Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్ 16th, 2008

హైదరాబాద్: ప్రతి మానవుడు తనంతట తాను మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలు ఉండాలి. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిల్లలకు ఈ అవకాశం లేకుండానే వయోజనులైపోతున్నారు. దీనికి కారణం ప్రాథమిక పాఠశాల దరిదాపులకు వెళ్ళే మౌలికమైన హక్కులకు దూరమవ్వడమనే చెప్పాలి.

భారత దేశంలో 2000 సంవత్సరం నాటికి నడుస్తున్న విద్యా కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ జనాభాలో 94% మందికి ఒక కిలోమీటరు దూరంలోపు ప్రాథమిక పాఠశాల ఉండగా 84% మందికి మూడు కిలోమీటర్లలోపు దూరంలో వున్నాయి. ఎస్.సి., ఎస్. టి. వర్గాల వారికి బాలికలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంనుండి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.

అలాగే,  ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్య కూడా పెరుగుతూంది. 1950-51లో ముప్పై ఒక్క లక్షల మంది పిల్లలు చేరగా 1997-98లో మూడుకోట్ల తొంబై లక్షల మంది చేరారు. 1951లో రెండు లక్షల ఇరవై మూడువేల ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి.

ఈ సంఖ్య 1996-97 నాటికి ఏడులక్షల డెబ్బదిఅయిదు వేలు అయింది. ఇలా పెరుగుతూ 2000- 03 నాటికి 82% 6-14 ఏళ్ళ బడికెళ్లే వయస్సు ఉన్నవారు బడికి వెళుతున్నారు, ఈ దశాబ్దాంతానికి నూరు శాతం సాధించాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం.

ప్రపంచంలో దారిద్ర్యాన్ని రూపుమాపి శాంతి భద్రతలను కొనసాగించాలంటే ప్రతి పౌరునికి సాధికారత చేకూర్చి సుఖ సంతోషాలు పొందాలి. ఈ లక్ష్యం సాధించాలంటే ప్రపంచ వ్యాప్తంగా పిల్లలందరూ నాణ్యమైన పరిసరాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలకైనా వెళ్ళి చదువుకోవాలి. సార్వత్రిక ఎలిమెంటరీ విద్యను స్పష్టమైన కాలవ్యవధులలో అందించే కార్యక్రమము. దేశవ్యాప్తంగా నాణ్యమైన ప్రాథమిక విద్యను అందివ్వాలనే బాధ్యతను కల్గిఉండేది. ప్రాథమిక విద్య ద్వారా సామాజిక న్యాయం పెంచుకునే అవకాశం కల్పించేది. పంచాయతీరాజ్ సంస్ధలు, పాఠశాల నిర్వహణ సంఘాలు, గ్రామం, మురికి వాడలు విద్యాసంఘాలు, తల్లిదండ్రుల-ఉపాధ్యాయ మండళ్ళు, తల్లుల-ఉపాధ్యాయుల సంఘాలు, గిరిజన స్వయం  సలహా మండళ్ళు, ఇతర క్షేత్రస్ధాయి నిర్వాహక వ్యవస్ధలు కలసి చేసే కృషి తోడ ఎలిమెంటరీ విద్య నిర్వహణపై ప్రభావితం చూపేది. దేశమంతటా సార్వత్రిక ఎలిమెంటరీ విద్య పొందే వీలు ఉండాలనే రాజకీయ అభిలాష  కల్గిఉన్నది. కేంద్ర, రాష్ట్ర, స్దానిక ప్రభుత్వాల భాగస్వామ్యం కల్గిఉండేది. ఎలిమెంటరీ విద్యను తమ  రాష్ట్రానికి అనుగుణంగా మార్చుకొనే  అవకాశంగలది. సార్వత్రిక ఎలిమెంటరీ విద్య సర్వశిక్షాభియాన్ కార్యక్రమం ద్వారా సాధించడమనేది భారత ప్రభుత్వం ప్రాధాన్యతాంశం. ఇది ఖచ్చితమైన కాలవ్యవధులలో పూర్తి చేయవలసిన కార్యక్రమం. భారత రాజ్యాంగలోని 86వ అధికరణం ద్వారా ఆరు నుండి పదునాల్గు సంవత్సరాల వయస్సుగల బాలలకు తప్పనిసరి ఉచిత విద్యను అందించాలి, ఇది బాలల ప్రాథమిక హక్కు. 1.1 మిలియన్ల ఆవాసాలలో గల 192 మిలియన్ల పిల్లల కొరకు రాష్ట్రల భాగస్వామ్యలతో దేశమంతటా అమలు అవుతోంది. పాఠశాలలు లేని ఆవాసాలలో క్రొత్త పాఠశాలలు నెలకొల్పడం, ఉన్న పాఠశాలలకు కావలసిన సౌకర్యాలను అంటే, అదనపు తరగతి గదులు, మరుగుదోడ్లు, మంచినీరు,  పాఠశాల నిర్వహణ మెరుగుదలకు నిధులను కల్పించడం. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను భర్తీ చేయడం. ఉపాధ్యాయుల బోధనా పటిమను పెంచే దిశలో శిక్షణ, బోధనాభ్యసన సామగ్రిని సిద్ధపరచడంలో నిధుల కల్పన బోధనాధారిత వ్యవస్ధగా క్లస్టరు, బ్లాకు, జిల్లా స్ధాయిలలో అభివృధ్ధి సాధించడం. జీవన నైపుణ్యాలతో కూడిన నాణ్యతా విద్యను పిల్లలకు అందించడం, బాలికల విద్య, ప్రత్యేక అవసరాలు గల బాలల విద్యపై ప్రత్యేక దృష్టితో పనిచేయడం. డిజిటల్ డి వైడ్ (Digital divide ) భర్తీతో కంప్యూటర్  విద్యను అందించడం.

2003 సంవత్సరంనాటికి పిల్లలందరూ బడులలో/విద్యాహమీ కేంద్రాలలోను లేదా, ప్రత్యామ్యాయ పాఠశాలల్లోను లేదా మళ్ళీబడికి శిబిరాలలోను ఉండాలి.
·        2007 సంవత్సరం నాటికి బడిలో చేరిన పిల్లలు ఐదు సంవత్సరాల ప్రాధమిక విద్యను పూర్తి చేయాలి.
·        2010 సంవత్సరం నాటికి ఎనిమిది సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయాలి.
·        జీవన నైపుణ్యాలకు  ప్రాధాన్యతనిస్తూ గుణాత్మకత కల్గిన ఎలిమెంటరీ విద్యపై దృష్టి సారించాలి.
·        సామాజిక అసమానతలు, లింగ వివక్ష లేకుండా 2007 నాటికి ప్రాధమిక విద్యను,  2010 నాటికి ఎలిమెంటరీ విద్యను పిల్లలందరికి సమానంగా అందించాలి.
·        2010 నాటికి పాఠశాలల్లో సార్వత్రిక నిలుపుదల సాధించాలి.

దృష్టి సారించవలసిన అంశాలు :

  • ప్రత్యామ్నాయ విద్య.
  • ప్రత్యేక అవసరాలుగల బాలల విద్య.
  • ప్రజా  చైతన్యం.
  • బాలికా విద్య.
  • నాణ్యమైన ఎలిమెంటరీ విద్య.

