద్యమంలో ఎంతో క్రియశీల పాత్ర వహించి స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్‌గా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్నిక కావడం స్త్రీజాతికే ఎంతో గర్వకారణం. నాయుడుగారు తన పాత్రను ఎంతో సమర్ధనీయంగా నిర్వహించి స్వాతంత్రోద్యమంలో గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రమయిన శిష్యురాలిగా కూడా తన పాత్రను ఇనుమడింపచేయడం ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ‘గానకోకిల’గా ఆమెను గాంధీజీ అభివర్ణించడం కూడా జరిగింది. సరోజినినాయుడు 1949 వరకు తన జీవిత కాలాన్నంతా దేశసేవకు అంకితం చేసి చిరస్థాయిగా మనలో స్థానం సంపాదించారు. ఇందిరాగాంధీ ‘స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా’ శ్రీమతి ఇందిరాగాంధీ సుపరిచితురాలు. ఈమె నిర్ణయలు తీసుకోవడంలో గాని, అమలుచేయడంలో గాని ఆమెను మించిన సమర్ధ నాయకత్వం ఇంతవరకు భారతదేశ రాజకీయలలో కనిపించదు. ఉదా : 1984లో ఈమె ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా దేశసంక్షేమం కోసం ‘తప్పనిసరి కుటుంబనియంత్రణ’ కార్యక్రమాన్ని అమలుచేసిన కారణంగా తదుపరి ఎన్నికల్లో ఘోర పరాజయన్ని చవిచసిన ప్రధానిగా కూడా చరిత్రలో నిలచిపోయరు. సుచేత కృపాలాని : మొదటి మహిళా ముఖ్యమంత్రి స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేత కృపాలాని ఉత్తరప్రదేశ్‌కు ఎన్నిక కావడం, మహిళా ప్రాతినిధ్యంలో ఇది ఒక ముందడుగు. ఎందుకంటే ఈమె పెద్ద రాజకీయ వారసత్వం లేకుండా తన సామర్ధ్యంతో భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మహిళా జగతికి ఒక గర్వకారణం. వి.ఎస్‌. రమాదేవి : మొదటి మహిళా సెక్రటరి జనరల్‌ రాజ్యసభ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వి.యస్‌. రమాదేవి మొదటి మహిళా ఎలక్షన్‌ కమీషనర్‌గా, కర్ణాటక గవర్నర్‌గా, ఐక్యరాజ్యసమితిలో కూడా తన సామర్ధ్యాన్ని ప్రపంచదేశాలలో భారతదేశ స్త్రీల గౌరవాన్ని మహోన్నత స్థితికి చేర్చుటలో ఎంతో కృషిచేయడమే గాక రాజ్యసభ మొదటి మహిళా సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేశారు. మాయవతి : మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి స్వాతంత్య్ర భారతదేశంలో మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్‌కు ఎన్నిక కావడం స్త్రీజాతికి ఒక గర్వకారణం. సామాన్య మధ్యతరగతికి చెందిన ఒక ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించి నేడు రెండవసారి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికై దేశరాజకీయలలో మహిళల ప్రాతినిధ్యాన్ని చాటుతుంది. కిరణ్‌బేడి : మొదటి మహిళా ఐ.