Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్ 23rd, 2008

బెంగళూరు : బెంగళూరులో ఓ భారీ భవనం కుప్పకూలింది. ఈ భవనం శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Read Full Post »

న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం కింద ఉద్యోగి సర్వీసు కాలంలో పొందిన అదనపు విద్యార్హతలు వెల్లడించాలని సమాచార కమిషన్‌ ఆదేశించింది. ఆ విషయం వ్యక్తిగతం కాదని సమాచార కమిషనర్‌ సత్యానంద మిశ్రా తెలిపారు. లెఫ్టినెంట్‌ కల్నన్‌ పర్వీందర్‌ అహ్లువాలియా పిటిషన్‌ విచారణకు స్వీకరించిన కమిషన్‌ ఈ మేరకు తీర్పు చెప్పింది. యాదవ్‌ అనే ఆర్మీ ఉద్యోగి న్యాయశాస్త్రంలో డిగ్రీ ఎక్కడి నుంచి పొందాడు? అధికారిక అనుమతి ఉందా? తదితర విషయాలపై ఆయన అధికారులను ఆర్టీఐ చట్టం కింద వెల్లడించాలని పిటిషనర్‌ కోరారు. ఆర్మీ అధికారులు ఈ విషయం వ్యక్తిగతమైనదని… ఆర్టీఐ చట్టం కిందని రాదని చెప్పడంతో అహ్లువాలియా కమిషన్‌ను ఆశ్రయించారు.

Read Full Post »

న్యూఢిల్లీ : చత్తీస్‌ఘడ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం సీఆర్‌పీఎఫ్‌ బలగాలకు ఓ సవాల్‌ అని సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వి.కె.జోషి తెలిపారు. ఇటీవల జవాన్లపై దాడులు పెరిగిపోయాయని విలేకరులకు చెప్పారు. ఆ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ అక్కడి ప్రభుత్వానికే పెద్దసవాల్‌గా పరిణమించిందని… ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రత కల్పిస్తామని వెల్లడించారు.

Read Full Post »

హైదరాబాద్‌ : భాజపా అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ ఆత్మకథ ‘మై కంట్రీ -మై లైఫ్‌’కు తెలుగు అనువాదమైన ‘నాదేశం- నాజీవితం’ పుస్తకాన్ని గురువారం ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాజపా అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, చింతల రామచంద్రారెడ్డి, చిన్నజీయర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read Full Post »

హైదరాబాద్‌ : కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో శుక్రవారంలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముంది.

Read Full Post »

హైదరాబాద్‌ : సాంకేతిక లోపం సవరించడంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ బయలుదేరిన రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో వరంగల్‌ జిల్లా రఘునాథపల్లి వద్ద నిలిపివేశారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని లోపాన్ని సవరించారు.

Read Full Post »

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరి నారాయణరావుని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పరామర్శించారు. చిరంజీవి దంపతులు, అల్లుఅరవింద్‌ ఆసుపత్రికి వచ్చి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

Read Full Post »

హైదరాబాద్‌ : భాజపా రథానికి వాజ్‌పేయి, అద్వానీ కృష్ణార్జునులు వంటివారని ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అన్నారు. గురువారం అద్వానీ ఆత్మకథ ‘నా దేశం-నా జీవితం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. భారత రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు లాల్‌కృష్ణ అద్వానీ అని… ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ పుస్తకం ఓ యోధుడి జీవిత చరిత్రగా అభివర్ణించారు. నడుస్తున్న చరిత్రను రాజకీయం శాసిస్తోందనీ.. రాజకీయ నాయకుడికి, రాజనీతిజ్ఞుడికి వ్యక్తిత్వం, దార్శనికత అనే మౌలిక తేడాలున్నాయన్నారు. అద్వానీ ఆత్మ దేశంతో ముడిపడి పోయిందనీ… నిజాయితీ, నిబద్ధతతో రాజనీతిజ్ఞుడిగా ఎదిగారని అన్నారు. 21వ శతాబ్ధం భారతదేశానిదే కావాలని ఆయన ఆశయమని చెప్పారు. ఆరు దశాబ్దాల భారత దేశ చరిత్రలోని కీలక పరిణామాలు.. ఈ పుస్తకంలో ఐదువిభాగాల్లో కళ్లకు కట్టారన్నారు.

Read Full Post »

గుంటూరు : రైతులకు ఎరువులు సరఫరా చేయాలని కోరుతూ లెఫ్ట్‌, తెదేపా నేతలు తలపెట్టిన గుంటూరు కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. రైతులకు ఎరువులు సరఫరా చేయకుండా… వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని కోడెల ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. మరోవైపు నిజామాబాద్‌లో స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ తలపెట్టిన మహాధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ధర్నాకు అనుమతి లేదంటూ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

Read Full Post »

జమ్మూ : ఎన్నికలు బహిష్కరించాలంటూ వేర్పాటువాదులు ఇచ్చిన పిలుపుపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ‘ఎన్నికలు బహిష్కరించాలనుకుంటే మీరు పిలుపు ఇచ్చుకోండి… ఇందుకోసం ప్రజలను వత్తిడికి గురిచేయవద్దు అంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ద్వారా ప్రజల మనోభావాలు తెలుస్తాయని చెప్పారు. జమ్మూ, కాశ్మీర్‌కు వేర్వేరు మేనిఫెస్టోలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. త్వరలో తాము ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు.

Read Full Post »

Older Posts »