సంస్ధాగత సంస్కరణం:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సర్వశిక్షాభియాన్  కార్యక్రమంలో భాగంగా విద్యా విధానం మెరుగు పరచడంలో సంస్కరణలు. విద్య నిర్వహణను, పాఠశాలలు సాధించిన స్ధాయిలను, ఆర్ధిక అంశాలు, వికేంద్రీకరణ, ప్రజలకు తమదీ ఆనే భావనను పెంచడం, రాష్ట్ర విద్యాచట్టంపై సమిక్ష, ఉపాధ్యాయుల సర్దుబాటు, ఉపాధ్యాయుల నియామకం, పర్యవేక్షణ, మూల్యాంకనం, బాలికల విద్యా స్ధాయి, షెడ్యూల్దు కులాలు, షెడ్యూల్దు తరగతుల అణగారిన/నిర్లక్షానికి గురైన సమూహాలు ప్రభుత్వేతర పాఠశాలల నిర్వహణ విధానం, పూర్వ ప్రాధమిక విద్యాకేంద్రాలలో గల విద్యా విధానాన్ని, లక్ష్యాలను అంచనా వేయడం రాష్ట్రాలు చేపట్టాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఎలిమెంటరీ విద్యను మెరుగుపరచి అందించడంలో అనేక మార్పులు చేస్తున్నాయి.

ఆర్ధిక పరిపుష్టి:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దీర్ఘకాలిక కార్యక్రమాల దృష్ట్యా ఎలిమెంటరీ విద్య అనుబంధ కార్యక్రమాలకు ఊతంగా ఆర్ధిక భాగస్వామ్యాన్ని సర్వశిక్షాభియాన్ ద్వారా పొందుతున్నాయి.

ప్రజల ఉమ్మడి భావన : ప్రజలకు పాఠశాల సంబంధిత కార్యక్రమాలు తమవే అనే విధంగా ప్రభావితమైన వికేంద్రీకరణం చేయాలి. దీనికోసం మహిళా సమూహాలను, గ్రామ విద్యా సంఘ సభ్యులను పంచాయతీరాజ్ సంస్ధ సభ్యులను కలుపుకోవడం.

సంస్ధాగత సామర్ధ్యాల పెంపుదల:
నీపా (ఎన్.ఐ.ఇ.పి.ఎ)/ఎన్.సి.ఇ.ఆర్.టి/ఎన్.సి.టి.ఇ/ఎస్.సి.ఇ.ఆర్.టి/సీమాట్(ఎస్.ఐ.ఇ.ఎమ్.ఎ.టి) /డైట్ (డి.ఐ.ఇ.టి) వంటి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్ధాయిలలో ఈ సంస్థలు  నాణ్యతా సంపత్తిని పెంపొందించడంలో,  మానవవనరులు, సంస్ధల ఆసరా, మద్దతు ఇవ్వడంలో సర్వశిక్షాభియాన్ ప్రధాన సూత్రధారి.

ప్రధాన స్రవంతిలో మెరుగుదల కు విద్యాపాలన నిర్వహణః సంస్ధాగత అభివృద్ధితో  ప్రధాన స్రవంతిని మెరుగుపరుస్తూ  విద్యా పాలన నిర్వహణలో నూతన విధానాలను దక్షతతో నిర్వహిస్తూ ఫలవంతమైన క్రియాశీలక పద్ధతుల తో పెట్టుబడికి  సరియగు ఫలితాన్ని సాధించడం .

పూర్తి పారదర్శకతతో జనపర్యవేక్షణ : సామాజిక పర్యవేక్షణాధారంగా ఈకార్యక్రమం జరుగుతుంది.  విద్యా నిర్వహణలో సమాచార వ్యవస్ధ (ఇ ఎమ్ ఐ ఎస్) పాఠశాల స్ధాయి వివరాలతో అనుసంధానం చేస్తూ ప్రజాపరంగా సూక్ష్మప్రణాళిక, ఇంటింటి సేకరణ అంశాల ద్వారా తీసుకున్న సమాచారంతో కలుపుకోవడం, ప్రతీ పాఠశాల, ప్రజల ద్వారా సేకరించిన సమాచారంతో బాటు తీసుకున్న నిధుల అంశాలను కలుపుకోవడంలో ప్రోత్సహించడం, ఈ సమాచార అంశాల వివరాలను ప్రతి పాఠశాల సూచికా ఫలకంపై ప్రదర్శించడం.

ఆవాస ఆంశిక ప్రణాళిక: సమాజ కేంద్రీకృత విధానాల ద్వారా ఆవాస ప్రణాళికను ఆంశికంగా తీసుకొని, సర్వశిక్షాభియాన్ తన పనులను నిర్వహిస్తుంది, జిల్లా ప్రణాళికను తయారుచేయడంలో ఆవాస ప్రణాళికలే ఆధారమౌతాయి.

సమాజానికి-జవాబు దారీతనం: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పంచాయతీరాజ్ సంస్ధల సహకారంతో సమాజానికి పారదర్శకతతో జవాబు దారీతనంతో సర్వశిక్షాభియాన్ సన్నద్ధం కావాలి.

బాలికా విద్య ప్రాముఖ్యత: షెడ్యూల్దు కులాలు, షెడ్యూల్డు తరగతులు, జాతులు, అల్పసంఖ్యాక వర్గాల బాలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, సర్వశిక్షాభియాన్ ప్రధానాంశం.

ప్రత్యేక సమూహాలపై దృష్టి : కలుపుకోవడంలో లేదా భాగస్వామ్యంతో చేసే విద్యావిధానంలో ఎస్సి,  ఎస్టి, మైనారిటి సమూహాలు,  నగరమురికి వాడల, అణగారిన సమూహాల, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కొరకు  ప్రత్యేక దృష్టితో నిర్వహించడం.

పథకపూర్వదశ: పటిష్ట ప్రణాళిక కల్గిన పథక పూర్వదశ దేశమంతటా  నిర్వహించడంలో బోధనాభ్యసన సామర్ధ్యాల పెంపుదలతో అనేక అనుబంధ కార్యక్రమాల వివరాలతో పర్యవేక్షణ విధానంతో ఇమిడి ఉన్నది, ఇందులో ఇంటింటి వివరాల సేకరణ, జనసామాన్య ఆధారిత సూక్ష్మ ప్రణాళిక, పాఠశాల నైసర్గిక స్వరూపాలు, స్ధానిక నాయకులకు శిక్షణ, పాఠశాల స్ధాయి కార్యకలాపాలు, సమాచార వ్యవస్ధను పటిష్ట పరచే మద్దత్తు, కార్యాలయ సామగ్రి, విశ్లేషణాత్మక అధ్యయనాలు మొదలగునవి.

నాణ్యతపై ద్రష్టి : ఎలిమెంటరీ స్ధాయి  విద్య వినియోగకరంగా , విద్యార్ధుల కనుగుణంగా ఉండేటట్టు చూడడంలో సర్వశిక్షాభియాన్ ప్రత్యేకత కల్గి ఉండాలి.  విద్యా ప్రణాళికను, శిశుకేంద్రీకృత కార్యకలాపాలను మెరుగుపరచడం, ప్రభావిత బోధనాభ్యసన వ్యూహాలను ఏర్పరచడం చేయాలి.