పి.యస్‌. పితృస్వామ్య భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఒక జిల్లా పోలీసు నిర్వహణ అధికారి (ఐ.పి.యస్‌.) ఇండియన్‌ పోలీస్‌ సర్వీసును ఇష్టపడి స్వీకరించి మహిళాజాతికే ఎంతో పేరు ప్రతిష్టలను తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి సెక్రటరి జనరల్‌కు ప్రత్యేక భద్రత అధికారిగా కూడా తన పాత్రను నిర్వహించారు. కల్పనాచావ్లా : అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతసంతతి మహిళ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో అంతరిక్ష ప్రయణం అనేది ఎంతో సాహసోపేతమైంది. అలాంటి సాహసాన్ని మనదేశ మహిళలయిన కల్పనాచావ్లా, సునీత విలియమ్స్‌ సాధించారు. ప్రతిభాపాటిల్‌ : 60 వసంతాల స్వతంత్ర భారత మొదటి మహిళా రాష్ట్రపతి భారతదేశ 13వ రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్‌ 2007, జూలై 5 ప్రమాణస్వీకారం చేసారు. ఈమె 1934, డిశెంబరు 19న మహారాష్ట్రలోని నాద్‌గావ్‌ గ్రామంలో జన్మించారు. 2004, నవంబర్‌ 8న రాజస్థాన్‌ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా కూడా నియమింపబడ్డారు. ఇది భారతదేశ మహిళా ప్రాతినిధ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా పిలువబడుతుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో మహిళా ముందడుగుకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. దేశ అత్యున్నత పదవయిన రాష్ట్రపతి పదవిని చేపట్టడం మహిళా ముందడుగుకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. పై ఉదాహరణలు తీసుకుంటే దేశంలో మహిళా అభ్యున్నతి ఎంతో అత్యున్నత దశలో ఉన్నదని తోస్తుంది. కాని ఇది కొన్ని అభివృద్ధి చెందిన కుటుంబాలకు మరియు అత్యున్నత మేధావులకు మాత్రమే సాధ్యమవుతుందని క్రింది విషయలను బట్టి మనకు అర్ధమవుతుంది. పైన పేర్కొన్న విషయలే కాకుండా ఇటీవల స్త్రీల పట్ల జరుగుతున్న అమానుషాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే మహిళలకు అనేక విషయలలో ఆత్మవంచన, హింస మొదలగునవి కనిపిస్తున్నాయి. ఇటీవలి వార్తాపత్రికల్లోని కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది. గొప్ప గొప్ప వ్యక్తులు సైతం అదనపు కట్నం కోసం తమ భార్యలను హింసిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా అనేక విషయలలో వారికి సరిఅయిన న్యాయస్థానం లేక వారు తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారు. ఉదా : ముఖ్య