Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్ 14th, 2008

మెదక్‌ : తాము అధికారంలోకి వస్తే సామాన్యుడి నెత్తిపై సర్కారు
మోపిన ధరాభారాన్ని తగ్గిస్తామని మంగళవారం టిడిపి అధినేత చంద్రబాబు
హామీ ఇచ్చారు. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలను
నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
అవినీతిని విచ్చలవిడిగా వ్యాపింప చేసిన ప్రభుత్వం ధరలను ఒక పద్దతి ప్రకారం
పెంచి పారేసిందని విమర్శించారు.

మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో ధరల
పెరుగుదలకు నిరసనగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన మహాధర్నాలో పాల్గొన్న
చంద్రబాబు సర్కారు నిర్లిప్తతపై నిప్పులు చెరిగారు. వెంటనే ధరల నియంత్రణకు
అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 2003లో కిలో బియ్యం
ధర రూ.12 కాగా, ప్రస్తుతం అది రూ.25కు చేరుకుందన్నారు. వంటగ్యాస్‌
నుంచి పప్పుధాన్యాల వరకూ ఏవీ సామాన్యుడికి అందుబాటులో లేవన్నారు.

Read Full Post »

ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియాలో తెలంగాణ ఎన్నారైలు వరుసగా రెండో ఏట కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక విల్సన్‌ ఫ్రేమ్‌ పార్కులో నిర్వహించిన ఈ వేడుకల్లో 100 మందికి పైగా ప్రవాస ఎన్నారైలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫిలడెల్ఫియా పరిధిలోని తెలంగాణ వాసులే కాకుండా కోస్తా, రాయలసీమకు చెందిన తెలుగు వారు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.

మహిళలు, చిన్నారులు సంప్రదాయ దస్తులు ధరించి సొంత గడ్డపై సంబరాల్లో పాల్గొన్న అనుభూతిని కలిగించారు. వచ్చిన ఆహూతులను అందరికీ పరిచయం చేస్తూ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే గీతాలను ప్రసారం చేశారు. ఇంకా ఐదు రకాల రైస్‌ డిషెస్‌, వివిధ రకాల సద్దులతో కూడిన విందు భోజనం ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నది.

అనంతరం మహిళలు తమ వెంట తీసుకువచ్చిన 15 బతుకమ్మలకు సంప్రదాయ బద్దంగా మొదట గౌరీ పూజ నిర్వహించారు. ఆ తరువాత బతుక్మల చుట్టూ చేరి “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…” అంటూ మహిళలు ఆడి పాడారు. చాలాసేపు జరిగిన ఈ కార్యక్రమం వీక్షకులను తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళింది. కొలువు పూర్తయిన తరువాత సంప్రదాయ బద్దంగా బతుకమ్మలను స్థానిక సరస్సులో నిమజ్జనం చేశారు.

ముఖ్యంగా మేఘన, వేణు మరియు భాస్కర్‌ బత్తిని కుటుంబం తీసుకువచ్చిన పెద్ద బతుకమ్మ వేడుకలకే హైలైట్‌. ఇంకా శ్రీనివాస్‌ ఉప్పల కుటుంబం, తార మరియు శ్రీనివాస్‌ బొంగోని, కరుణ మరియు రెహ్మాన్‌, రజని మరియు సంపత్‌ బిల్లకంటి, సుమన మరియు శ్రీకాంత్‌ సెగిరెడ్డి, రాధిక మరియు శ్రీనివాస్‌ విధల, జమున మరియు రవీందర్‌ పుస్కర్‌, సౌందర్య మరియు మేరెడ్డి బతుకమ్మలూ భక్తి ప్రపత్తులను చాటాయి.

కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు, వయోధికులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఇంకా పురుషులకు టగ్‌ ఆఫ్‌ వార్‌, మహిళలకు నిర్వహించిన మ్యూజికల్‌ ఛైర్‌ వీక్షకులను అలరించింది. చివరగా కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. రాఘవరెడ్డి గోశాల, పరమేష్‌ బీమ్‌రెడ్డి, శ్రీమతి శైలజ అడ్లూరు తదితర ప్రముఖులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇంకా వెంకారెడ్డి సుంకర, వెంకట్‌ కొటు, రమేష్‌ పర్చ, రవీందర్‌ సుదిని, శ్రీనివాస్‌ ముట్టినేని, రెహమాన్‌, ఇమ్రాన్‌, వెంకట్‌ పెద్దిరెడ్డి, రమకాంత్‌, నాగేశ్వర్‌ రెడ్డి, సంజీవ్‌, భాస్కర్‌ బుర్ర, శ్రీని పబ్బ, రమణి యడ్లపల్లితో పాటు సుధీర్‌ రాజు, సుభాష్‌ కర్ర, వేణు బత్తిని, సంపత్‌ బిల్లకంటి, నిరంజన్‌ అల్లమనేని, శ్రీని విదల, మధవ మొసర్ల, నాగరాజు అక్కలదేవి, రవి మేరెడ్డి తదితరులకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు.

Read Full Post »

హైదరాబాద్‌ : నిర్మాణంలో ఓ సెల్లార్‌లో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. నగర శివారులోని నానక్‌రాంగూడలో ఓ భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. సెల్లార్‌లో పడి ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు.

Read Full Post »

న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు మార్గం సుమగం అవుతోంది. వచ్చేవారంలో పోలవరం ప్రాజెక్టు మొదటి విడత పనులకు అనుమతులు మంజూరు చేస్తామని అటవీశాఖ సహాయ మంత్రి రఘుపతి వెల్లడించారు.

Read Full Post »

న్యూఢిల్లీ : రామసేతుపై కేంద్రం మరోసారి వివాదాస్పద ప్రకటన చేసింది. ఆ స్థలం పుణ్యస్థలం కాదంటూ సుప్రీంకోర్టుకు 100 పేజీల అఫిడవిట్‌ ఈనెల 11న సమర్పించింది. అందులో రామసేతు (ఆడమ్స్‌ బ్రిడ్జి) పవిత్ర స్థలం కాదని పేర్కొంది. రామసేతు హిందూమతంలో భాగం కాదని స్పష్టం చేసింది.

Read Full Post »

నాసిక్‌ : మహారాష్ట్రలోని ధూలే పట్టణంలో ప్రశాంతత నెలకొంది. అక్టోబరు 5న జరిగిన మతకల్లోలాల తరువాత ఈ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. ఈ సంఘటనలో 10 మంది చనిపోగా.. 170 మంది గాయపడ్డారు. మంగళవారం పట్టణంలో కర్ఫ్యూ సడలించిన తరువాత వాణిజ్య సంస్థలు, జిల్లాపరిపాలన, పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అల్లర్లకు పాల్పడినట్లు భావిస్తున్న 400 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Read Full Post »

రియాల్టీ షోల కాన్సెప్ట్‌ పుట్టి, పెరిగింది విదేశాల్లోనే మ్యూజిక్‌ చానెల్‌ ఎంటీవీ కండక్ట్‌ చేసే రియాల్టీ షో ద హిల్స్‌లో చికాగో పాప్‌ స్టార్లు హంగామా సృష్టిస్తామంటున్నారు. వీరు ఏప్రిల్‌లో రీలీజ్‌ చేసిన వాక్‌ దిస్‌ వీక్‌ పాప్‌ ఆల్బమ్‌కు రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. పాప్‌ పాటలంటే పొట్టిగా ఉంటేనే గట్టిగా హృదయాలకు హత్తుకుంటాయని చికాగో పాప్‌ స్టార్లు అంటున్నారు. కురుచ దుస్తుల ఆటగత్తెలతో, పొట్టి మాటల పాప్‌ పాటలతోనే వేగం సాధ్యమవుతుందని, ఆడియెన్స్‌ ఉర్రూతలూగుతారని వీరి ఒపీనియన్‌. ఎంటీవీ ప్రీమియర్‌ షో ది హిల్స్‌లో చాన్స్‌ కొట్టేసిన ఈ పాప్‌ స్టార్ల ఆనందానికి హద్దులేవు. ఈ రియాల్టీ మ్యూజిక్‌ షోలో తమ సత్తా చూపుతామంటున్నారు. రియాల్టీ షోలో పాల్గొనే ఈ పాప్‌ సుందరీ మణులు ఫోటో షూట్‌లో చేసిన హంగామాకు, తప్పకుండా మంచి క్రేజీ వస్తుందని చికాగో స్టార్ల ఎక్స్‌పెక్టేషన్‌.