ఉపాధ్యాయుల పాత్ర : సర్వశిక్షాభియాన్, కేంద్ర స్ధానంలో గల ఉపాధ్యాయుడ్ని, అతని క్లిష్ట పాత్రను గుర్తించింది.  బోధనాభివృధి అవసరాలపై దృష్టి సారించి, బ్లాక్(మండలం) వనరుల కేంద్రాలు, క్లస్టరు వనరుల కేంద్రాలను ఏర్పరచడం, అర్హతగల ఉపాధ్యాయులను  నియమించడం.
విద్యాప్రణాళిక సంబంధిత సామగ్రిని అభివృధ్ధి పరచడంలో ఉపాధ్యాయులకు భాగస్వామ్యం కల్పించడం, తరగతి గది ప్రక్రియపై దృష్టి సారించడం.  విద్యాప్రదర్శనక్షేత్రాలను ఉపాధ్యాయులు సందర్శించడం, మానవ వనరులను అభివృధ్ధి పరిచే విధంగా ఉపాద్యాయులను సిద్ధంచేయడం.

జిల్లా ఎలిమెంటరీ విద్యాప్రణాళికలు : సర్వశిక్షాభియాన్ ప్రణాళికా విధానంలో ఎలిమెంటరీ విద్యా విభాగానికి సంపూర్ణ కేంద్రీకృత విధానంలో కావలసిన వనరులను, పెట్టుబడులను ప్రతిబింబించే జిల్లా ప్రణాళికలు ప్రతి జిల్లాలోను సిద్ధం చేయడం.  భవిష్యత్దృష్టితో దీర్ఘకాలిక ప్రణాళికలో సార్వత్రక ఎలిమెంటరీ విద్యను సాధించడంలో నిర్మాణాత్మక కార్యక్రమాలు రూపొందించడం.  సంవత్సరం పొడుగూతా చేయవలసిన ప్రాధాన్యతా కార్యక్రమాల జాబితా రూపకల్పన వార్షిక ప్రణాళికా బడ్జెట్ నందు ఉంటుంది, భవిష్యత్ ప్రణాళిక అనేది చైతన్య పూరిత రచనగా ఉంటూ కార్యక్రమం అమలు కావడంలో మెరుగుదలను ఖచ్చితంగా చూపే విధంగా ఉండడం.

తొమ్మిదవ (9) ప్రణాళికలో 85:15 నిష్పత్తిలోను, పదవ (10) ప్రణాళికలో 75:25 నిష్పత్తిలో, తదుపరి 50:50 నిష్పత్తిలో భాగస్వామ్యంతో సర్వశిక్షాభియాన్ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక వనరుల తోడ్పాటు ఉంటుంది.

  • 1999 – 2000 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలిమెంటరీ విద్య కొరకు పెట్టుబడిని పెట్టాయి.  ఈ ముడుపును ఇంకా అధికంగా సర్వశిక్షాభియాన్ కి పెట్ట గలగాలి .
  • రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసే సొసైటికి భారత ప్రభుత్వం నేరుగా నిధులను  విడుదల చేస్తుంది.
  • అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం  నిధులు అమలు చేసే  సొసైటికి బదిలి చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఫలవంతం కావడంలో కనీసం 50 శాతం వెచ్చించినట్లయితేనే తదుపరి వాయిదాలను భారత ప్రభుత్వం, సొసైటికి విడుదల చేస్తుంది.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో, సర్వశిక్షాభియాన్ కింద నియామకమైన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడంలో     9వ ప్రణాళికలో 85 : 15 నిష్పత్తిలోను, 10వ ప్రణాళికలో 75 : 25 నిష్పత్తిలో తదుపరి 50 : 50 నిష్పత్తిలోను ఉంటుంది.
  • విదేశీ ఏజన్సీ సలహాల మేరకు ప్రత్యేక మార్పులపై అంగీకారం అయితేనే పథకాలకు వెలుపల తోడ్పాటు అన్ని విధాలైన     చట్ట సంబంధిత ఓప్పందాలతో కొనసాగుతాయి.

ఎలిమెంటరీ విద్యావిభాగంలో ప్రస్తుతమున్న పథకాలు 9వ ప్రణాళికానంతరం (మహిళా సమాఖ్య, జాతీయ బాలభవనం, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎస్ సి టి ఇ) తప్ప కలిసిపోతాయి.

జాతీయ పొషకాహార కార్యక్రమం: ప్రాథమిక విద్య కొరకు మధ్యాహ్నభోజన పథకాన్ని జిల్లా ప్రత్యేక అనుబంధ కార్యక్రమంగా నిర్వర్తిస్తోంది, ఇందులో, కేంద్రం ద్యారా ఆహార గింజల  ప్రత్యేక రవాణా ఖర్చు, వండిన ఆహారం అందించడానికి అగు ఖర్చును రాష్ట్రాలు భరించే విధంగా ఉంటుంది.
ఇతర విభాగాల ద్వారా అనగా  జె జి ఎస్ వై,  ప్రధానమంత్రి రోజ్ గార్  యోజన ( పి  ఎమ్ జి వై ), సునిశ్చిత్ రోజ్ గార్  యోజన పార్లమెంటు సభ్యులు (ఎమ్ పి లు), శాసనసభ సభ్యులు (ఎమ్ ఎల్ సి లు) నిధులు/రాష్ట్ర ప్రణాళిక నిధులు విదేశీనిధులు ఏమైనా (ఎన్ జి ఓ) స్వచ్ఛంద సేవాసంస్థల ద్యారా వచ్చిన వనరులు వివరాలు, ఇతర అంశాలు జిల్లా విద్యా ప్రణాళికలలో, నిధులు/వనరుల సృష్టతతో ఉండాలి.
పాఠశాల స్ధాయిని పెంచడం, నిర్వహణకు, పాఠశాలల మరమ్మత్తుకు బోధానాభ్యసన సామగ్రి, స్థానిక నిర్వహణలకు అందించే నిధులన్ని గ్రామ విద్యా మండలికి/సంఘానికి, పాఠశాల నిర్వహణ సంఘానికి, గ్రామపంచాయతి/ఇతరమైన గ్రామ/పాఠశాల స్ధాయి నిర్వహణకు రాష్ట్రాలు వికేంద్రీకరించడం చేయాలి.
గ్రామ / పాఠశాల సంబంధిత నిర్వాహక మండలి ఏవిధంగా నిధులను సమీకరించుకోవాలో తీర్మానిస్తుంది, ఉపకార వేతనాల పంపిణీ సమరూపక దుస్తులు వంటి ఇతర ప్రోత్సాహక పథకాలు రాష్ట్రప్రణాళికలో గల నిధులతోనే కొనసాగించాలి,  సర్వశిక్షాభియాన్ కార్యక్రమం ద్వారా వెచ్చించరాదు.

సర్వశిక్షాభియాన్ అనుబంధ కార్యక్రమాలకు నిబంధనలు
కార్యక్రమ నిబంధనః

1. ఉపాధ్యాయుడు :

  • ప్రాథమిక, ప్రాథమికోన్నత స్ధాయిలలో ప్రతీ 40 విద్యార్ధులకు 1    ఉపాధ్యాయుడు ఉండాలి.
  • ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలి.
  • ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రతి తరగతి కి 1 ఉపాధ్యాయుడు ఉండాలి.

