Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్ 13th, 2008

చెన్నై: శ్రీలంకలోని తమిళుల కోసం కరుణానిధి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావాలని ప్రధాన విపక్ష పార్టీలన్నీ నిశ్చయించాయి. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడిఎంకె, వామపక్ష ద్వయంతో పాటు సంకీర్ణ సర్కారు నుండి బయటికొచ్చిన పిఎంకె కూడా ఈ ఆల్‌ పార్టీ మీటింగ్‌ను బాయ్‌కాట్‌ చేయాలని నిశ్చయించింది. శ్రీలంకలోని తమిళుల గురించి కేంద్రం సీరియస్‌గా పట్టించుకోక పోతే మద్దతు ఉప సంహరిస్తామని కరుణానిధి హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఆల్‌ పార్టీ మీటింగ్‌ ప్రాధాన్యత సంతరించుకున్నది.

శ్రీలంకలో నివశిస్తున్న తమిళులను ఉగ్రవాదుల పేరిట వేధింపులకు గురి చేయడంతో పాటు నకిలీ ఎన్‌కౌంటర్లు జరుగుతూ వుండడం పరిస్థితికి అద్దం పడుతున్నదని కరుణ సర్కారు వాదిస్తోంది. అయితే తమిళులకు ఆపన్న హస్తం పేరిట ప్రభుత్వం ఎల్టీటిఇని ప్రోత్సహిస్తోందని కొన్ని వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో లంకలోని తమిళుల రక్షణకు ఉద్దేశించి, కరుణానిధి రాజకీయ ఒత్తిడి తీసుకు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు అన్నాడిఎంకె, బిజెపి, వామపక్ష పార్టీలు ఏ మాత్రం కలిసి రావడం లేదు.

Read Full Post »

కోల్‌కత్తా : తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని హత్య చేస్తామంటూ గత అర్థరాత్రి బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కాళీఘాట్‌లోని మమత నివాసంలో ఉన్న ల్యాండ్‌లైన్‌ ఫోన్‌కు రెండు వరుస బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు నగర పోలీసు కమిషనర్‌ చక్రవర్తి విలేఖర్లకు తెలిపారు. ప్రస్తుతం ఫోన్‌కాల్స్‌ను ట్రేస్‌ అవుట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, మమతా బెనర్జీకి పటిష్టమైన భద్రత కల్పించామని ఆయన విలేఖర్లకు వివరించారు.

అయితే మమత బెనర్జీకి ఈ మధ్య తరచూ బెదిరింపులు ఎక్కువయ్యాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆగస్టు 7న కూడా ఆమె వ్యక్తిగత మొబైల్‌ ఫోన్‌కు బెదిరింపు మెసేజ్‌లు వచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అత్యంత ప్రైవసీ నెంబర్లు కూడా శత్రువుల చేతికి చిక్కడం ఆందోళనకరంగా ఉన్నదని వారు వాపోతున్నారు. ఈ బెదిరింపు కాల్స్‌ వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్నది వారి వాదన. అయితే మమత మాత్రం బెదిరింపు కాల్స్‌పై స్పందించక పోవడం విశేషం.

Read Full Post »

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ సమీప అడవుల్లో దావానలం విజృంభిస్తోంది. ఏంజెల్స్‌ నేషనల్‌ ఫారెస్ట్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చును అదుపులోకి తీసుకొని రావడానికి హెలీకాప్టర్స్‌, విమానాల ద్వారా గ్యాలన్ల కొద్దీ నీటిని గుమ్మరిస్తున్నారు. సమీప నివాస ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 750ఎకరాల్లో పచ్చదనాన్ని భస్మీపటలం చేస్తున్న దావాగ్నిని అరికట్టడానికి 400 వందల మంది ఫైర్‌ ఫైటర్స్‌ ఆవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఆకాశమార్గంలో వైమానిక దళం నివారణా చర్యలు చేపడుతోంది. నేషనల్‌ ఫారెస్ట్‌కు సమీపంలోని 450 గృహాలున్న ప్రాంతం కూడా అటవీ కీలలు బారిన పడినట్లు లాస్‌ ఏంజెల్స్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు.

Read Full Post »

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ సహా ఆరు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్దమవుతోంది. జమ్మూ కాశ్మీర్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాల శాసన సభ గుడువు ఈ ఏడాదితో పూర్తవుతుంది. ఎన్నికల విధివిధానాలను ఖరారు చేసేందుకు నిన్న బేటీ అయిన కమిషన్ అధికారులు ఎన్నికల తేదీని వెళ్లడించలేదు. మరోవైపు కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేదుకు కేంద్రం సిద్దంగా ఉన్నప్పటికీ వివిద పార్టీలలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Full Post »

న్యూఢిల్లీ: మహిళా ఆర్థికాభివృద్ధి, స్వయంసమృద్ధికోసం కొత్తచట్టాలపై అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్రమంత్రి రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం సహకరించనప్పటికీ ఇండో బ్రెజిల్‌ దక్షిణాఫ్రికా మహిళా సదస్సుకి ఆమె హాజరయ్యారు. వివిధ దేశాల మహిళలతో నిర్వహించే సదస్సులు మహిళాభ్యున్నతికోసం దోహదమవుతాయన్నారు.