Read Full Post »

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణా పై టిడిపి, టిఆర్‌యస్‌, లెప్ట్ పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఊసరవెల్లి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఢిల్లీలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ముస్లీం వర్గాలు సమైఖ్య ఆంధ్రాను కోరుకుంటున్న విషయం గమనించాలన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ఒక్కటే అధికారంలో లేనందున తెలంగాణాపై ఏకాభిప్రాయ సాదనకు ప్రయత్నిస్తున్నామని వైయస్ చెప్పారు. గంభీరమైన తెంగాణా సమస్య పరిష్కారానికి షరతులతో కూడిన గడువును నిర్ణయించలేమన్నారు.

Read Full Post »

మాతృభూమికి దూరంగా ఉన్నా పండుగలను మాత్రం మరచిపోకుండా జరుపుకుంటున్నారు బ్రిటన్ లోని ప్రవాసాంధ్రులు. విద్యా, ఉద్యోగాల కోసం పరదేశాలకు తరలివెళ్లినా సంప్రదాయాలే జీవనశైలికి వన్నె తెస్తాయంటున్నారు అక్కడి తెలుగువారు. విజయదశమి ఉత్సవాన్ని లండన్ లో తెలుగు వారు ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. నిత్యం బిజి బిజిగా వుండే ఇక్కడి తెలుగు వారు  విజయదశమి పూజలు  నిర్వహించుకొని ఒకరికొకరు అభినందలను తెలుపుకున్నారు. ఇక్కడి యురోపియన్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ల సభ్యులు  ఈ పండుగను సంయుక్తంగా నిర్వహించుకున్నారు. ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటేనన్న భావన వారిలో కనిపించింది. చిన్నాపెద్దా అందరు ఒక్కచోటికి చేరి  అత్యంత భక్తి శ్రద్దలతో  ఈ కార్యక్రమాలను నిర్వహించుకున్నారు. ఉత్సవాలను  తెలుగు పీపుల్ ఇన్ యుకెతోపాటు యూరప్ లో వుండే ఇతర తెలుగు సంఘాల వారు  కూడా తమ ప్రాంతాల్లో విజయ దశమి సంబరాలు చేసుకున్నారు. ఎక్కడ వున్నా తెలుగు వారు ఒక్కచోటికి చేరడం ఆనందంగా వుందన్నారు. ఈ కార్యక్రమానికి ఈటా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డితోపాటు రాములు, బ్రెంట్ కౌన్సిల్ సభ్యడు మయూర్ లార్డ్ రాల్పాక్స్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత  మాచెర్ల హేమను సన్మానించారు. ఓటివి ఛానల్ నిర్వహించిన రచనలపోటీలకు విశేష స్పందన లభించింది. ఏకంగా 44 వేల రచనలు పోటీకి వచ్చాయి, వాటిలోనుంచి 26 రచనలను నిర్వాహకులు ఎంపిక చేశారు.

Read Full Post »

న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణా పై టిడిపి, టిఆర్‌యస్‌, లెప్ట్ పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఊసరవెల్లి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఢిల్లీలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ముస్లీం వర్గాలు సమైఖ్య ఆంధ్రాను కోరుకుంటున్న విషయం గమనించాలన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ఒక్కటే అధికారంలో లేనందున తెలంగాణాపై ఏకాభిప్రాయ సాదనకు ప్రయత్నిస్తున్నామని వైయస్ చెప్పారు. గంభీరమైన తెంగాణా సమస్య పరిష్కారానికి షరతులతో కూడిన గడువును నిర్ణయించలేమన్నారు.

Read Full Post »

Older Posts »