Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్ 25th, 2008

ఓ వైపు గిల్‌క్రిస్ట్, మరోవైపు ఆసీస్ మీడియా భారత ఆటగాళ్ళపై విమర్శల వర్షం కురిపిస్తోంటే, ఆసీస్ ఓపెనర్ మాథ్యూహెడెన్ మాత్రం ప్రశంసిస్తున్నాడు. సీరీస్‌కు ముందు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌పై విరుచుకుపడ్డ హెడెన్ ఇప్పుడు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. బజ్జీ గొప్ప బౌలర్ అని, మొహాలీ టెస్టును భారత్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడని అన్నాడు. అతని బౌలింగ్‌లో ఆడటం ఓ ఛాలెంజ్‌గా హెడన్ అభివర్ణించాడు.

Read Full Post »

ప్రపంచ చెస్ టైటిల్ కిరీటానికి భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాధన్ ఆనంద్ ఒక్క పాయింట్ దూరంలో ఉన్నాడు. జర్మనీలో జరుగుతున్న ఛాంపియన్ షిప్ పోరులో రష్యన్ ఆటగాడు క్రామ్నిక్ కంటే మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. నిన్న జరిగిన ఎనిమిదో గేమ్ డ్రాగా ముగిసింది. ౩9 ఎత్తుల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లభించకపోవడంతో ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. మొత్తం 12 గేమ్ ల ఈ పోటీలో మరో నాలుగు గేములు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక విజయం, లేదా రెండు డ్రాలు చేసుకున్నా ఆనంద్ విజేతగా అవతరిస్తాడు.

Read Full Post »

హాంకాంగ్: చైనాలోని హాంకాంగ్ లో చెక్కతో చేసిన శవ పేటికలను తయారు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి పట్ల వున్న ప్రేమ, అభిమానాన్ని బట్టి రకరకాల డిజైన్లతో వీటిని తయారు చేస్తున్నారు. పూర్తిగా హ్యాడ్ మేడ్ తో తయారుచేసే ఈ శవ పేటికలు లైట్ వెయిట్ ఉండడమేకాక.. తక్కువ ఖర్చుతో పొందవచ్చని తయారీదారులు చెబుతున్నారు. ట్రెడిష్ నల్ ఉడ్, గ్రీన్ ఉడ్ తో చేసిన వీటికి వార్నీస్ వేయడంతో మరింత కాంతివంతంగా కనిపిస్తున్నాయి. అతి తక్కువ బరువు వుండటం వల్ల వీటిని పేపర్ శవపేటికలు అని పిలుస్తారు. దీని లోపల కూడా తెల్లని పరువు వంటి క్లాత్ ను అమర్చి ఎంతో అందంగా తయారు చేశారు. వీటిని చూస్తుంటే పూర్వం రాజులు సమాదులను ముందుగానే కట్టించుకున్నట్లు. ఇప్పుడు మనకు నచ్చిన శవపేటికలను మనమే తయారుచేయించు కోవచ్చు అనిపిస్తుంది కదూ.

Read Full Post »

అమెరికాలో మొట్ట మొదటి సారిగా ఒక నల్ల జాతీయుడు ఆ దేశ ఆధ్యక్షుడు కాబోతున్నాడని కె.ఏ పాల్‌ అన్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నఓబామా కు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. అణగారిన వర్గాలు రాజ్యాధికారం పొందడం ద్వారానే బాగుపడుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిసి, మైనార్టీలు, దళితులు రాజ్యాధికారం చేపట్టినప్పుడే పీడన నుంచి విముక్తి చెందుతారని పాల్‌ అభిప్రాయపడ్డారు.

Read Full Post »

ఒకటి చేయబోతే మరేదో అయిన చందంగా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ధ్యేయంగా బహిరంగ ప్రదేశాలలో ధూమపానంపై విధించిన నిషేధం అందుకు పూర్తిగా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తోందని అస్సోచామ్ (అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్) విడుదల చేసిన సర్వే వెల్లడించింది. పొగ తాగడాన్ని నిషేధించిన దరిమిలా దేశంలో ‘గుట్కా’ వంటి పొగాకు ఉత్పత్తుల వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయినట్లు ఆ నివేదికలో స్పష్టమైంది. అయితే, ఈ నిషేధం కారణంగా దేశవ్యాప్తంగా సిగిరేట్లు, బీడీల విక్రయాలు 25 శాతం మేర తగ్గాయి. ధూమపానం వల్ల ఎక్కువ చేటును ఎదుర్కొంటున్న దిగువ మధ్యతరగతుల వారిపై ఈ నిషేధం ప్రభావం అత్యల్పంగా ఉండటంలో ఆశ్చర్యమేమి లేదు. అస్సోచామ్ సాంఘిక అభివృధ్ధి వేదిక (ఈస్ డి ఎఫ్) 1500 రిటైల్ పొగాకు బడ్డీలను నమూనాగా తీసుకుని ఈ సర్వే నిర్వహించింది. గుట్కా, ఖైనీ, జర్ధా, పాన్ మసాలా విక్రయాలు అధికం అయ్యయి. ఈ ఉత్పత్తుల వాడకం హెచ్చిన నగరాలలో హైదరాబాద్, పాట్నా, లక్నో, ముంబై, అలీగన్, కాన్పూర్, బనారస్, అలహాబాద్, ఢిల్లీ కూడా ఉన్నయి. సర్వేలో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వారిలో సుమారు 65 శాతం మంది తమకు సిగిరేట్లు లేదా బీడీలు తాగడం, ఇతర పొగాకు ఉత్పత్తులు నమలడం వంటి రెండు దురలవాట్లు ఉన్నయని వెల్లడించారు. తక్కువ ఆదాయం, దిగువ మధ్య ఆదాయం ఉన్న కుటుంబాలలో పొగాకు వాడకం అత్యధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

Read Full Post »

వరంగల్‌: వరంగల్‌ అనగానే మనకు గుర్తుకు వచ్చేది కాకతీయులు, వారు నిర్మించిన అద్భుతమైన కట్టడాలు. అయితే పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా కాకతీయుల కట్టడాలలో ముఖ్యమైన హన్మకొండలోని వేయి స్తంభాల మండపం తన పూర్వ వైభవాన్ని కోల్పోతుంది. వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాకతీయ రాజులు  అనేక దేవాలయాలు, మండపాలు నిర్మించారు. క్రీ.శ.1162లో రుద్రదేవుడు  రుద్రేశ్వరాలయాన్ని నిర్మించారు. ఆ ఆలయం ముందే వేయి స్తంభాలతో ఒక మండపాన్ని నిర్మించడంతో ఇది వేయి స్తంభాల దేవాలయంగా చారిత్రక ప్రసిద్ధి చెందింది. గుడి నిర్మాణం, చిత్రకళను చూసిన ప్రతి ఒక్కరు మంత్ర ముగ్దులవుతారు. అందుకే ఈ దేవాలయం జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్శిస్తోంది. వేయి స్తంభాల మండపం క్రమంగా తన పూర్వ వైభవాన్ని కోల్పోతుంది. వేయి స్తంభాలతో నిర్మించిన ఈ మండపంలో అనేక స్తంభాలు ఎత్తుకెళ్ళారు. కొన్ని స్తంభాల విరిగిపోయాయి. చివరకు ఐదు వందల స్తంభాలు మాత్రమే మిగిలాయి. ప్రభుత్వ ఆదరణ కరువవడంతో ఆ మండపం కాస్త శిథిలావస్థకు చేరుకుంది. పర్యాటక రంగానికి పెరుగుతున్న ప్రాముఖ్యత దృష్ట్యా వేయి స్తంభాల మండపాన్ని పునర్‌నిర్మాణం పేరుతో ఆ మండపాన్ని ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తొలగించింది. రెండున్నర సంవత్సరాలుగా కళ్యాణ మండపం పునర్‌ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఇందు కోసం కేటాయించిన నిధులు చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో కుప్పలుగా పడి  ఉన్న స్తంభాలను చూసి పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించి వేయి స్తంభాల మండపానికి గత వైభవం తీసుకు రావాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు.