2. పాఠశాల/ప్రత్యామ్నాయ పాఠశాల సౌకర్యం:

  • కిలో మిటరు పరిధిలో ప్రతి ఆవాసంలో పాఠశాల ఉండాలి
  • రాష్ట్ర నిబంధనలనుసరించి నూత్న పాఠశాలలు ఏర్పరచడానికి విద్యాహమీ పథకం వంటి బడులను ఆవాసయోగ్యం కాని ప్రాంతాలలో తెరవడం.

3. ప్రాథమికోన్నత పాఠశాలలు/విభాగం:
ప్రాథమిక విద్యను పూర్తి చేసిన పిల్లల సంఖ్యలకు అనుగుణంగా ప్రాథమికోన్నత పాఠశాలను లేదా ప్రతీ 2 ప్రాథమిక పాఠశాలకు ఒక సెక్షనును  గాని ఏర్పరచడం.
4. తరగతి గదులుః
ప్రతీ ఉపాధ్యాయుడికి లేదా ప్రతీ గ్రేడు 1 తరగతికి ప్రాథమిక/ప్రాథమికోన్నత స్ధాయిలో కల్పించడం, ప్రతీ ప్రాథమిక పాఠశాలకు కనీసం 2 ఉపాధ్యాయులు ఉండడం, 2 తరగతి గదులు, 1 వరండాను ఏర్పరచాలి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో/సెక్షనులో ప్రధానోపాధ్యాయుడికి ఒక గది ఉండాలి.
5. ఉచిత పాఠ్యపుస్తకాలు :

  • ప్రాథమిక, ప్రాథమికోన్నత స్ధాయిలో గల ఎస్.సి/ఎస్.టి  బాలుడు/బాలిక, బాలికలందరికి రూ. 150/- మూల్యం వరకు పుస్తకాలు ఇవ్యడం.
  • ప్రస్తుత రాష్ట్రప్రణాళిక ద్యారా ఉచిత పాఠ్యపుస్తకాలకు నిధులను కొనసాగిస్తుంది.
  • ఎలిమెంటరీ తరగతులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలను అందించడంతో బాటు సర్వశిక్షాభియాన్ తోడ్పాటుతో మిగితా ధన సాయాన్ని తీసుకుంటుంది.

6. పాఠశాల భవన నిర్మాణ పనులు : పాఠశాల భవన నిర్మాణ పనుల నిమిత్తం, పథక ఆమోద మండలి (పి.ఎ.బి) ఆమోదముతో పథక మొత్తంలో 33 శాతం మించకుండా పాఠశాల భవనాలను 2010 వరకు భవిష్యత్ ప్రణాళిక ననుసరించి వినియోగించవచ్చు.

  • 33 శాతం మేరకు విధించిన నిబంధనను నిర్వహణకు భవన మరమ్మత్తుకు వినియోగించకూడదు.
  • పథక మొత్తంలో గల 33 శాతం నుండి 40 శాతం వరకు ఒక నిర్ధిష్ట సంవత్సర ప్రణాళికలో ప్రాధానతాంశాల కేటాయింపులో భవన నిర్మాణాలకు వెచ్చించుకొనే వీలు కల్పించవచ్చు.
  • పాఠశాల సౌకర్యాల మెరుగుదలకు, మండల వనరుల కేంద్రానికి క్లస్టరు వనరుల కేంద్రానికి
  • క్లస్టరు వనరుల కేంద్రాలను అదనపు తరగతి గదిగా వినియోగించుకోవచ్చును.
  • కార్యాలయ భవన నిర్మాణాలకు వెచ్చించరాదు.
  • జిల్లాలు పాఠశాల సౌకర్యాల ప్రణాళికను సిద్ధంచేసుకోవడం.

7. పాఠశాల నిర్వహణ – భవన మరమ్మత్తులు :

  • పాఠశాల నిర్వాహక సంఘాలు/గ్రామ విద్యా సంఘాల ద్వారా
  • పాఠశాల సంఘాల ప్రత్యేక ప్రతి పాదన ద్వారా సంవత్సరాని రూ . 5000/- వరకు ఖర్చుపెట్టవచ్చు.
  • సమాజ పరంగా విరాళాలు తప్పనిసరి.
  • 33 శాతం కేటాయించిన పాఠశాల భవన నిర్మాణాల నిధిని భవన నిర్వహణకు మరమ్మత్తుకు వెచ్చించరాదు.
  • స్వంత భవనాలు కల్గిన పాఠశాలలకు మాత్రమే నిధుల వర్తింపు.

8. విద్యాహామీ పథకం: రాష్ట్ర నిబంధన మేరకు విద్యాహామీ పథకం స్ధాయిని పెంచి, నియత పాఠశాల గాను లేదా కొత్త ప్రాధమిక పాఠశాలను ఏర్పాటుచేయడం.

  • బోధనాభ్యసన ఉపకరణాలకు ప్రతీ పాఠశాలకు రూ .10,000/- మంజూరు.
  • స్ధానిక అవసరాల మరకు సంబంధిత బోధనాభ్యసన ఉపకరణాల కొనుగోలు.
  • బోధనాభ్యసన ఉపకరణాల సేకరణ, కొనుగోలు విషయంలో ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను కలుపుకోవడం అవసరం.
  • గ్రామ విద్యాసంఘం/పాఠశాల – గ్రామ స్ధాయి మండలి ఉత్తమ సేకరణతో కొనుగోలు నిర్ణయిస్తుంది.
  • విజయవంతమైన రెండు సంవత్సరాల కాలం విద్యాహామి పథకం అమలు అయినట్లయితేనే స్ధాయి పెంపుదల జరుగుతుంది.
  • తరగతి గదులకు ఉపాధ్యాయుల ఏర్పాటుకల్పించడం.

9. ప్రాథమికోన్న పాఠశాలకు బోధనాభ్యస ఉపకరణాలుః

  • ఇంత వరకు నిధులు అందని పాఠశాలకు, పాఠశాలకు రూ . 50,000/- ల చొప్పున ఇవ్వడం.
  • ఉపాధ్యాయ, పాఠశాల సంఘాల నిర్ణయంతో  స్ధానిక అవసరాల మేరకు కొనుగోలు.
  • ఉపాధ్యాయుల సలహా మేరకు ఏది ఉత్తమమైన కొనుగోలు/సేకరణ అనే నిర్ణయాన్ని పాఠశాల సంఘం చేస్తుంది.
  • ఉత్తమ ప్రమాణాలు ఉంటాయనుకుంటే పాఠశాల సంఘం సూచన మేరకు జిల్లా స్ధాయిలో కొనుగోలు చేయడం.

అనుబంధ కార్యక్రమాల నిబంధన:
10. పాఠశాల నిధిః

  • ప్రతీ ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రతీ సంవత్సరం రూ . 2000/- చొప్పున పనికిరాని సామగ్రి కొరకు కేటాయించడం
  • వినియోగంలో పారదర్శకత
  • గ్రామ విద్యాసంఘం/పాఠశాల నిర్వహణ సంఘం ద్వారానే ఖర్చుపెట్టాలి.