ఉదాహరణ ‘గృహహింస చట్టం’. ఇది సరిఅయిన న్యాయస్థానం లేనందున అనేక విషయలలో వెనుకబడి ఉన్నదిగా మనకు ఋజువగు చున్నది. వీటి నుండి మహిళా జాతి విముక్తిని పొందాలంటే భారతరాజ్యాంగం ద్వారా మహిళలకు కల్పించిన సమాన హొదాను, ప్రాథమిక హక్కులను అందుకునే విధంగా అవకాశాలను కల్పించాలి. తద్వారా స్త్రీల అభ్యున్నతికి వారికి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం చేకూర్చడానికి సరిఅయిన చట్టాలను తేవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. 1. భారత రాజ్యాంగంలోని 14, 15 అధికరణలు స్త్రీలకు పురుషులతో సంపూర్ణ సవనత్వాన్ని ప్రసాదించాయి. కాని వీటిని అమలు చేయల్సిన బాధ్యత సంక్షేమ రాజ్యానిదే. 2. 1956 హింద వారసత్వ చట్టం – హింద కుటుంబంలో కుమారునితోపాటు కుమార్తెను సమాన వారసురాలుగా గుర్తించింది. కాని దీన్ని ప్రజలందరికి తెలియ చేయడంలో, విద్యావంతులు, ప్రభుత్వం ఎంతో కృషిచేయవల్సిన బాధ్యత ఉంది. 3. ‘1961లో వరకట్న నిషేధ చట్టం’ చేయబడింది. ఇది అమలులో వెనుక బడటానికి ప్రధాన కారణం ‘’స్త్రీకి కుటుంబం లో సమాన వారసత్వ హక్కు అమలుకాక పోవడం వలననే’’. గృహహింసాచట్టం : అక్టోబరు 25, 2006 నుండి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలులోకి వచ్చింది. ఇది మహిళా అణచివేతను నిరోధించే ఆయుధం. కాని దీనికి ప్రత్యేక న్యాయస్థానం, ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే విజయవంతం అవుతుంది. లేకపోతే ఇది కూడా వరకట్న నిషేధంలాగే ఉండిపోతుంది. పై విషయ లను గమనించినపుడు మనకు ఎంతో కొంత స్త్రీల ఘనచరిత్ర కనబడుతుంది కాని అంతటా స్త్రీలయొక్కపాత్ర అంత ఘననీయంగా అభివృద్ధి చెందుటలేదు. ఎందుకంటే స్త్రీలు బాల్యంలో తండ్రిపై, యవ్వనంలో భర్తపై, వృద్ధాప్యంలో కుమారులపై ఆధారపడి జీవిస్తున్నారు. దీనినుండి స్త్రీలు బయటపడిన రోజే స్త్రీజాతి విముక్తిని సాధిస్తుంది. స్త్రీలు అన్ని రంగాల యందు అభివృద్ధిని సాధించిననాడే దేశం అభివృద్ధిని సాధిస్తుంది లేని యెడల ఆ దేశం వెనుకబడిపోతుంది. ఎందుకంటే ‘ఇంటికి దీపం ఇల్లాలు’ ఎలాగో, ‘దేశానికి వెలుగు స్త్రీజాతి’ అని గ్రహించవలసిన అవసరం ఎంతో ఉంది.

Read Full Post »

(పరశురామ్‌రాయ్‌)