Read Full Post »

న్యూఢిల్లీ: ఢిల్లీలో జాతీయ సమైక్యతా మండలి సమావేశం జరుగుతోంది. పార్లమెంట్‌ హౌస్‌లో ఈ సమావేశాన్ని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రారంభించారు. దేశ సమగ్రతకు ముప్పు తెచ్చే శక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలని ప్రధాని తన ప్రసంగంలో హెచ్చరించారు. ఆంతరంగిక భద్రతకు ప్రమాదం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎంలతో చర్చించారు.

Read Full Post »

వరంగల్‌ : దళితుల మధ్య విభేదాలు సృష్టిస్తూ ప్రభుత్వాలకు కొమ్ముకాస్తున్న ఎంఆర్‌పిఎస్‌ నాయకుడు మంద కృష్ణ తన ఆలోచలను మార్చు కోవాలని మాలమహా నాడు నాయకుడు జూపూడి ప్రభాకరరావు సూచించారు. మాలమహనాడు రధయాత్రలో భాగంగా వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో ఆయన పర్యటించారు. విభేదాలను విస్మరించి కృష్ణమాదిగ ఐక్యపోరాటాలకు కలసి రావాలని కోరారు. సినీ పరిశ్రమలో సంపాదించిన సొమ్మును కాపాడుకొనేందుకే చిరంజీవి పార్టీ పెట్టారని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలకు రెచ్చిపోయిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు జూపూడిపై రాళ్ళురువ్వారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Read Full Post »

విశాఖపట్నం: మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు చాటిచెప్పే నాటకలు మరుగున పడుతున్నాయి. వందేళ్ళ చరిత్ర కలిగిన ‘సురభి’ నాటకం ఉనికిని కాపాడుకోవడానికి తంటాలు పడుతుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఏర్పాటు చేసిన సురభీ నాటక ప్రదర్శనల్లో ‘మాయాబజార్‌‘ నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నాటక రంగానికి ఆదరణ మొండుగా ఉన్నప్పటికీ టికెట్‌ నాటకాలంటే మాత్రం ప్రేక్షకులు ముందుకు రావడం లేదని కళాకారులు వాపోతున్నారు. రంగస్థల కళాకారుల ఆర్థిక పరిస్థితి అతంతమాత్రంగానే ఉంటుందని, ప్రభుత్వం కళాకారులకు అందించే సహయాన్ని తమకు అందించాలని కోరుతున్నారు.

Read Full Post »

విజయవాడ: చిరంజీవి ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహంతో అమలు చేయడానికి సాధ్యంకాని హామీలు ఇస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వర్ల రామయ్య విమర్శించారు. బీసీలలో ప్రతి ఒక్కరికి కార్పొరేట్‌ విద్యనందిస్తామన్నా చిరంజీవి ఆచరణ ఎలా సాధ్యమో వివరించాలన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం ఎంత వకు సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

Read Full Post »

నేతన్నల ఆవేదన!

ప్రకాశం : దారాలను నమ్ముకున్న వారి బతుకులు ఆధారాలు కరువై  దారిద్ర్యంలో మగ్గుతున్నాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం లేకుండా పోతుండడంతో చేనేత కార్మికుల ఆకలి చావులు నానాటికీ పెరిగి పోతున్నాయి. వీటికి తోడు ఆరోగ్య సమస్యలు కూడా పట్టిపీడిస్తుండడంతో ప్రభుత్వాలు తమ గోడు పట్టించుకోవడంలేదని నేతన్నలు ఆవేదన చెందుతున్నారు. చేనేతకు చిహ్నం ప్రకాశం జిల్లా చీరాల. ఇక్కడ తయారైన చేనేత వస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచాయి. ఈ మండలంలోని పది గ్రామాలకు చెందిన 90 వేల మంది నేతన్నలు ఈ వృత్తినే నమ్ముకుని జీవిత చక్రం తిప్పుతున్నారు. వృత్తినే నమ్ముకున్న కార్మికులు రేయింబవళ్ళు రెక్కలాడించినా పూట గడవడమే గగణంగా మారుతోంది. ఇదిలా ఉండగా, గోరు చుట్ట మీద రోకటి పోటు పడిందన్న చందంగా, చేనేత కార్మికుల్ని రోగాలు పట్టి పీడిస్తున్నాయి. అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యాదుల భారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.

Read Full Post »

Older Posts »