11. ఉపాధ్యాయ నిధిః

  • ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడికి రూ . 500/- చొప్పున ఇవ్వడం
  • వినియోగంలో పారదర్శకత

12. ఉపాధ్యాయ శిక్షణ :

  • ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి 20 రోజుల శిక్షణను, శిక్షణలేని ఉపాధ్యాయ ఉధ్యోగులకు 60 రోజులు శిక్షణా తరగతులు, కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులకు 30 రోజుల పునశ్చరణ తరగతులు ఇప్పించడం. వీరందరికి శిక్షణా కాలంలో రోజుకి రూ . 70/- చొప్పున  ఖర్చుచేయవలసి ఉంటుంది.
  • వసతి కల్పించని శిక్షణా కార్యక్రమాలకి ప్రామాణిక వ్యయసూచిక ననుసరించి ఇవ్వాలి.
  • అన్ని శిక్షణా కార్యక్రమాల ఖర్చు ఉంటుంది.
  • విస్తృత పరిధిలో క్రియాశీలక శిక్షణ ద్వారా సామర్ధ్యాలను అంచనా కట్టవచ్చును.
  • ఉపాధ్యాయ విద్యాపథకాలలో గల రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్ధ (ఎస్.సి.ఇ.ఆర్.టి)/ జిల్లా విద్యా శిక్షణ సంస్ధ (డి.ఐ.ఇ.టీ) తోడ్పాటు ఉంటుంది

13. రాష్ట్ర విద్యా నిర్వహణ – శిక్షణ సంస్ధ (ఎస్.ఐ.ఇ.ఎమ్.టి):

  • ఒకసారి సహకారానికి రూ . 3 కోట్లు
  • రాష్ట్రాలకు ఆసరాగా అంగీకారం
  • కఠినమైన నియమాలతో కీలక ఎంపిక

14. స్ధానిక నాయకులకు శిక్షణ:

  • గ్రామంలో 8 మందికి (ముఖ్యంగా స్త్రీలకు) తక్కువ కాకుండా సంవత్సరంలో  2 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం.
  • ప్రతి రోజు ప్రతి శిక్షకుడికి రూ. 30/- చొప్పున ఖర్చు.

15. ప్రత్యేక అవసరాలు గల బాలలకు అందుబాటులో విద్యః

  • ప్రత్యేక ప్రతిపాదన ననుసరించి సంవత్సరానికి ప్రతి ప్రత్యేక అవసరంగల పిల్ల/పిల్లవాడికి రూ.1200/- చొప్పున
  • ప్రత్యేక అవసరాలు గల బాలలకిచ్చే ధన రూప పరిమితితో రూ . 1200/- చొప్పున జిల్లా ప్రణాళికలో రూపకల్పన
  • వనరుల సంస్ధలను కలుపుకోవడంలో ప్రోత్సహించడం

16. పరిశోధన, మూల్యాంకనం, పరిశీలన, పర్యవేక్షణః

  • ·        సంవత్సరానికి ప్రతీ పాఠశాలకు రూ. 1500/- వరకు ఇవ్వడం
  • పరిశోధన వనరుల సంస్ధల భాగస్వామ్యంతో ప్రత్యేక దృష్టితో రాష్ట్రంలో వనరులను సమీకరించడం.
  • విద్యా నిర్వాహక సమాచార విధానం (ఇ.ఎమ్.ఐ.ఎస్) క్రియాశీలత కొరకు వనరులు, పరిశోధన సంస్ధల ద్వారా పర్యవేక్షణ పరిశీలనలకు సామర్ధ్యాల అభివృద్ధి ప్రాధ్యాన్యతగా ఇవ్వాలి.
  • నియత పాఠశాలల నైసర్గిక రూపాలకు/సూక్ష్మ ప్రణాళికలను ఇంటింటి వివరాల సేకరణ ద్వారా ఎప్పటికప్పుడు తాజాగా రూపకల్పన చేయడం.
  • రవాణా భత్యం, గౌరవవేతనం ఇవ్వడం ద్వారా మానవ వనరులను సిద్ధం చేసుకోవాలి, పర్యవేక్షణ జరపాలి.
  • స్ధానిక సామాజిక వివరాల సేకరణ, పరిశోధనాధ్యయనాలు, ఖర్చును అంచనా వేయడం, ఒప్పుదల అంశాలు, క్షేత్ర కార్యకలాపాలు తరగతి గది ప్రక్రియా విధానాలను నిష్ణాతులైన వ్యక్తుల ద్వారా పరిశీలింప చేయాలి.

అనుబంధ కార్యక్రమాలనిబంధన :

  • జాతీయ, రాష్ట్ర, జిల్లా, ఉపజిల్లా పాఠశాల స్ధాయిలలోగల నిధులన్ని పాఠశాల కొరకే కేటాయించబడినవి.  జాతీయ స్ధాయిలో సంవత్సరానికి రూ. 100/- చొప్పున పాఠశాలకు వెచ్చించాలి.
  • రాష్ట్ర/జిల్లా/బ్లాక్ వనరుల కేంద్రం/క్లస్టర్ వనరుల కేంద్రం/పాఠశాల స్ధాయిలకు ఖర్చు పెట్టవలసిన ధనాన్ని రాష్ట్రం యే నిర్ణయిస్తుంది.
  • ఒప్పందాలకు పరిశీలనకు/పర్యవేక్షణకు పాఠశాల నిర్వహణ (ఎమ్.ఐ.ఎస్) తరగతి గది పరిశీలనలకు మొదలైన వాటికి వెచ్చించడమౌతుంది.
  • రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్ధ(ఎస్.సి.ఇ.ఆర్.టి)కి కూడా ఉపాధ్యాయ విద్యాపథకం కింద నిధిని కల్పించడం ఉంటుంది.
  • రాష్ట్రం, ప్రత్యేక బాధ్యతలను చేపట్టేటందకు వనరుల సంస్ధలను కలుపుకోవడం.

17. నిర్వాహకవ్యయం :
·        జిల్లా ప్రణాళికలో 6 శాతం తగ్గకుండా నిర్వాహణ ఖర్చుకు వెచ్చించాలి.
·        కార్యాలయ ఖర్చులకు, ఉన్న మానవ వనరులను అంచనా వేయుటకు, పి.ఒ.ఐ మొదలగు వాటిని పరీక్షించుటకు వివిధ స్ధాయిలలో నిష్ణాతులైన వ్యక్తులను, ఆహ్వానించడానికి మొ||గు ఖర్చులను కలుపుకోవచ్చును.
·        నిర్ధిష్ట జిల్లాలో అందగల్గే సామర్ధ్యాలను బట్టి నిర్వాహక నమాచార విద్యావళి (ఎమ్.ఐ.ఎస్), స్ధానిక సామాజిక ప్రణాళిక ప్రక్రియకు, పాఠశాల భవన నిర్మాణాలకు, లింగవివక్ష చూపకుండా ఉండే విధానానికి మొ|| వాటికి ప్రాధాన్యతగా ఇవ్యాలి.
·        క్రియాశీలక సమూహాలను రాష్ట్ర/జిల్లా/బ్లాకు/క్లస్టరు స్ధాయిలలో అభివృద్ధి పరచడంలో నిర్వహక వ్యయం చేయాలి
పథక పూర్వదశలో గుర్తించబడిన సిబ్బంది బ్లాకు వనరుల కేంద్రాల (బి.ఆర్.సి),క్లస్టర్  వనరుల కేంద్రం            (సి. ఆర్. సి) లకు ప్రాధాన్యత నివ్వడం వలన సునిశిత ప్రక్రియా ప్రణాళిక సముదాయం అందుబాటులోకి వస్తుంది.
18.బాలికా విద్యలో నూతన పోకడలతో కార్యక్రమాలు: పూర్వప్రాథమిక విద్య, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులు అణాగారిన వర్గాల వారి పిల్లలకు ప్రత్యేకంగా ప్రాథమికోన్నత స్ధాయిలో గలవారికి కంప్యూటర్ విద్యను కల్పించడం.