‘’340 మిలియన్లను మించి భారతీయులు రాత్రి నిద్రపోయేది ఆహారం లేకుండానే. 10,000 భారతీయులు ప్రతిదినం ఆకలితో మరణిస్తున్నారు – 40 లక్షలు ప్రతి సంవత్సరం – మరో విధంగా చెప్పాలంటే ప్రతి 18 నెలలకీ ‘కనిపించని హంతకి’ని మనదేశ  సహవాసులపైకి మనమే ఉసిగొల్పుతున్నాం.’’ పేదల్ని దుంప నాశనం చేసే కుట్ర దాదాపు 24,000 మంది ప్రతిరోజూ ఆకలితో మరణిస్తారనీ, వాళ్ళలో 78% మంది స్త్రీలు, పిల్లలనీ తెలుసా మీకు? ప్రపంచంలో ఆకలి బాధితులు 1.4 బిలియన్లు. ప్రతీ సంవత్సరం ఆకలితో మరణించేవారి సంఖ్య 13 మిలియన్లు. ప్రపంచంలో ఆహారధాన్యాల కొరత వల్ల కాదీ మరణాలు. నిర్లక్ష్యం, అజ్ఞానం – వ్యాపారలాభాలే లక్ష్యంగా సాగే మానవ దౌర్బ్బ్యం – ఇవీ కారణాలు. హిట్లర్‌ మానసిక రుగ్మతకు బలైనవారు ఆరు మిలియన్లే కాగా ‘’ఆకలి నిశ్శబ్ద ఆక్రమణ’’కు బలైనవారు పదమూడు మిలియన్లు. అదీ ప్రతి ఏడాదీ సంఖ్య – దాదాపు నాజీల కొలబద్దకు రెండురెట్లు. తేడా మాత్రం ఒక్కటే వీళ్ళ మరణం వాయువు నింపిన గదుల్లోలా కాదు. ఆకలి మృతులు నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా ఏడ్పుల రాద్ధాంతాల లేకుండా ప్రజాస్వామ్యం పెరటిలో నిష్క్రమిస్తారు. గాంధీగారి ప్రవచనాల్ని విశ్వసిస్తే – దారిద్య్రం అనేది అతినీచమైన హింస – ఈ హింసకు ఇప్పటికీ 1.4 బిలియన్ల ప్రజల గురి అవుతున్నారు. కేవలం ఒక్క అమెరికా సంవత్సరానికి 80 బిలియన్ల డాలర్లు ఇరాక్‌పై ఖర్చుపెడుతుంటే, పూర్తి ప్రపంచం దయదాక్షిణ్యాలు – సంపద 13 బిలియన్ల డాలర్లకు సరితగకపోవడం – దానివల్ల ఆకలి మరణాలు లేదా హత్యలు ఆపలేకపోవడం – విషాదకరం. ప్రపంచంలో ఆకలి బాధితుల్లో ప్రతి మూడో వ్యక్తీ భారతీయుడు. భారతీయుల్లో ప్రతి మూడో వ్యక్తి ఆకలితోనే నిద్రిస్తాడు. అధికారిక దారిద్య్రరేఖ పరిగణనలోకి తీసుకుంటే ఆకలి బాధితుల సంఖ్య – దారిద్య్రరేఖ క్రింద వచ్చే జనసంఖ్య కంటే అధికం. 93-94లో గ్రామసీమల్లో 37% మాత్రం దారిద్య్రరేఖ దిగువ లెక్కల్లో చేరితే 80% జనావళి పౌషికాహారలేమి బాధితులు. పౌష్ఠికత, కాలొరీల గ్రహణం, ఆహార విహారాలు మొదలైన వివరాల సాక్ష్యం సంపాదిస్తే భారతదేశంలో నిరంతరం ఆకలి రాజ్యమేలడం సువిదితం. వీటిని మనం ‘ఆకలి చావులు’ అందావ లేదా ‘’బీద భారతీయుల ఆకలి హత్యలు’’ అందావ? ఇంత ఎత్తున ఆకలి, దారిద్య్రం – విపరీత వేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక విధానంలో – డాలర్‌ మిలియనీర్ల సంఖ్యలో – పెద్దగా లెక్కలోకి రాదు. అమానవీయతను చాటే ఈ దారిద్య్రానికి కారణాలేమిటి? 15 సంవత్సరాల నా సుదీర్ఘ పరిశోధన – పరితపన వల్ల తెలిసిందేమిటంటే దారిద్య్రానికి – ఆకలికి సాంప్రదాయిక నిర్వచనం. ఆర్థిక దారిద్య్రానికి – బీద ఆర్థిక వ్యవస్థకూ ఏ రకమైన సంబంధం లేకపోవడం. మేఘనాథ్‌ దేశాయ్‌ వివరణ ప్రకారం – ఆర్థిక దారిద్య్రం, రాజకీయ దారిద్య్రం భారతదేశంలో విడదీయరానంతగా అల్లుకుపోయయి – కాదనగలమా? ప్రతి పౌరుడికీ ఆహారం అందించ డానికి ఎంత అవసరం అనేది లెక్కేస్తే అదేం పెద్దమొత్తం కాదు. నిజానికి ప్రస్తుత ఆర్థికవిధానంలో కూడా ఆహారలోపానికి తావేలేదు, దారిద్య్రనిర్మలనకు కేటా యించిన నిధులు సక్రమంగా అందవలసిన వారికే వినియెగిస్తే. ‘ఆకలి-ఆహార అభద్రత’లపై పోరాటానికి నాలుగు పెద్ద విధానాలు ఆచరణలో ఉన్నాయి. అవి1. ప్రజాపంపిణీ విధానం(Public Distribution System) 2. మధ్యాహ్న భోజన పథకం (Mid-day Meal Scheme) 3. జాతీయ గ్రామీణ ఉద్యోగ నమ్మక పథకం (National Rural Employment Guarantee Scheme) 4. సమీకృత శిశుసంక్షేమ పథకం (Integrated Child Development Scheme) ఈ నాలుగు పథకాల్ని అవినీతి కోరల్నించి పరిరక్షించుకుంటే ఆకలి అనే పదానికి భారతదేశ చరిత్రలో తావే దొరకదు. మిలియన్ల కొద్దీ భారతీయుల్ని పొట్టన పెట్టుకునేది అవినీతి రాచపుండేకాని ఆకలి హంతకి కాదు. దారిద్య్రం అంటురోగం ప్రబలడానికి కారణం భారత బూర్జువా విధానం తప్ప మరో కారణం కానరాదు. ప్రజాపంపిణీ విధానం, జాతీయ గ్రామీణ నమ్మక పథకం. ఈ రెండ ఆకలి – ఆహారకొరతలు తీర్చగలిగే అతిముఖ్యమైన పథకాలు-కాని నిజానికి జరుగుతున్న దేమిటి? మినిస్ట్రీ ఆఫ్‌ కన్సమర్‌ అఫైర్స్‌ – ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యషన్‌ రిపోర్ట్‌ ప్రకారం – ‘’గత మూడు సంవత్సరాల్లో ర.31,585.98 కోట్ల విలువైన ఆహారధాన్యాలు, గోధుమ, బియ్యం – బీదలకని కేటాయించబడినవి ప్రజాపంపిణీి విధానం నుంచి పక్కదారి పట్టాయి. ఒక్క గత సంవత్సరమే ర.11,336.98 కోట్ల విలువైన ఆహారధాన్యాలు – సబ్సిడైజ్‌డ్‌ రేట్లలో అతిబీదవారికి ప్రభుత్వం అందించవలసినవి – న్యాయ వ్యతిరేకంగా ర్కెట్లకు చేరాయి. ప్రతి సంవత్సరం బీద భారతీయులు 53.3% గోధుమ 39% వరి వారికై కేటాయించిన దానిలోంచి కొల్లగొట్టబడి కోల్పోతున్నారు. జాతీయ పంపిణీ విధానంలో పెద్దఎత్తున ప్రక్కదారిపడ్తున్న ధాన్యం వల్ల బీదా బిక్కీ ప్రభుత్వం తమకు ఆహారధాన్యాలు సరఫరా చేస్తుందని నమ్మలేకపోతున్నారు. (టైమ్స్‌ ఆఫ్‌ ఇండియ, సెప్టెంబర్‌ 17, 2007) గత రెండు నెలలుగా రాయగడ్‌, కోరాపుట్‌, కలహండి జిల్లాలలో (ఒరిస్సాలో) ఆదివాసీ బీదలు వందల సంఖ్యలో మరణించారు. కారణం కలుషితమైన నీరు – ఆహారం తీసుకోడం వల్ల – అదీ ఆకలి తీవ్రమైన ఆహారపదార్థాల అభద్రత వల్ల. దీని ఆధారంగా వంద గ్రా ల్లో నా పరిశోధన వల్ల నేను తేల్చుకున్నది – నమ్మేది – ‘’ఒరిస్సాలో వందలాది మంది ఆదివాసీల్ను హతమార్చినది కలరా కాదు – అవినీతి రాచపుండు’’. కలరా ఒక వ్యాధి లక్షణం – ఒక ఫలితం – కాని అసలు కారణం అవినీతనే కాన్సర్‌ – అది ఒరిస్సా