Read Full Post »

విజయవాడ : కోతి కల్లు తాగి చిందులేసిన చందాన.. కొందరు ఆకతాయి కుర్రాళ్లు మద్యం సేవించి… చేసిన అల్లరి పని కాస్తా విద్రోహ చర్యగా మారింది. ప్రస్తుతం వారు రైల్వే పోలీసుల అదుపులో ఉన్నారు. విజయవాడ సమీపంలోని ఇందుపల్లికి చెందిన కొందరు యువకులు స్థానిక రైల్వే స్టేషన్‌ పరిసరాలకు చేరుకుని మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వీరికి రైలు పట్టాలపై ఏదైనా వస్తువు అడ్డుపెడితే రైలు ఎలా పడుతుందో చూడాలని కోరిక కలిగింది. అనుకున్నదే తడువు అక్కడే ఉన్న పట్టాల ముక్కలను రైలు పట్టాలపై పెట్టి అక్కడి నుంచి జారుకున్నారు. ఇంతలో నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ అదే ట్రాక్‌పై వచ్చి ఆ పట్టాల ముక్కలను డీకొట్టడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో డ్రైవర్‌ రైలును నిలిపివేశాడు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా ప్రమాదానికి కారకులైన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.. అందులో ఒక్కరు మాత్రమే మేజర్ కాగా.. మిగిలిన వారంతా 8, 9 తరగతులు చదివే విద్యార్థులు కావడం గమనార్హం.. చిన్న తనంలో చేసిన ఆకతాయి పనులే… పెద్దపెద్ద విద్రోహక చర్యలకు పునాదులవుతాయి. పెద్దలు వెంటనే వారిని సంస్కరించి సన్మార్గంలో పెట్టక పోతే భవిష్యత్‌లో పెడ త్రోవ పట్టే ప్రమాదముంది.

Read Full Post »

దీపావళి పండుగ సందర్భంగా బిగ్‌ఎఫ్‌ఎమ్‌ బిగ్‌ దివాలీ బోనస్‌ గా “ఆవకాయ్‌ బిర్యానీ” సిని టీమ్‌తో శ్రోతలు కలిసే అవకాశం ఇచ్చింది. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల, హీరో కమల్‌కామరాజు, హీరోయిన్‌ బిందు మాధవి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో కలిసి సినిమా టీమ్‌ మనీ మెషన్‌గేమ్‌ ఆటను ఆడారు. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇచ్చారు.

Read Full Post »

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండగా మారనుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదలడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Read Full Post »

జాక్టో జరుపుతున్న సమ్మె నాలుగో రోజుకు చేరింది. జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పాఠశాల విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జాక్టో నేతలతో జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి నివేదిస్తానని తుది నిర్ణయం ఆయనే తీసుకుంటారని మంత్రి ప్రకటించారు. జాక్టో నేతలతో మంత్రి దామోదర రాజనర్సింహ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. టీచర్ల డిమాండ్లపై మంత్రి 24గంటలు గడువుకోరారు. అన్నిశాఖలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అయితే మంత్రి హామీపై సంతృప్తిచెందని టీచర్లు సమ్మె కొనసాగింపుకు పిలుపునిచ్చారు. ఈరోజు కలెక్టరేట్ల ముట్టడి ముందు అనుకున్న విధంగా సాగుతుందని జాక్టో నేతలు స్పష్టంచేశారు. అటు టీచర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం సిద్దంగా ఉందని సమ్మెను విరమించి ఉద్యోగాలలో చేరాలని మంత్రి రాజనర్సింహ ఉపాద్యాయులను కోరారు. శాఖపరమైన సమస్యలతో పాటు ఆర్థిక భారం ప్రభుత్వంపై పడే సమస్యలు కూడా ఉన్నాయన్న మంత్రి వీటిని పరిష్కరిస్తామన్నారు. టీచర్ల సమ్మెకు టీఆర్ ఎస్ సంఘీభావాన్ని ప్రకటించింది. ఉపాధ్యాయుల సమ్మెతో విద్యార్ధుల చదువులు పూర్తిగా అటకెక్కాయి. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను నాన్చకుండా ప్రభుత్వం పరిష్కారమార్గాన్ని చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Full Post »

Older Posts »