  • సర్వశిక్షాభియాన్ లోనూత్న పోకడలకు జిల్లాకు సంవత్సరానికి రూ . 50 లక్షలు పథకంలో ప్రణాళిక ఉన్నది. ప్రతీ విభాగపు నూతన పోకడకు రూ .15 లక్షల వరకు వెచ్చించవచ్చు.
  • ప్రస్తుతమున్న పథకాలలో పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలు బాలిక విద్య కార్యక్రమాలకు ప్రామాణిక వ్యయం ఆమోదమైనది.

19. బ్లాకు వనరుల కేంద్రాలు/క్లస్టర్ వనరుల కేంద్రాలుః
·        బ్లాకు వనరుల కేంద్రంలో  సామాజికాభివృద్ధి (సి.డి) విభాగం ఉంటుంది. రాష్ట్రాలలో ఉపజిల్లా విద్యా పరిపాలన నిర్మాణంలో విద్యా బ్లాకులు/వలయాలు (సర్కిళ్ళు) సిడి బ్లాకుతో కలవకపోయినా ఆపరిధిలో ఉండాలి, అప్పుడు మాత్రమే రాష్ట్రం ఉపజిల్లా విద్యా నిర్వాహణ ప్రామాణికంగా ఆ బ్లాకు వనరుల కేంద్రాన్ని చేయడానికి వీలవుతుంది
·        సిడి బ్లాకులో గల బి.ఆర్.సి, సి.ఆర్.సిలకయ్యే వ్యయం పునరావృతం అయ్యే, పునరావృతం కాని ఖర్చుల కేటాయింపులో బి.ఆర్.సి, సి.ఆర్.సి పొందే సిడి బ్లాకులోగల ఒక బి.అర్ .సి కి సరిపడ్తుంది.
·        అవకాశమున్నంత మేరకు పాఠశాల ప్రాంతంలోనే బి.ఆర్.సి /సి.ఆర్.సి ఉండాలి.
·        ఎక్కడ బి.ఆర్.సి  అవసరమో అక్కడ బి.ఆర్ .సి భవనానికి రూ . 6 లక్షలకు మించకుండా ఖర్చు పెట్టవచ్చును.
·        అదనపు తరగతి గదులుగా  పాఠశాలల్లో వినియోగించుకోనే వీలుండేచోట సి.ఆర్.సిభవన నిర్మాణానికి రూ . 2 లక్షలకు మించకుండా ఖర్చుపెట్టవచ్చు.
·         ఏ సంవత్సరంలోనైనా మొత్తం పథక వ్యయంలో 5 శాతానికి మించకుండా పాఠశాలేతర బి.ఆర్.సి, సి.ఆర్.సి నిర్మాణాలకు వ్యయపరచవచ్చు.
కార్యక్రమ నిబంధన
·        100 పాఠశాలల కన్నా ఎక్కవ ఉన్న బ్లాకులో 20 మంది ఉపాధ్యాయులు, చిన్న బ్లాకులలో గల బి.ఆర్.సి, సి.ఆర్.సిలను కలుపుకొని 10 మంది ఉపాధ్యాయులు ఉండాలి.
·        ఫర్నీచర్  కొనుగోలుకు బి.ఆర్.సి లకు రూ . 1 లక్ష చొప్పున సి.ఆర్.సి లకు రూ . 10,000/- చొప్పున వీలుంటుంది
·        ప్రతీ సంవత్సరానికి అనుకోని వ్యయానికి గల నిధి నుండి రూ . 12,500/-   చొప్పున బి.ఆర్.సికి, రూ . 2500/- చొప్పున సి.ఆర్.సికి విడుదలవుతుంది
·        సమావేశాలు, ప్రయాణ భత్యం  రూ . 500/- చొప్పున నెలకు ఒక్కొక్క బి.ఆర్.సికి, నెలకు ఒక్కొక్క సి .ఆర్.సికి రూ . 200/- చొప్పున సమావేశాలకు, ప్రయాణ ఖర్చులకు వినియోగించవచ్చు.
·        బోధ్యనాభ్యస పరికరాల నిధిః సంవత్సరానికి ప్రతీ బి.ఆర్.సికి రూ. 5000/- చొప్పున సి.ఆర్.సికి రూ .1000/- చొప్పున ఉంటుంది.
·        ప్రారంభ దశలోనే సునిశితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా బి.ఆర్.సి/ సి.ఆర్.సిసిబ్బందిని గుర్తించాలి
20. బడి బయట పిల్లల కొరకు కార్యక్రమం :

  • విద్యాహామీ పథకం, ప్రత్యామ్నాయ నూతన పోకడలలో విద్య వంటి కార్యక్రమాలు నిబంధనల మేరకు ఆమోదయోగ్యమైనవి, ఇందులో – ఆవాస ప్రాంతాలు లేనిచోట విద్యాహామి కేంద్రాల ఏర్పాటు.
  • ఇతర ప్రత్యామ్నాయ మాదిరి పాఠశాలలు, వారధి బడులు (బ్రిడ్జి కోర్సులు) దోష / లోప నివారణ కోర్సులు, మళ్ళీ బడికి శిబిరాలు ఏర్పాటు చేసి బడి బయట పిల్లలను నియత పాఠశాలలో ప్రధాన స్రవంతిలో చేర్చడం.

21.సంసిద్ధతా కార్యక్రమాలుః

  • సూక్ష్మ ప్రణాళికలు, ఇంటింటి సమాచార సేకరణలు, అధ్యయనాలు, చైతన్య సమూహాల ఏర్పాటు, పాఠశాల, ఆధారిత కార్యకలాపాలు, కార్యాలయ సామగ్రి, వివిధ స్ధాయిలలో శిక్షణ, పునశ్చరణ తరగతులు మొదలగునవి సంసిద్ధతా కార్యక్రమంగా చేయడం.
  • రాష్ట్ర సూచనల మేరకు జిల్లాకు నిర్దిష్ట ప్రతిపాదనను చేయడం, నగర ప్రాంతాలను, జిల్లా పరిధి మేరకు మెట్రోపాలిటన్ నగరాలకు ప్రత్యేకమైన ఆంశిక ప్రమాణంగా స్వీకరించి ప్రణాళికను అవసరాల మేరకు సిద్ధపరచడం.

Read Full Post »

హైదరాబాద్‌: ఆర్థిక సంక్షోభం విమానయాన రంగాన్ని కూడా తాకింది. సుమారు 1900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ నిన్న ప్రకటించగా, భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా 15 వేల మంది ఉద్యోగులను 3-5 ఏళ్లపాటు జీతం లేని సెలవుపై ఇంటికి పంపనున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఇలా సెలవుపై వెళ్లే వారిని తమకు అవసరమైనప్పుడు విధుల్లోకి తీసుకుంటామని ఎయిర్‌ ఇండియా సీఎండీ రఘు మీనన్‌ చెప్పారు. ఈ ప్రకటనతో పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ విబేధించారు. ఉద్యోగులను తొలగించడంగానీ, సెలవుపై పంపే ఉద్దేశంగానీ తమకు లేదని చెప్పారు. ఆర్థిక సంక్షోభం ప్రభావం కొత్త ఉద్యోగులను తీసుకునే విషయంలో ఉండవచ్చునేమోగానీ, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై ఉండబోదని పటేల్‌ చెప్పారు.