అతిముఖ్యమైన అధికార విభాగాల్లో ప్రతి ముఖ్యమైన అవయవానికీ శాఖలుశాఖలుగా విస్తరించి ఆయ విభాగాల్ని కుంటివిగా మార్చింది. బూర్జువా వ్యవస్థ అధిగమించలేని దారిద్య్రం – తీరని ఆకలిని సృష్టించి – ఈ ఆదివాసీల విషాద మరణాలకు కారణమైంది. ప్రజాపంపిణీ విధానం చితికి ముక్కలైంది. సమైక్య శిశుసంక్షేమ పథకం ఒరిస్సాలో నిర్వీర్యమైంది. మిగతా పథకాలు ‘హైజాక్‌’కి గురయ్యాయి – ఒరిస్సా సర్కారు బాబులకవి డబ్బు యంత్రాలుగా మారిపోయయి. చాలామటుకు ఈ ఆదివాసీలు – ఆకలితో వడిపోత, శరీరాన్ని, ఆరోగ్య వ్యవస్థను రోగగ్రస్తం చేసుకుంట, జీవనం సాగిస్తున్నారు. వర్షాకాలం – ఒరిస్సాలో ముఖ్యంగా (కెబికె భాగంలో) తీవ్ర ఆహార కొరత వల్ల – మామిడిటెంకలతో, ఆకులు అలమలతో ఆకలి తీర్చుకుంటారు. ఈ విషాదం ప్రతి సంవత్సరం పునరావృతమవుతనే ఉంటుంది. దీన్ని ఆపేందుకే చరిత్రాత్మక మైన ‘జాతీయ గ్రామీణ ఉద్యోగ నమ్మక పథకం’ ఆరంభమైనది. దురదృష్టవశాత్త ఒరిస్సా సర్కారు బాబులు దీన్ని వాళ్ళ ఆర్థిక ప్రాయెజిత పథకంగా మార్చుకున్నారు. సెంటర్‌ ఫర్‌ ఎన్‌విరాన్‌మెంట్‌ అండ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ సంస్థ ఢిల్లీ ఒక సర్వే 100 గ్రావల్లో నిర్వహించి, 2006-07లో NREGS 733 కోట్ల రూపాయల్ను ఖర్చుచేసినట్టు, అందులో 500 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వాధికారులు దుర్వినియెగపరచినట్టు గమనించింది. ఒరిస్సా ప్రభుత్వం చెప్పినట్టుగా 19 ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ జిల్లాల్లో అవసరం ఉన్న ఏ ఒక్కరికీ – భత్యం ఇచ్చే పని నిరాకరించలేదని, ప్రతి ఇంటికి 57 రోజుల భత్యం ఇచ్చే పని కల్పించామనీ అన్నా అది పూర్తిగా వ్యతిరేకం. చాలామటుకు అవసరం ఉన్న ఇళ్ళకు ఉద్యోగ నిరాకరణే కాకుండా కనీసం ఉద్యోగ కార్డులను కూడా సరఫరా చెయ్యలేదు. ఈ 19 జిల్లాల్లో ఎవరికీ 5 రోజులకు మించి పనిని కల్పించలేదు. 75% ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులు దుర్వినియెగమయ్యయి. ఒరిస్సాలో వేలకొద్దీ గ్రావలు 80-90% నిధులు దుర్వినియెగమవడం నమ్మి తీరవలసిన సత్యం. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులు ఇలా బహిరంగంగా దోచుకోబడటం విచారించవలసిన విషయం పూర్తిగా ఒరిస్సా రాష్ట్ర పాలనే ఒక దోపిడీ వ్యవస్థ అని నమ్మడానికి కారణాలనేకం. ఈ 500 కోట్ల నిధుల దుర్వినియెగానికీ, ఆదివాసీల కలరా మరణాలకూ ఏదైనా సంబంధం ఉందా – పైపైన చస్తే అసంబద్ధంగా అనిపించినా – లోనికి వెళ్ళేకొద్దీ బలపడుతుందా సంబంధం. ఈ 500 కోట్లు దుర్వినియెగ పరచబడకపోతే, పదిలక్షల