Read Full Post »

హైదరాబాద్: జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇంకనూ కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి వుండడం వల్లనూ, దారిద్ర్యంతోనూ, నిరక్షరాస్యతతోనూ కూడినది కావున ఇంకనూ సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి.

బాల కార్మిక వ్యవస్థను గురించి అధ్యయనం చేసి చేపట్టవలసిన చర్యలను సిఫారసు చేయమని 1979 లో గురుపాదస్వామి ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి కొన్ని వివరణాత్మకమైన సిఫారసులను కూడా ఆ కమిటీ చేసింది. దారిద్ర్యం కొనసాగుతున్నంతవరకూ బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం సుసాధ్యమన్నారు. కాగా దాన్ని చట్టపరంగా నిర్మూలించడమనేది ఆచరణ సాధ్యం కాదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే  బాలకార్మిక వ్యవస్థ తీవ్రస్థాయిలో కొనసాగుచున్నచో ఆయా ప్రాంతాలలో దానిని నిర్మూలనా చేసే ప్రయత్నం చేయడమే కర్తవ్యమని అంటూ వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టాలన్నారు. పనిచేసే పిల్లల సమస్యల్ని భిన్న కోణాల నుంచి అధ్యయనం చేయాలన్నారు.

గురుపాదస్వామి సిఫారసుల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థ(నిషేధం-నియంత్రణ) అనే చట్టం 1986 లో సిద్ధం చేశారు. కొన్ని ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలనూ గుర్తించి వాటిలో పిల్లలు పనిచేయడం నిషేధించింది. మరి కొన్నింటిలో పనిచేసే పరిస్థితుల్ని చట్ట ప్రకారం నియంత్రించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ చట్ట ప్రకారం బాలకార్మిక సాంకేతిక సలహా సమితిని ఏర్పాటు చేసి ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలను గుర్తింపజేసి జాబితాను విస్తరింప చేశారు.

ఈ చట్టరీత్యా చర్యల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థపై ఒక జాతీయ విధానాన్ని 1987 లో రూపొందించారు. దీని ప్రకారం క్రమంగాను ఒక పద్ధతి ప్రకారం ఆయా ప్రమాదకరమైన వృత్తుల్లో పని చేసే పిల్లలకు మొట్ట మొదట పునరావాస సదుపాయం కల్పించారు. బాలకార్మికుల జానాభా లెక్కలు తీయడానికి ఏర్పాట్లు చేశారు.

బ్రిడ్జి  కోర్సులు
ఎమ్.వి.ఫౌండేషన్ వారు మరొక విధమైన ఏర్పాటు చేశారు. బడి మానేసిన పిల్లలకు ప్రత్యేకంగా వసతి గృహాలు ఏర్పాటు చేసి వారికి విద్యాబుద్ధులు చెప్పి మామూలు పాఠశాలల్లో బాలకార్మికులు వయసుకు తగిన తరగతుల్లో ప్రవేశించుటకు ఏర్పాట్లు చేశారు. బాలకార్మికులు సజావుగా మామూలు పాఠశాలల్లో చేరడంలో ఈ విధానం చాల జయప్రదమైంది. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధమ్, సినీ-ఆశ, లోక్ జుంబుష్ వంటి స్వచ్ఛంద సంస్థలు చేపట్టి కొనసాగించడం గమనార్హం.

Read Full Post »

హైదరాబాద్‌: రాష్ట్ర పీసీసీ కొత్త కార్యవర్గం ఖరారైంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో పలు దఫాలు చర్చించిన వైఎస్‌, డీఎస్‌ కార్యవర్గాన్ని ఖరారు చేశారు. వివరాలు: మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా కె.చక్రపాణి నియమితులయ్యారు. 20 మంది పీసీసీ ప్రధాన కార్యదర్శులు, 15 మంది పీసీసీ ఉపాధ్యక్షులుగా కమిటీలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కోశాధికారిగా రాయచోటి రామయ్య, ప్రచార కమిటీ కన్వీనర్‌ కె.రోశయ్య నియమితులయ్యారు.

Read Full Post »

బాలల హక్కులు!

న్యూఢిల్లీ: భారదేశంలో గల 30 కోట్ల  పిల్లలలో చాలామంది పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదుగుదల లోపించి ఉంటున్నారు.  ఆర్ధిక, సామాజిక స్ధితిగతుల కారణంగా ఈ అభివృద్ధి లోపం ఏర్పడుతున్నమాట వాస్తవం. రేపటి జ్ఞానవంతమైన శక్తిమంతమైన భారతదేశాన్ని చూడడానికి నేటి బాలల అవసరాలను తీర్చే సమయమాసన్నమైనది.

భారతదేశ  స్వాతంత్ర్యనంతర శకంలో నిశ్చతమైన నిబద్ధతతో కూడిన భారతదేశ రాజ్యాంగ విహిత చట్టనిబంధనల ద్వారా బాలల కొరకు అవకాశాలను, కార్యాచరణ విధానాలను మరియు కార్యక్రమాలను రూపొందించింది. ఈ శతాబ్దపు చివరి దశకంలో ఆకస్మిక సాంకేతిక అభివృద్ధిలో భాగంగా ఆరోగ్యం, పోషణ, విద్య అంశాలతో బాటు ప్రాదేశిక విషయాలతో నూతన ఆకాంక్షలను కల్పించే అవకాశాలను పిల్లలకు కల్పించడం.

భారతదేశంలోగల ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధలు, ఇతర  రంగాల వారు కలసి కట్టుగా పని చేయడంలో అసాధారణ సమస్యలు గల బాలలపై ప్రముఖంగా దృష్ఠిని కేంద్రికరించడం. పిల్లలు – చాకిరికి సంబంధించిన విషయాలలో బాల కార్మికుల సమస్యలను పరిష్కరించడం లింగ వివక్షను రూపుమాపడం, వీధి బాలలను ఉద్దరించడం, ప్రత్యేక అవసరాలుగల బాలలకు కావలసిన అవసరాలను తీర్చడం. అంతే గాకుండా పిల్లలు చదువుకోవడం వారి ప్రాధమిక హక్కు కావునా దానిని కాపాడడం.

Read Full Post »

హైదరాబాద్: ప్రతి భారతీయ పౌరుడికి విద్య ఒక హక్కు. రాజ్యాంగం ప్రకారం విద్య మౌలిక స్థాయిలో ఉచితంగా లభించాలి. ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధం. ఉన్నత విద్య అందరికీ తమ ప్రతిభ మీద ఆధారపడి అందుబాటులో ఉండాలి.

మనిషి తన తెలివి తేటల్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోడానికి వీలుగా విద్యాభ్యాసం కొనసాగిస్తు వుండాలి. అప్పుడే ఆ మనిషికి మౌలికమైన స్వేచ్ఛ లభిస్తుంది. మానవ హక్కు సంప్రదిస్తుంది. తమ పిల్లలకు ఎటువంటి విద్యను సమకూర్చాలనేది తలిదండ్రులే నిర్ణయించుకునే హక్కు వారికే ప్రథమంగా వుంది.

అందరికీ విద్య:

ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు,యువకులు,వయోజనులందరికీ నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలనేది ఇప్పుడు ఉద్యమ స్థాయిని అందుకుంది. ఈ ఉద్యమాన్ని 1990లో జరిగిన అందరికీ విద్య అనే అంశం మీద ప్రపంచ స్థాయి సమావేశాలలో నిర్ణయించి ప్రారంభం చేశారు.
పదేళ్ల తర్వాత చాలా దేశాలు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాయి. ఆఫ్రికాలోని సెనిగల్ దేశ రాజధాని డాకార్లో జరిగిన సమావేశానికి వివిధ దేశాల నుండి ప్రతినిధులు వచ్చి 2015 నాటికి అందరికీ విద్య సాధించాలని నిర్ణయించారు. పిల్లలూ,యువకులూ,వయోజనులకొరకు ఆరు అభ్యాసావసరాలు గుర్తించారు. ఈ  పథకాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి మార్గదర్శి పాత్ర వహిస్తున్న యునెస్కో అంతర్జాతీయంగా సమన్వయ పాత్ర పోషిస్తూ అందరికీ విద్య తగిన ఏర్పాట్లను చేపట్టి నిర్వహిస్తున్నది. ప్రభుత్వాలను, అభివృద్ధి సంస్థలను, పౌరసమాజాన్ని, స్వచ్ఛంద సంస్ధలను, ప్రచార సాధనాలను సమీకరించి సమన్వయ పరుస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నడుం బిగించింది.
ఇప్పుడు మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను (మిలీనియం డెవలప్మెంట్ గోల్స్) సాధించడానికి అందరికీ విద్య ఎంతో ప్రయోజన పడుతుందంటున్నారు. ఈ లక్ష్యాల్లో , లక్ష్యం నెం.:రెండు సార్వత్రిక, ప్రాథమిక విద్యకు సంబంధించినవి. లక్ష్యం నం.: మూడు విద్యా రంగంలో లైంగిక సమానతను సాధించడం. ఈ లక్ష్యాలను 2015 నాటికల్లా సాధించి తీరాలన్నది ఒక ముఖ్యమైన ధ్యేయం.

గ్రామీణులందరూ విద్య ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకొని వ్యవహరించాలనేది ప్రధానం.

ఈ క్రింది సమాచారాన్ని ప్రజలందరూ పట్టించుకొని మెలగాలి.

1. ఆడపిల్లలను చదివించాలి.
2. బ్రిడ్జి కోర్సులు ద్వారా బాల కార్మికులకు విద్య అందించాలి
3. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు వెనుకబడిన తరగతులవారు, అల్పసంఖ్యాకులూ వీరందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి.
4. విభిన్న ప్రతిభావంతులు – అవిటి, చెవిటి, మూగ, అంధులు – వీరందరికీ విద్యావసతులు కల్పించాలి.
5. మహిళలు చదువుకునేటట్టు ప్రోత్సహించాలి

Read Full Post »

కాకినాడ : నవంబర్‌ 1 నుంచి రోజుకొకటి చొప్పున ప్రభుత్వ అవినీతి భాగోతాలను బయట పెడతామని గురువారం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. వైఎస్‌ హయాంలో జరిగిన అవినీతిని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళేందుకే ఈ భారీ కుంభకోణాలను బయట పెడుతున్నట్లు తెలిపారు.సెజ్‌ల పేరిట ప్రజల నుంచి అక్రమంగా లాక్కుంటున్న భూములను తిరిగి వారికి అప్పజెప్పే వరకూ తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు.

కాకినాడలో పర్యటిస్తున్న బాబు ప్రథానంగా ప్రభుత్వ అవినీతి గురించి ఎక్కువగా ప్రస్తావించారు. వైఎస్‌ హయాంలో అవినీతి పాపం పెరిగినట్లు పెరిగిపోయిందని, తాము అధికా రంలోకి వస్తే అవినీతి ప్రక్షాళన చేస్తామన్నారు. అన్ని శాఖల్లోనూ పారదర్శకత విధానం ప్రవేశపెట్టి, సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. అసలు ఇక ప్రజలు వైఎస్‌ను గానీ, కాంగ్రెస్‌ను కానీ నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన విమర్శించారు.

Read Full Post »

హైదరాబాద్‌ : టిడిపి పాలనా కాలంలో చంద్రబాబు హెరిటేజ్‌ను తప్ప మరి దేన్నీ డెవలప్‌ చేయలేదని గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి, సేకరణ తమ హయాంలోనే పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు పాల ఉత్పత్తి రెండు లక్షల లీటర్లకు చేరుకుందని ఆయన తెలిపారు. పశుక్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటా పశు సంపద పెరిగేందుకు కృషి చేసామని, తద్వారా గణనీయమైన పాల ఉత్పత్తి సాధ్యమయిందని వైఎస్‌ వివరించారు.

Read Full Post »

న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఆర్థిక మాంధ్య ప్రభావంతో చమురు ధరలు దిగొచ్చాయి. ఒక దశలో 150 డాలర్లకు చేరువైన బ్యారల్‌ ముడి చమురు ధర ప్రస్తుతం 73 డాలర్ల కనిష్ట స్థాయిని చేరుకున్నది. గ్లోబల్‌ మార్కెట్లు క్షీణించడం, లిక్విడిటీ సమస్యలు, ఆహార సంక్షోభం, డాలర్‌ విలువ పెరగడం కారణంగా చమురు ధరలు బాగా తగ్గినట్లు పరిశీలకులు వివరిస్తున్నారు. జనవరి నాటికి బ్యారల్‌ చమురు 50 డాలర్ల కనిష్ట స్థాయికి చేరినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోపక్క డిమాండ్‌ కంటే సరఫరా అధికం కావడం చమురు ధరలు క్షీణించడానికి మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక కల్లోలం కారణంగా వివిధ దేశాలు చమురు దిగుమతులను కొంత మేర తగ్గించాయి. కొన్ని ఆఫ్రికా దేశాలైతే చమురు అంటేనే అదో అనవసర ఖర్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇలా వివిధ కారణాల వలన చమురు ధరలు బాగా క్షీణించాయి. అయితే ఇంతకు ముందులా క్షీణించిన చమురు ధరలు మార్కెట్లపై ప్రభావం చూపకపోవడం ఇన్వెస్టర్లలోని స్తబ్ధతకు నిదర్శనంగా కనిపిస్తున్నది.

Read Full Post »

న్యూఢిల్లీ : హిందూ మత విశ్వాసాలకు రామసేతు ప్రతీక కాదంటూ కేంద్రం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫడవిట్‌ను జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యతిరేకించారు. ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి గురువారం సుప్రీం కోర్టుకు తమ అభ్యంతరం తెలియజేశారు. రామసేతును పురావస్తు సంపదగా ప్రకటించి, రక్షించేేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుబ్రహ్మణ్య స్వామి లిఖిత పూర్వకంగా కోర్టుకు విన్నవించారు. కేంద్రం ఇచ్చిన అఫిడవిట్‌పై విచార ణ జరుపుతున్న సుప్రీం కోర్టు పిటిషనర్ల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నది.

Read Full Post »

Older Posts »