బీద కుటుంబా లకు 90 రోజుల జీతాలుగా సమకూరి ఉండేవి. ఒక్కొక్క కుటుంబానికి ర.5000 భత్యంగా దొరికి ఉండేది. ఈ అయిదువేలు – ఈ ఆకలి కుటుంబాలకు కనీసం 4-6 నెలలపాటు ఆహారాన్ని అందించగలిగేవి లేదా ఓ ఏడాదిపాటు ఒక్కపూట ఆహారాన్నివ్వ గలిగేవి. ఇది ఆర్థికపరమైన స్కామ్‌ మాత్రమే కాదు. ఒరిస్సా బూర్జువా వ్యవస్థ పదిలక్షల ఆకలి కుటుంబాల ఏడాది ఆహారాన్ని నిర్లజ్జగా దోచుకుంది. ఒరిస్సా ఆదివాసీల హంతకు లెవరు?కలుషితాహారం, నీరు తిని త్రాగ డంవల్ల వ్యాధిగ్రస్తులయరని అనుమానించారు (బిబిసి ఆగస్ట్‌ 27 2007) నవ్‌గాం గ్రామానికి చెందిన చింతామణి నాయక్‌ తండ్రయే కలలు ముక్కలై జీవితమే చితికిపోయింది – అతని భార్య – గర్భవతి – డయేరియతో మరణించింది. ‘’ఆహారలేమి వల్లే నా భార్యను పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను అశక్తుడ్ని’’ చింతామణి దైన్యం ఇది. ఎంతోమంది – ఆహార కొరత – కాలుష్యం – దారిద్రానికి బలి అయేవారిలో చింతామణి ఒకడు. ఓ పక్కన పెరుగుతున్న ఆకలిచావులకి తోడు ఈ ప్రబలుతున్న వ్యాధి – ఒరిస్సా ప్రభుత్వం చేస్తున్నదేమిటి? ప్రస్తుతం ఒరిస్సాలో (కెబికె రీజియన్‌లో) పెరుగుతున్న ఆకలి, దారిద్య్రం – కొరత – అతితీవ్రంగా, అమానుషంగా చెలరేగుతున్నా ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ విజయ వంతంగా ఆచరింపబడుతోందనడం నిధుల్ను సక్రమంగా వినియెగిస్తున్నారనడం హాస్యాస్పదం. ఒరిస్సా గ్రామీణ జీవితాల మీద గ్రామీణ ఉద్యోగపథకం ప్రభావం శూన్యం. ఒరిస్సా కెబికె ప్రాంతంనించి ఆదివాసీలు మిగతా ప్రాంతాలకు వలసపోవడం – దాని తీవ్రత గురించి ప్రస్తావనే లేదు. హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌లో చాలామటుకు సహారా ప్రాంత గ్రామాలు కెబికె గ్రామాలకన్న మంచి అభివృద్ధిని చపిస్తున్నాయి. 100 కెబికె గ్రామాల్లో విస్తరించింది ఆకలి దారిద్య్రం వత్రమే. చాలామంది పిల్లలు ఈ గ్రామాల్లో పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారు. లోపలికి పోయిన బుగ్గలు, గుంటలు పడిన కళ్ళు, పొడుచుకు వచ్చిన పొట్టలు సన్నని రూపాలే దీనికి సాక్ష్యం. కాశీపూర్‌ గ్రామపంచాయతీలో పనసగడ, గొట్టిగుడా, బిలామల్‌ దర్శించాము. 2001లో ఎన్నో ఆకలిచావులు రికార్డయయిక్కడ – ముఖ్యమంత్రి స్వయంగా దర్శించి రిలీఫ్‌ అందించారు. అయినా ఇప్పటికీ చాలా ఇళ్ళలో ఆకలి-పస్తులే దర్శనమిస్తాయి. ఇప్పటికీ వర్షాకాలంలో – వాళ్ళకి మిగిలినది ఐతే మామిడి టెంకలో జీడి లేదా ఉపవాసం. పనసగడ గొట్టిగడా ప్రజలెవరికీ జాబ్‌ కార్డ్స్‌ రాలేదు. బిలామల్‌లో కొందరికి వచ్చినా 2-3 రోజులపని మాత్రమే. ఈ గ్రామంలో ఒక కుటుంబంలో 2001లో నలుగురు ఆకలిచావుకు గురయరు. అయినా వారికి జాబ్‌కార్డ్‌ రాలేదు. గత రెండు వసాలుగా 8 మందికి మించి మరణించారిక్కడ. అవన్నీ ఆకలిచావులే. కాని బూర్జువాలు వీటిని ‘కలరా మర ణాలు’గా చపడం వారికి లాభదాయకం. ఒరిస్సా ప్రభుత్వం ర.733 కోట్లు ఎక్కడ ఖర్చుపెట్టింది? అరవై వసంతాల స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరుపుకొనే దేశం ఆదివాసీలకు కనీసం ఈ ప్రశ్నకు జవాబివ్వాలి. రాయగడ, కాశీపూర్‌ బ్లాక్‌లో ‘కలరా మరణాలు’ అత్యధికంగా రికార్డయయి. 30 గ్రావల్లో పర్యటించి నుక్కున్నది ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులు దోచుకోబడ్డాయని – కోరాపుట్‌లోని లక్ష్మిపూర్‌, నంద్‌పూర్‌లో కలహండిలోని తమల రాంపూర్‌లో ఇదే కథ. ఇక్కడంతా మృత్యువు నగ్నంగా నర్తించిన దానికి నిదర్శనం – మృత్యుగీతికకు – నర్తనకు మూలం ఒరిస్సా అవినీతి బర్జువా వ్యవస్థ. సిఇఆర్‌ఎఫ్‌ సర్వే రిపోర్ట్‌ 17 ఆగస్టు 2007 అన్ని పత్రికల్లో హెడ్‌లైన్స్‌తో ప్రచురించింది. ఒరిస్సా ప్రభుత్వం మాత్రం పెదవి కదపలేదు. బదులుగా 2007 ఆగస్టు 20న చీఫ్‌ మినిస్టర్‌ ఒక పెద్ద మీటింగు ఏర్పరచి ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పనితీరు సర్వేను -ఎన్‌ ఐఆర్‌డి, హైద్రాబాద్‌కి అప్పగించాడు. కంటితుడుపు తీరుకిది నిదర్శనం. ఇంకా షాకింగు ఏమిటంటే ఒరిస్సా ప్రతిపక్షాల – కాంగ్రెస్‌ నిశ్శబ్ద వైఖరి. మిగతా ప్రతిపక్షాలు డివండ్‌ చేసినా ఫలితం శూన్యం. ఇప్పుడా పార్టీ ఆదివాసీ శవాలను లెక్కించడం ఆశ్చర్యకరం. మనం అగ్నియెధు లం – నిప్పురాజు కున్నాకే బావి తవ్వకం ఆరంభిస్తాం. నిధుల దుర్వినియెగం కన్న రాజకీయనిశ్శబ్దమే గొప్ప షాక్‌. రాజకీయ ఉపన్యాసాల్లో ప్రస్తావన కొచ్చేది ముందుగా దళితులు – ఆదివాసీలే, కాని నిజానికి వాళ్ళను దోషుల్ను చేసేది ప్రభుత్వమే. నిధులు ముఖ్యంగా చేరేది అధికారులకు – మిగులో తగులో పొందేది ఆదివాసీలు. ఈ బీదలకు దళితులకు ఆదివాసీలకు ఆకలి నించి విముక్తి ఎప్పుడు? అవినీతినించి విముక్తి లేనిదే ఆకలినించి విముక్తి ఎలా సాధ్యం? బాధ్యతాయుతమైన పౌరులే కలుషితమైన అవినీతి అధికారుల్ను అదలించగలరు. ప్రభుత్వాధికారులు విచారణను ఎదుర్కొని – శిక్షకు భయపడితే తప్ప వాళ్ళలో వర్పురాదు. అవినీతికి తెరపడదు. ఆదివాసీల ఆకలిచావులకు అదుపు ఉండదు. ఈగల్లా మరణించే వీరి మృత్యువుకు ‘ఎదుగుతున్న భారతదేశం’ గుర్తింపూ, విచారం కూడా అందవు.

అనువాదం : శ్రీపాదస్వాతి

Read Full Post »

Older Posts »